Silver Prices: వెండి ధరలు చుక్కలు చూపించడం ఖాయమంటున్న నిపుణులు.. అసలు కారణం అదేనా.?

| Edited By: Narender Vaitla

Nov 23, 2022 | 2:16 PM

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం తర్వాత చమురుతో పాటు బంగారం ధరలో కూడా పెరుగుదల కనిపించిన విషయం తెలిసిందే. రోజురోజుకీ బంగారం ధర పెరగడమే తప్ప తగ్గేది లేదంటూ పెరుగుతూ పోయింది. అయితే బంగారానికి తోడుగా వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి...

Silver Prices: వెండి ధరలు చుక్కలు చూపించడం ఖాయమంటున్న నిపుణులు.. అసలు కారణం అదేనా.?
Silver Price
Follow us on

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం తర్వాత చమురుతో పాటు బంగారం ధరలో కూడా పెరుగుదల కనిపించిన విషయం తెలిసిందే. రోజురోజుకీ బంగారం ధర పెరగడమే తప్ప తగ్గేది లేదంటూ పెరుగుతూ పోయింది. అయితే బంగారానికి తోడుగా వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. వరుసగా రెండో త్రైమాసికంలో వెండి డిమాండ్ కంటే సప్లై తక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో పాటు డాలర్‌లో సాఫ్ట్ నెస్‌ కూడా వెండి ధరల పెరుగుదలకు దన్నుగా నిలుస్తోంది. గత నెలలో దేశీయంగా వెండి ధర 8 శాతం పెరిగి కిలో వెండి ధర రూ 61వేలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో 21 శాతం పెరిగి ఔన్సు వెండిధర 21 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది.

ఓ రిపోర్ట్ ప్రకారం గత 2 ఏళ్లలో , వెండి సప్లై కంటే డిమాండ్ లో వృద్ధి అధికంగా కనిపిస్తోంది. 2022 సంవత్సరంలో వెండి సప్లై కంటే డిమాండ్ 19 శాతం అధికంగా ఉండే అవకాశం ఉంది. 2021 లోనూ సప్లై కంటే డిమాండ్ 5 శాతం అధికంగాను, 2022లో అంతర్జాతీయంగా వెండి డిమాండ్ 16 శాంత పెరిగి, రికార్డ్ స్థాయిలో 34,303 టన్నులకు డిమాండ్ చేరే అవకాశం ఉంది. వెండికి డిమాండ్ పెరిగి సప్లై తగ్గుదలతో అంతర్జాతీయ మార్కెట్‌లోనూ వెండి సప్లై లో షార్టేజ్‌ కనిపిస్తోంది. ఈ ఏడాది వెండి సప్లై లో షార్టేజ్‌ రికార్డ్ స్థాయిలో 5455 టన్నులకు చేరే అవకాశం ఉంది.

ఈ గణంకాలు 2021లో వెండి షార్టేజ్‌తో పోలిస్తే 4 రెట్లు పెద్దవి. వెండి విలువైన లోహంతో పాటు పారిశ్రామిక అవసరాలలో కూడా వినియోగిస్తుండటం గమనించాల్సిన అంశం. అంతర్జాతీయంగా వెండి వినియోగంలో 44 నుంచి 45 శాతం పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తున్నారు. 2022లో అంతర్జాతీయంగా వెండి డిమాండ్ 5 శాతం పెరిగే అవకాశం ఉంది. దీంతో పాటు వెండిలో పెట్టుబడుల డిమాండ్ 29 శాతం పెరిగే అవకాశం ఉంది. వెండి ఆభరణాలకు 18 శాతం డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. నవంబర్‌లో అమెరికా డాలర్‌ పెరుగుదల కూడా వెండి ధరల పెరుగుదలకు మద్దతుగా నిలిచింది. అమెరికాలో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుదలతో, యూఎస్‌ సెంట్రల్ బ్యాంక్‌ వడ్డీ రేట్ల పెంపుపై దూకుడు తగ్గించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

ఇది డాలర్‌ సాఫ్ట్ నెస్‌ కు దోహదం చేస్తుంది. అమెరికా నవంబర్ 10న విడుదల చేసిన రిటైల్ ద్రవ్యోల్బణం రిపోర్ట్ తర్వాత అమెరికా డాలర్‌ సూచీ 3 నుండి శాతం తగ్గింది. కానీ, అంతర్జాతీయంగా వెండికి అధిక డిమాండ్ వెండి ధరల పెరుగుదలకు దారి తీస్తుందా? ప్రస్తుతం ఉన్న ధరలో వెండిలో పెట్టుబడులు పెట్టవచ్చా అన్నది పెద్ద ప్రశ్న? మార్కెట్ వర్గాల ప్రకారం రాబోయే కాలంలో వెండి పారిశ్రామిక అవసరాలతో పాటు పెట్టుబడులలో డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. దీంతో పాటు అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగే అవకాశం లేక పోలేదు. ఇది తిరిగి అమెరికా డాలర్ పై ఒత్తిడి పెంచుతుంది. ఈ రెండు సందర్భాలలోనూ వెండి ధరల పెరుగుదలకు మద్దతు ఉంటుంది. డిసెబర్‌ చివరి నాటికి వెండి ధరలు కిలో65 వేలకు చేరే
అవకాశం ఉంది. కాబట్టి వెండిలో పెట్టుబడులు పెట్టే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదిస్తే ఉత్తమమం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..