Electric Vehicles: అప్పటి వరకు పెట్రోల్, డీజిల్ కార్ల కంటే ఎలక్ట్రిక్ వాహనాలు చౌకగా..
అమెరికాకు చెందిన రాకీ మౌంటైన్ ఇన్‌స్టిట్యూట్ (RMI), బెజోస్ ఎర్త్ ఫండ్ 2030 నాటికి, ఈవీలు ప్రపంచ ఆటోమొబైల్ మార్కెట్‌లో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ ఆక్రమించవచ్చని చెబుతున్నాయి. 2017లో పెట్రోల్-డీజిల్ కార్ల అమ్మకాలు అత్యధికంగా ఉన్నాయి. ఈ దశాబ్దం మధ్య నాటికి, కొత్త పెట్రోలియం వాహనాల కంటే ఎక్కువ స్క్రాప్‌లు విక్రయించబడతాయి...
భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా కార్ల మార్కెట్ వేగంగా మారుతోంది. ఐరోపాలో 2024, చైనాలో 2025, అమెరికాలో 2026, భారతదేశంలో 2027 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల (EV) ధరలు పెట్రోల్-డీజిల్ కార్లతో సమానంగా లేదా తక్కువగా ఉంటాయి. ఎకనామిక్స్ ఆఫ్ ఎనర్జీ ఇన్నోవేషన్ అండ్ సిస్టమ్ ట్రాన్సిషన్ (EEIST) విశ్లేషణ నివేదికలో ఈ అంచనా వేయబడింది.
EEIST అనేది యూనివర్శిటీ ఆఫ్ ఎక్సెటర్, బ్రిటన్ ప్రత్యేక ప్రాజెక్ట్. దాని ప్రొఫెసర్ మెయి మెయి ఎలీన్ లామ్ మాట్లాడుతూ, ‘భారతదేశంలో EV వాటా ఒక సంవత్సరంలో 0.4% నుంచి 1.5%కి 3 రెట్లు పెరిగింది. ఈ ఘనత సాధించడానికి మిగతా ప్రపంచానికి 3 ఏళ్లు పట్టింది. 2030 నాటికి, తగ్గుతున్న బ్యాటరీ ఖర్చులు ప్రపంచవ్యాప్తంగా పెట్రోలియం వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాలను చౌకగా మారుస్తాయి. అయితే ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోవడంతో కొత్త కొత్త వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ వైపు మొగ్గు చూపుతున్నాయి కంపెనీలు. అలాగే వినియోగదారులు కూడా పెట్రోల్,డీజిల్ ధరలను దృష్టిలో ఉంచుకుని ఈవీ వాహనాల వైపు ఆసక్తి చూపుతున్నారు.
అమెరికాకు చెందిన రాకీ మౌంటైన్ ఇన్‌స్టిట్యూట్ (RMI), బెజోస్ ఎర్త్ ఫండ్ 2030 నాటికి, ఈవీలు ప్రపంచ ఆటోమొబైల్ మార్కెట్‌లో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ ఆక్రమించవచ్చని చెబుతున్నాయి. 2017లో పెట్రోల్-డీజిల్ కార్ల అమ్మకాలు అత్యధికంగా ఉన్నాయి. ఈ దశాబ్దం మధ్య నాటికి, కొత్త పెట్రోలియం వాహనాల కంటే ఎక్కువ స్క్రాప్‌లు విక్రయించబడతాయి.
రాబోయే సంవత్సరాల్లో కొత్త పెట్రోలియం వాహనాల సంఖ్య కంటే ఎక్కువ స్క్రాప్
రాబోయే సంవత్సరాల్లో కొత్త పెట్రోలియం వాహనాల సంఖ్య కంటే ఎక్కువ స్క్రాప్ ఉంటుంది. 2030 నాటికి ప్రపంచ ఆటో మార్కెట్‌లో 4 మార్పులు రానున్నాయి. మార్కెట్ వాటా: ప్రపంచంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 6 రెట్లు పెరుగుతాయి. కొత్త వాహనాల విక్రయాల్లో 62-86% ఈవీల వాటా ఉంటుంది.
చమురు డిమాండ్: 2019లో ముడి చమురుకు గ్లోబల్ డిమాండ్ ఎక్కువగా ఉంది. 2030 తర్వాత, ఏటా 1 మిలియన్ బ్యారెళ్ల తగ్గింపు ఉంటుంది. బ్యాటరీ ధర: ప్రస్తుత దశాబ్దంలో kWhకి $151 నుంచి $60-90కి తగ్గుతుంది. వాణిజ్య వాహనాలు: ఇ-కార్ల అమ్మకాలు పెరగడం ద్విచక్ర వాహనాలు, బస్సులు, ట్రక్కులు వంటి వాహనాల్లో విద్యుద్దీకరణను ప్రోత్సహిస్తుంది. ఇక ఎలక్ట్రిక్ వాహనాల పరంగా చైనా ముందంజలో ఉంది. చైనా 2030 నాటికి 90 శాతం ఈవీ అమ్మకాల వైపు కదులుతోంది. ఇప్పటికీ అక్కడ విక్రయించబడుతున్న కొత్త వాహనాల్లో మూడింట ఒక వంతు ఎలక్ట్రిక్ వాహనాలే.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి