Revolt RV1: బుకింగ్స్‌లో టాప్ రేపుతున్న ఈవీ బైక్.. వారంలో ఏకంగా 16 వేల బుకింగ్స్

|

Sep 25, 2024 | 3:30 PM

భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్ రోజురోజుకూ వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఈవీ స్కూటర్లు అమ్మకాల్లో గణనీయమైన రికార్డులు సృష్టిస్తున్నాయి. అయితే మార్కెట్‌లో ఈవీ స్కూటర్లు ఎంత ఆదరణ పొందుతున్న ఈవీ బైక్స్ మాత్రం స్కూటర్స్ పోల్చి చూస్తే అన్ని మోడల్స్ విడుదల కాలేదు. అయితే భారత ఈవీ మార్కెట్‌లో ఈవీ బైక్స్ అంటే రివోల్ట్ బైక్స్ అందరికీ గుర్తు వస్తాయి.

Revolt RV1: బుకింగ్స్‌లో టాప్ రేపుతున్న ఈవీ బైక్.. వారంలో ఏకంగా 16 వేల బుకింగ్స్
Revolt Rv1
Follow us on

భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్ రోజురోజుకూ వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఈవీ స్కూటర్లు అమ్మకాల్లో గణనీయమైన రికార్డులు సృష్టిస్తున్నాయి. అయితే మార్కెట్‌లో ఈవీ స్కూటర్లు ఎంత ఆదరణ పొందుతున్న ఈవీ బైక్స్ మాత్రం స్కూటర్స్ పోల్చి చూస్తే అన్ని మోడల్స్ విడుదల కాలేదు. అయితే భారత ఈవీ మార్కెట్‌లో ఈవీ బైక్స్ అంటే రివోల్ట్ బైక్స్ అందరికీ గుర్తు వస్తాయి. ఈ నేపథ్యంలో రివోల్ట్ మోటార్స్ ఇటీవలే తన కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఆర్‌వీ 1, ఆర్‌వీ 1 ప్లస్‌లను విడుదుల చేసిన విషయంలో అందరికీ తెలిసిందే. ఈ బైక్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన వారంలోనే దాదాపు 16000 బుకింగ్స్‌ను పొందాయి. ఈ నేపథ్యంలో రివోల్ట్ ఈవీ బైక్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

రివోల్ట్ ఆర్‌వీ 1, ఆర్‌వీ 1 ప్లస్ బైక్ల బేస్ మోడల్ ధర రూ. 84,990 కాగా హై-స్పెక్ ఆర్‌వీ 1 ప్లస్ వేరియంట్ రూ.99,990గా ఉంది. ఆర్‌వీ 1  ఎలక్ట్రిక్ బైక్ 250 కిలోల పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉందని రివోల్ట్ మోటార్స్ పేర్కొంది. ఈ బైక్‌లో మిడ్-మోటారు, ప్రీమియం చైన్ డ్రైవ్‌ను సజావుగా అందించడం కోసం అమర్చారు. ఇది రెండు బ్యాటరీ ఎంపికలను అందిస్తుంది. 2.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ 100 కిమీ వరకు మైలేజ్ అందిస్తుంది. 3.24 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ పరిధిని 160 కిమీ మైలేజ్‌ను అందిస్తుంది. ఈ రెండు బ్యాటరీలు ఐపీ 67 రేటెడ్, వాటర్ రెసిస్టెంట్ ఫీచర్‌తో వస్తుంది. రివోల్ట్ ఆర్‌వీ 1 ఎలక్ట్రిక్ బైక్ స్టాండ్‌అవుట్ రివర్స్ మోడ్‌తో బహుళ స్పీడ్ మోడ్‌లను అందిస్తుంది

రియల్ టైమ్ రైడ్ డేటా, ఎర్రర్ నోటిఫికేషన్‌లను అందించే 6-అంగుళాల డిజిటల్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఈ బైక్ ప్రత్యేకత. స్టైలిష్ ఎల్ఈడీ హెడ్‌లైట్‌లు, టైల్‌లైట్‌లు ఈ బైక్ లుక్‌ను మరింత ఆకట్టుకునేలా చేస్తాయి. ఈ రెండు వేరియంట్‌లలో ఛార్జర్ కోసం అంతర్నిర్మిత నిల్వ ఉంటుంది. ఆర్‌వీ 1 ప్లస్ వేరియంట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. కేవలం 1.5 గంటల్లో పూర్తి సామర్థ్యాన్ని చేరుకుంటుంది. ఈ బైక్ గురించి  రట్టన్‌ఇండియా ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ చైర్‌పర్సన్ అంజలి రత్తన్  మాట్లాడుతూ ఆర్‌వీ 1 భారతదేశంలోని ఎలక్ట్రిక్ మొబిలిటీ విప్లవాన్ని తీసుకొస్తుందని చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..