AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Loans: అతి తక్కువ వడ్డీకే గృహ రుణాలిచ్చే బ్యాంకులు ఇవే.. లిస్ట్‌లో ప్రైవేటు బ్యాంకులు కూడా..

మూడు రకాల వడ్డీ రేట్లను బ్యాంకులు అందిస్తాయి. ఫ్లోటింగ్ వడ్డీ, ఫిక్స్ డ్ వడ్డీ, ఈ రెండింటి మిశ్రమంగా ఉండే వడ్డీ. ఆర్బీఐ రెపో రేటును బట్టి ఫ్లోటింగ్ వడ్డీ రేటు మారుతుంటుంది. అంటే రెపో రేటు తగ్గితే.. బ్యాంకుల్లో గృహ రుణ వడ్డీ రేటు కూడా తగ్గిస్తాయి. అయితే ఫిక్స్ డ్ రేటు ఉంటే.. లోన్ కాల వ్యవధి మొత్తం ఒకేలా ఉంటుంది.

Home Loans: అతి తక్కువ వడ్డీకే గృహ రుణాలిచ్చే బ్యాంకులు ఇవే.. లిస్ట్‌లో ప్రైవేటు బ్యాంకులు కూడా..
Home Loan
Madhu
|

Updated on: Aug 13, 2024 | 3:46 PM

Share

ఇటీవల కాలంలో గృహ రుణాలు తీసుకునే వారి సంఖ్య అధికమవుతోంది. సొంతింటి కోసమే, లేక ఉన్న ఇంటిని రీ మోడల్ చేసుకునేందుకనో గృహ రుణాలను తీసుకుంటున్నారు. అయితే గృహ రుణం అనేది దీర్ఘకాలిక భారం. పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుంటారు కాబట్టి.. వాటిని తిరిగి ఈఎంఐల రూపంలో చాలా కాలం చెల్లించాల్సి ఉంటుంది. అసలు వడ్డీతో పాటు ఇది చెల్లించాల్సి ఉంటుంది. ఆ వడ్డీ రేటు అన్ని బ్యాంకుల్లో ఒకేలా ఉండదు. బ్యాంకులను బట్టి మారుతూ ఉంటుంది. పైగా వడ్డీ రేట్లలో కూడా రకాలుంటాయి. మూడు రకాల వడ్డీ రేట్లను బ్యాంకులు అందిస్తాయి. ఫ్లోటింగ్ వడ్డీ, ఫిక్స్ డ్ వడ్డీ, ఈ రెండింటి మిశ్రమంగా ఉండే వడ్డీ. ఆర్బీఐ రెపో రేటును బట్టి ఫ్లోటింగ్ వడ్డీ రేటు మారుతుంటుంది. అంటే రెపో రేటు తగ్గితే.. బ్యాంకుల్లో గృహ రుణ వడ్డీ రేటు కూడా తగ్గిస్తాయి. అయితే ఫిక్స్ డ్ రేటు ఉంటే.. లోన్ కాల వ్యవధి మొత్తం ఒకేలా ఉంటుంది. అదే సమయంలో రుణ గ్రహీతలకు వడ్డీ రేటు నిర్ణయించేటప్పుడు ప్రధానంగా ఆ వ్యక్తుల క్రెడిట్ స్కోర్, లోన్ మొత్తం, ఎల్టీవీ నిష్పత్తి, ఉద్యోగం వంటి అనేక అంశాలను పరిగణనలోకి బ్యాంకులు తీసుకుంటాయి. ఈ నేపథ్యంలో ఏ బ్యాంకుల్లో తక్కువ వడ్డీ ఉంది? ఏ బ్యాంకులో లోన్ తీసుకుంటే మనకు ప్రయోజనం చేకూరుతుంది? తెలుసుకోవాలి. అందుకే మన దేశంలో తక్కువ వడ్డీ అందించే బ్యాంకుల గురించి తెలుసుకుందాం..

పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు..

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో గృహ రుణాలపై వడ్డీ రేట్లను ఇప్పుడు చూద్దాం.. వివిధ బ్యాంకుల్లో రూ. 75లక్షలకు పైగా రుణ మొత్తంపై వడ్డీ రేట్ల వివరాలు ఇవి..

  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 8.50శాతం నుంచి 9.85 శాతం
  • బ్యాంక్ ఆఫ్ బరోడా: 8.40శాతం నుంచి 10.90శాతం
  • యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 8.35శాతం నుంచి 10.90శాతం
  • పంజాబ్ నేషనల్ బ్యాంక్: 8.40శాతం నుంచి 10.15శాతం
  • బ్యాంక్ ఆఫ్ ఇండియా: 8.40శాతం నుంచి 10.85శాతం
  • కెనరా బ్యాంక్: 8.40శాతం నుంచి 11.15శాతం
  • యూకో బ్యాంక్: 8.45శాతం నుంచి 10.30శాతం
  • బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర: 8.35శాతం నుంచి 11.15శాతం
  • పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్: 8.50శాతం నుంచి 10శాతం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్: 8.40శాతం నుంచి 10.60శాతం
  • సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 8.45శాతం నుంచి 9.80శాతం

ప్రైవేట్ రంగ బ్యాంకులు..

ప్రైవేటు రంగ బ్యాంకుల్లో గృహ రుణాలపై వడ్డీ రేట్లను ఇప్పుడు చూద్దాం.. వివిధ బ్యాంకుల్లో రూ. 75లక్షలకు పైగా రుణ మొత్తంపై వడ్డీ రేట్ల వివరాలు ఇవి..

  • కోటక్ మహీంద్రా బ్యాంక్: 8.70శాతం నుంచి ప్రారంభమవుతాయి.
  • ఐసీఐసీఐ బ్యాంక్: 8.75 నుంచి ప్రారంభమవుతాయి.
  • యాక్సిస్ బ్యాంక్: 8.75శాతం నుంచి 9.65శాతం వరకూ
  • హెచ్ఎస్బీఎసీ బ్యాంక్: 8.50శాతం నుంచి ప్రారంభం
  • సౌత్ ఇండియన్ బ్యాంక్: 8.70శాతం నుంచి 11.70శాతం వరకూ
  • కరూర్ వైశ్యా బ్యాంక్: 9.00శాతం నుంచి 11.05శాతం వరకూ
  • కర్ణాటక బ్యాంక్: 8.50శాతం నుంచి 10.62శాతం వరకూ
  • ఫెడరల్ బ్యాంక్: 8.80శాతం నుంచి ప్రారంభం
  • ధనలక్ష్మి బ్యాంక్: 9.35శాతం నుంచి 10.50శాతం వరకూ
  • తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్: 8.60శాతం నుంచి 9.95శాతం వరకూ
  • బంధన్ బ్యాంక్: 9.16శాతం నుంచి 13.33వరకూ
  • ఆర్బీఎల్ బ్యాంక్: 8.90 శాతం నుంచి ప్రారంభం
  • సీఎస్బీ బ్యాంక్: 10.49 శాతం నుంచి 12.34శాతం వరకూ
  • హెచ్డీఎఫ్సీ బ్యాంక్: 8.75శాతం నుంచి ప్రారంభం..
  • సిటీ యూనియన్ బ్యాంక్: 8.75శాతం నుంచి 10.50శాతం వరకూ

పన్ను ప్రయోజనాలు..

గృహ రుణానికి అనేక పన్ను ప్రయోజనాలు ఉన్నాయి. మీకు గృహ రుణం ఉన్నట్లయితే, మీరు మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుంచి వడ్డీ, అసలు చెల్లింపులను తీసివేయవచ్చు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 24 ప్రకారం, స్వీయ-ఆక్రమిత లేదా అద్దె ఆస్తుల యజమానులు రూ. లక్షల వరకూ పన్ను ఆదా చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ప్రయాణిస్తున్న బైక్‌లో ఒక్కసారిగా మంటలు..
ప్రయాణిస్తున్న బైక్‌లో ఒక్కసారిగా మంటలు..
ప్రజా సమస్యలు పక్కన పెట్టి మొబైల్స్‌లో గేమ్స్ ఆడుతున్న అధికారులు
ప్రజా సమస్యలు పక్కన పెట్టి మొబైల్స్‌లో గేమ్స్ ఆడుతున్న అధికారులు
ఫోన్‌ వాడకంలో అతివద్దు.. మైగ్రెన్‌ పర్మినెంట్‌గా తిష్టవేస్తుంది!
ఫోన్‌ వాడకంలో అతివద్దు.. మైగ్రెన్‌ పర్మినెంట్‌గా తిష్టవేస్తుంది!
అతి ఆలోచనలతో BP టెన్షన్‌.. మనసుకు రిపేర్‌ చేయకుంటే గుండెకు చేటు
అతి ఆలోచనలతో BP టెన్షన్‌.. మనసుకు రిపేర్‌ చేయకుంటే గుండెకు చేటు
చేతిలో కన్ఫర్మ్ రైలు టికెట్ ఉన్నా.. రూ.2560 జరిమానా..కారణం ఇదే..!
చేతిలో కన్ఫర్మ్ రైలు టికెట్ ఉన్నా.. రూ.2560 జరిమానా..కారణం ఇదే..!
జ్యోతిష్యంలోనే వెరీ డేంజర్.. ఆ సమయం మొదలైతే వీరికి చుక్కలే..
జ్యోతిష్యంలోనే వెరీ డేంజర్.. ఆ సమయం మొదలైతే వీరికి చుక్కలే..
46 ఏళ్ల వయస్సులో ఇలా ఎలా..? ఆమె ఆన్సర్ ఇదే..
46 ఏళ్ల వయస్సులో ఇలా ఎలా..? ఆమె ఆన్సర్ ఇదే..
క్రెడిట్ కార్డుదారుడు మరణిస్తే ఆ అప్పు ఎవరు చెల్లించాలి?
క్రెడిట్ కార్డుదారుడు మరణిస్తే ఆ అప్పు ఎవరు చెల్లించాలి?
అరుదైన గ్రహాల కలయిక.. దెబ్బకు సీన్ మొత్తం ఛేంజ్
అరుదైన గ్రహాల కలయిక.. దెబ్బకు సీన్ మొత్తం ఛేంజ్
నేను విష్ణుప్రియ సబ్‌స్క్రైబర్‌ని.. రూ.399 కట్టా: టాలీవుడ్ నటుడు
నేను విష్ణుప్రియ సబ్‌స్క్రైబర్‌ని.. రూ.399 కట్టా: టాలీవుడ్ నటుడు