Metal Stocks: ప్రస్తుత పరిస్థితుల్లో మెటల్ స్టాక్స్ కొనొచ్చా.. గత మూడు నెలల్లో వాటి పరిస్థితేంటో ఒక్కసారి తెలుసుకోండి?
ప్రస్తుతం మెటల్ స్టాక్స్ కొనాలంటే ఆలోచించి అడుగేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే గత మూడు నెలల్లో వాటి పరిస్థితే అందుకు ప్రధాన కారణం. మరీ ఇప్పుడు వాటిని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే వాస్తవ పరిస్థితులేంటో ఒక్కసారి తెలుసుకోండి.
Metal Companies Shares: మెటల్ స్టాక్‌ల మెరుపులు ఇటీవల చాలా వరకు క్షీణించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గత మూడు నెలల్లో, BSE మెటల్ ఇండెక్స్ 20% కంటే ఎక్కువ పడిపోయింది. ఇదే సమయంలో BSE సెన్సెక్స్ కేవలం రెండు శాతం మాత్రమే తగ్గడం ఇక్కడ గమనించదగ్గ మరో విషయం. ఈ నేపథ్యంలో జూలై నెలలో ఈ రంగంలో కాస్త వెలుగు కనిపించినా ఈ రికవరీ ఎంత బలంగా ఉంది? ఇది ఎక్కువ కాలం కొనసాగుతుందా? అనే అనుమానాలు అందరిలో ఉన్నాయి. పడిపోవడానికి కారణాలేంటో తెలుసుకుందాం: ముందుగా గత మూడు నెలల్లో మెటల్ స్టాక్స్ ఎందుకు పడిపోయాయో అర్థం చేసుకుందాం. మెటల్ స్టాక్స్ ను షేర్ హోల్డర్స్ అమ్మేసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అన్నింటిలోకి మొదటిది, ద్రవ్యోల్బణం. చాలా దేశాలలో, ద్రవ్యోల్బణం రేటు దశాబ్దాల స్థాయి కంటే ఎక్కువగా ఉంది.
వాస్తవానికి, కరోనా తర్వాత గత రెండేళ్లలో, చాలా దేశాలు ఆర్థిక వ్యవస్థలో నగదు ప్రవాహాన్ని పెంచాయి. ఆర్థిక వ్యవస్థలో మందగమనం, చైనా నుంచి తక్కువ లేదా అనిశ్చిత మెటల్ డిమాండ్, మాంద్యం పరిస్థితి వంటి అనేక కారణాల వల్ల గ్లోబల్ డిమాండ్ ప్రభావితమైంది. ఇదే సమయంలో US సెంట్రల్ బ్యాంక్ అనేక సార్లు వడ్డీ రేట్లను పెంచింది. సింపుల్‌గా చెప్పాలంటే వీటన్నింటి వల్ల లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో మెటల్ కంపెనీల షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి.
దేశంలో వచ్చిన మార్పులు తెలుసుకుందాం: ఇప్పుడు దేశంలో ఈ రంగంలో వచ్చిన మార్పుల గురించి చెప్పుకుందాం. దేశీయ సరఫరాను పెంచడానికి, 21 మే 2022న, భారత ప్రభుత్వం ఉక్కు ఉత్పత్తులపై 15% ఎగుమతి సుంకాన్ని విధించింది. దీని కారణంగా, జూన్ 2022లో ఉక్కు ఉత్పత్తుల ధరలు 12 శాతం తగ్గాయి. ఇది కాకుండా, ఎగుమతి సుంకం విధించడం వల్ల ఉక్కు ఎగుమతులు క్షీణించడంతో, ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో అంటే ఏప్రిల్ నుంచి జూన్ త్రైమాసికంలో ఈ రంగం అమ్మకాల గణాంకాలు దారుణంగా ఉండబోతున్నాయని ఇన్వెస్టర్స్ నమ్మారు. దీంతో 10-15 రోజుల పాటు వ్యాపారం నిలిచిపోయి ఎగుమతులు నిలిచిపోయాయి.
వాల్యూమ్‌లలో తగ్గుదల, కోకింగ్ బొగ్గు అధిక ధర కారణంగా కంపెనీల క్వార్టర్-ఆన్-క్వార్టర్ EBITDA క్షీణించవచ్చని బ్రోకరేజ్ హౌస్ సెంట్రమ్ భావిస్తోంది. బ్రోకరేజ్ హౌస్ ఈ రంగంపై సానుకూల దృక్పథాన్ని కలిగి ఉన్నప్పటికీ, రుతుపవనాల తర్వాత చైనా నుంచి డిమాండ్ అదేవిధంగా దేశీయ డిమాండ్ రెండూ మెరుగుపడతాయని భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని హిందాల్కో, టాటా స్టీల్, జేఎస్‌పీఎల్, వేదాంత వంటి షేర్లపై పందెం వేయవచ్చని సెంట్రమ్ అభిప్రాయపడింది.
టాటా స్టీల్ ఇటీవలి త్రైమాసిక ఫలితాలు చాలా నిరాశాజనకంగా ఉన్నాయి. కంపెనీ జూన్ త్రైమాసిక లాభం దాదాపు 13 శాతం క్షీణించింది. కానీ EBITDA మార్జిన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 24% మెరుగుపడింది. అలాంటి కొన్ని సానుకూల కారణాల వల్ల, విశ్లేషకులు దీనిని కొనుగోలు చేయాలని సలహా ఇస్తున్నారు.
ఇప్పుడు ఇన్వెస్టర్లు ఏమి చేయాలో తెలుసుకోవడం చాలా అవసరం అని చెప్పవచ్చు. మెటల్ స్టాక్స్ ప్రాథమికంగా చక్రీయ స్వభావం కలిగి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ స్టాక్స్ డౌన్‌ట్రెండ్‌లో ఉన్నప్పటికీ పెట్టుబడిదారులకు టర్న్‌అరౌండ్ కోసం ఓపికగా వేచి ఉండటమే ఉత్తమ మార్గం. ఆ అధిక లాభాల మార్జిన్, బలమైన బుక్ కీపింగ్, తక్కువ రుణాలు , క్యాప్టివ్ మైన్స్ ఉన్నవారు కంపెనీలపై ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు.
జార్విస్ ఇన్వెస్ట్ వ్యవస్థాపకుడు, CEO సుమిత్ చందా మాట్లాడుతూ, ఒక పెట్టుబడిదారు ఇప్పటికీ మెటల్ షేర్లను కలిగి ఉన్నట్లయితే, అతను దాదాపు 20 శాతం నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంది. కాబట్టి నా సూచన ఏమిటంటే, మీ రిస్క్ ప్రొఫైల్ అదేవిధంగా ఇన్వెస్ట్‌మెంట్ హోరిజోన్ ప్రకారం, పెట్టుబడిదారుడు ప్రతికూలతను కొనుగోలు చేసి, సగటు ధరను నిర్ణయించుకోవాలి. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికం నాటికి పరిస్థితి తారుమారవుతుందని మనం ఆశించవచ్చు. అయితే స్టాక్ ఈ స్థాయిల నుంచి 25 శాతం వరకు పెరిగినప్పుడు, అప్పుడు బ్రేక్ ఈవెన్ ఉంటుంది. అంటే మునుపటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి మొత్తంమీద మెటల్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసేవారికి తక్షణ ఉపశమనం లభించదని తెలుస్తోంది. మెరుగైన ఆర్థిక వాతావరణం ఉన్నప్పుడే ఈ స్టాక్‌లలో పందెం రివర్స్ అవుతుంది..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి