Cyber Scam: ఫేస్‌బుక్‌లో నకిలీ ప్రకటనలు.. రూ.3 కోట్లు మోసపోయిన దంపతులు

ఇటీవల కాలంలో పెరిగిన టెక్నాలజీ ప్రజలకు ఎంత మేలు చేస్తుందో? అంతే కీడు చేస్తుంది. పెరిగిన టెక్నాలజీను వాడి ఇతరుల చేసే మోసాలను సామాన్యులు బలవుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాను వాడుకుని చేసే మోసాల సంఖ్య విపరీతంగా పెరిగింది. తాజాగా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఇందిరాపురం ఘజియాబాద్‌‌కు చెందిన దంపతులు ఫేస్‌బుక్‌లో ఆన్‌లైన్ ప్రకటనలు చూసి రూ. 3 కోట్లకు పైగా నష్టపోయారు. ఈ సైబర్ మోసంపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Cyber Scam: ఫేస్‌బుక్‌లో నకిలీ ప్రకటనలు.. రూ.3 కోట్లు మోసపోయిన దంపతులు
Cybercrime Racket
Follow us
Srinu

|

Updated on: Aug 13, 2024 | 3:28 PM

ఇటీవల కాలంలో పెరిగిన టెక్నాలజీ ప్రజలకు ఎంత మేలు చేస్తుందో? అంతే కీడు చేస్తుంది. పెరిగిన టెక్నాలజీను వాడి ఇతరుల చేసే మోసాలను సామాన్యులు బలవుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాను వాడుకుని చేసే మోసాల సంఖ్య విపరీతంగా పెరిగింది. తాజాగా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఇందిరాపురం ఘజియాబాద్‌‌కు చెందిన దంపతులు ఫేస్‌బుక్‌లో ఆన్‌లైన్ ప్రకటనలు చూసి రూ. 3 కోట్లకు పైగా నష్టపోయారు. ఈ సైబర్ మోసంపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. నబనిత, మృణాల్ మిశ్రా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని ఇందిరాపురంలో ఉంటారు. ఇటీవల తాను, తన భర్త రూ. 3.1 కోట్లు నష్టపోయామని పేర్కొన్నారు. స్టాక్ ట్రేడింగ్‌లో పెట్టుబడి అంటూ నమ్మించి 22 బ్యాంకు ఖాతాలకు రూ.3.1 కోట్లు బదిలీ చేసి నష్టపోయామని పోలీసుల వద్ద వాపోయారు. ఈ తాజా సైబర్ మోసం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

నబానితా మిశ్రా ఫేస్‌బుక్‌లో ఒక ప్రకటనను చూసి, దానిపై క్లిక్ చేసింది. దీని తర్వాత , వ్యాపార సేవలను అందించడంలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫారమ్ నిర్వహిస్తున్నామని చెప్పి ఓ వాట్సాప్ గ్రూప్‌లో ఆమెను మోసగాళ్లు యాడ్ చేశారు. ఆ గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ రజత్ చోప్రా జీటీసీ పోటీలో పాల్గొనమని గ్రూప్ సభ్యులకు సూచించింది. అయితే . ఇన్వెస్ట్‌మెంట్ సలహా కోసం మొదట నెలవారీ సబ్‌స్క్రిప్షన్ రూ. 2,000 చెల్లించానని, ఆపై షేర్లు, ఐపిఓ ఇన్వెస్ట్‌మెంట్‌లకు కూడా బదిలీలు చేయాలని చెప్పింది. నబానితా మిశ్రాను నమ్మించేందుకు ఆ కంపెనీ కూడా ప్రామాణికమైన సెబీ రిజిస్ట్రేషన్ వివరాలను అందించిందని, వాట్సాప్ గ్రూప్‌లో ఇతరులు తమ పెట్టుబడులపై లాభాలను అందుకున్నట్లు వివరించారని ఫిర్యాదులో స్పష్టం చేసింది. అలాగే లావాదేవీలలో ఒకదాని కోసం కంపెనీ తనకు రూ. 80 లక్షలు అప్పుగా ఇచ్చిందని ఫిర్యాదుదారు తెలిపారు. అయితే ఆమె తన ఖాతాను యాక్సెస్ చేయడానికి ప్రయత్నించినప్పుడు రుణాన్ని తిరిగి చెల్లించమని స్పష్టం చేశారు. 

దీంతో ఆమె ఏం చేయలేక తన తండ్రి ఫిక్స్‌డ్ డిపాజిట్ మొత్తాలను తనఖా పెట్టి అప్పు తీర్చడంతో తన ఖాతాను యాక్సెస్ చేయగలిగింది. కంపెనీ యాప్‌లో ఆమె పెట్టుబడులు, లాభాల వివరాలను తనిఖీ చేయగలిగింది. కానీ ఆమె తన డబ్బును విత్ డ్రా చేసేందుకు మాత్రం కుదరలేదు. డబ్బు విత్‌డ్రా చేయాలంటే పన్ను చెల్లించాలని చెల్లించాలని చెప్పడంతో ఆమె షాక్ అయ్యింది. ఇతర ఐపీఓల్లో డబ్బు విత్‌డ్రా చేయడానికి ఇలాంటి నిబంధనలు లేవని వారిని ప్రశ్నించడంతో  అంతర్జాతీయ నిబంధనలు ఇలానే ఉంటాయని ఆమె బోల్తా కొట్టించడానికి ప్రయత్నించారు. అయితే ఆమె వాట్సాప్ నెంబర్ ద్వారా మోసగాళ్లను సంప్రదించడానికి ప్రయత్నించగా ఆ నంబర్లు స్విచ్ ఆఫ్ వచ్చాయి. దీంతో ఆమె తన భర్త సాయంతో పోలీసులను ఆశ్రయించింది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..