Bitcoin: బిట్ కాయిన్ ఇన్వెస్టర్లకు పండుగ.. నెల రోజుల్లో భారీగా పెరిగిన ధర

ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో పెట్టుబడిదారులు ఆలోచన మారింది. ముఖ్యంగా పెరిగిన ఆర్థిక అక్షరాస్యత నేపథ్యంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడినిచ్చే పథకాలపై ఆసక్తి చూపుతున్నారు. అలాగే తక్కువ సమయంలోనే అధిక లాభాలను పొందాలని కోరుకుంటున్నారు. పెట్టుబడి రిస్క్ అయినా పర్లేదు కానీ అధిక రాబడి కోరుకునే వారు ఎక్కువగా ఉన్నారు. ఇటీవల కాలంలో బిట్ కాయిన్‌లో పెట్టుబడి వారికి అధిక రాబడి వచ్చింది.

Bitcoin: బిట్ కాయిన్ ఇన్వెస్టర్లకు పండుగ.. నెల రోజుల్లో భారీగా పెరిగిన ధర
Bitcoin
Follow us
Srinu

|

Updated on: Dec 06, 2024 | 4:15 PM

ఇటీవల బిట్‌కాయిన్ పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను విస్మయానికి గురి చేసింది. భారతీయ పెట్టుబడిదారులు ఇటీవల కాలంలో బిట్ కాయిన్స్‌లో పెట్టుబడికి ఆసక్తి చూపుతున్నారు. నవంబర్ 5, 2024న బిట్‌కాయిన్ ధర 67,800 డాలర్లు అంటే సుమారు రూ. 58 లక్షలు ఉంటే డిసెంబర్ 5 నాటికి బిట్‌కాయిన్ ధర 1,02,639 డాలర్లకు సుమారు రూ. 88 లక్షలకు చేరుకుంది. బిట్ కాయిన్ ధర మునుపెన్నడూ లేని విధంగా కేవలం ఒక నెలలో 51 శాతం జంప్ చేయడం ఆశ్చర్యపరిచిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో రాజకీయ, ఆర్థిక పరిణామాల నేపథ్యంలో బిట్ కాయిన్ ధర భారీగా పెరిగిందని పేర్కొంటున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఇటీవలి విజయం సాధించడంతో బిట్ కాయిన్స్‌లో పెట్టుబడికి ఇన్వెస్టర్లు ఎగబడ్డారు. ఎన్నికల సమయంలో ట్రంప్ ప్రో క్రిప్టోగా విస్తృతం ప్రచారం చేయడంతో ట్రంప్ విజయంతో క్రిప్టోకరెన్సీ మార్కెట్‌లో కొత్త విశ్వాసాన్ని రేకెత్తించిందని వివరిస్తున్నారు

ఓ పెట్టుబడిదారుడు నవంబర్ 5న బిట్‌కాయిన్‌లో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే ప్రస్తుత పెరుగుదలతో రూ.1,51,712 చేరుకుంది. అంటే ఒక నెలలో లాభం రూ. 51,712గా ఉంది. అంటే నెలలోనే 51.7 శాతం రాబడి వచ్చింది. అలాగే రూ. 10 లక్షల పెట్టుబడిపై రూ. 5,17,120, రూ.50 లక్షల పెట్టుబడిపై లాభం రూ.25,85,600. బిట్ కాయిన్ పెరుగుదల అనేది ట్రంప్ ఎన్నికల విజయంతో ఆధారపడిం ఉందని నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ ఎన్నికతో బిట్ కాయిన్ అధిక లాభాలను అందించింది. క్రిప్టోకరెన్సీల కోసం అనుకూలమైన రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను ట్రంప్ గతంలో సూచించాడు. అందువల్ల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆయన విజయం క్రిప్టోకరెన్సీ మార్కెట్‌ను పెంచింది.

డిజిటల్ ఆస్తులలో సంస్థాగత పెట్టుబడిని ప్రోత్సహిస్తూ ట్రంప్ పరిపాలన వ్యాపార స్నేహపూర్వకంగా ఉంటుందని భావిస్తున్నారు. క్రిప్టో అనుకూల ప్రభుత్వం కఠినమైన నిబంధనలకు సంబంధించిన ఆందోళనలను తగ్గించి, మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచుతుంది. క్రిప్టోకరెన్సీలకు ప్రపంచవ్యాప్త ఆమోదం పెరుగుతుండటంతో భారతీయ పెట్టుబడిదారులు బిట్‌కాయిన్‌ను ఎక్కువగా అన్వేషిస్తున్నారు. వాజిర్ ఎక్స్, కాయిన్ స్విచ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు తాజా ర్యాలీ మధ్య అధిక ట్రేడింగ్ వాల్యూమ్‌లను నివేదించాయి. అయితే భారతదేశంలో నియంత్రణ అనిశ్చితి ఆందోళనకరంగానే ఉందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి