Ola Electric Scooter: మీరు ఓలా స్కూటర్‌ను బుక్ చేసి డెలివరీ కోసం చాలా కాలంగా వేచి ఉంటే ఇది మీకు శుభవార్తే అని చెప్పాలి. ఎందుకంటే మీ నిరీక్షణ త్వరలో ముగియనుంది. డిసెంబర్ 15 నుంచి ఓలా భారతదేశంలో S1, S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. చెప్పిన గడువులో ఎటువంటి ఆలస్యం జరగదని కంపెనీ వెల్లడించింది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల పంపిణీ ప్రారంభమైందని ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
కంపెనీ డైరెక్ట్-టు-కస్టమర్ సేల్ మోడల్‌ను ఉపయోగిస్తోంది. అంటే డీలర్‌షిప్ లేదా మధ్యవర్తి ప్రమేయం ఉండదు. Ola S1, Ola S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లు నేరుగా కస్టమర్ల ఇంటి వద్దకే డెలివరీ చేస్తారు. సహజంగానే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు సంబంధించిన గడువుతో కంపెనీకి ముందుగా కొంత ఇబ్బంది ఏర్పడింది. Ola ఓలా ఎలక్ట్రిక్ టెస్ట్ రైడ్‌లు, డెలివరీలను ప్రారంభించడానికి గడువును అక్టోబర్ 25 నుంచి నవంబర్ 10 వరకు పొడిగించింది. అనంతరం నవంబర్ 10 నుంచి టెస్ట్ రైడ్‌లను ప్రారంభించగలిగింది. అయితే ఇప్పుడు డిసెంబర్ 15 నుంచి డెలివరీ ప్రారంభించనుంది. ఇందులో ఎటువంటి మార్పు లేదు.
Ola Electric ఇప్పుడు Ola S1, Ola S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌లను బుక్ చేసుకోవడానికి రెండో విడత డిసెంబర్ 16 నుంచి ప్రారంభించాలని భావిస్తోంది. కంపెనీ మొదట నవంబర్ 1 నుంచి రెండో విడత ఆర్డర్‌లను తీసుకోవాలని భావించింది. అయితే Ola S1, Ola S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌ల కోసం మొదటి బ్యాచ్ బుకింగ్‌ల సమయంలో వచ్చిన విపరీతమైన డిమాండ్ కారణంగా తేదీని వాయిదా వేయవలసి వచ్చింది. 8.5 kW (5.5 kW పవర్)తో పనిచేసే Ola S1 , S1 ప్రో ధర వరుసగా రూ. 99,999, రూ. 129,999.