2023-24 కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ భారీ ప్రకటనే చేశారు. ఈసారి ఇండియన్ రైల్వేకు కేంద్ర ప్రభుత్వం పెద్ద బహుమతిని ఇచ్చింది. ప్రయాణికులు అన్ని రకాల సౌకర్యాలు పొందేందుకు వీలుగా రైల్వేశాఖకు 9 రెట్లు అధికంగా నిధులు కేటాయింపులు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైల్వేకు ప్రభుత్వం రూ.2.40 లక్షల కోట్లు కేటాయించింది. రైల్వేకు కేటాయించిన ఈ మొత్తం.. అన్ని రకాల స్కీమ్‌కు వర్తిస్తుందని తెలిపారు. 2013-14 సంవత్సరంతో పోలిస్తే ఈ రైల్వే బడ్జెట్ దాదాపు 9 రెట్లు ఎక్కువ. ఇదే అతిపెద్ద కేటాయింపు కూడా.
రైల్వేశాఖకు సంబంధించి 100 కొత్త పథకాలు ప్రారంభించాలని నిర్ణయించారు. దీంతో పాటు కొత్త పథకాలకు రూ.75 కోట్ల నిధులు కేటాయించారు. ప్రయాణికుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
మరిన్ని బడ్జెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..