EPFO: పీఎఫ్‌ ఉద్యోగులకు శుభవార్త తెలిపిన కేంద్ర ప్రభుత్వం.. అదేంటో తెలుసా..?

EPFO: అసలు డబ్బు మీ ఖాతాకు ఒకేసారి జమ అవుతుంది. అందుకే మీరు ఎక్కడైనా ఉద్యోగం చేస్తుంటే 2024-25 ఆర్థిక సంవత్సరానికి మీ 8.25% వడ్డీ ఇప్పటికే వచ్చి ఉండవచ్చు. లేదా త్వరలో వడ్డీ జమ కావచ్చని గుర్తించుకోండి. అయితే తాజాగా కేంద్రం ఉద్యోగులకు శుభవార్త తెలిపింది..

EPFO: పీఎఫ్‌ ఉద్యోగులకు శుభవార్త తెలిపిన కేంద్ర ప్రభుత్వం.. అదేంటో తెలుసా..?

Updated on: Jul 01, 2025 | 7:51 PM

ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ తెలిపింది. ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 2024-25 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్‌ లబ్ధిదారుల ఖాతాలలో 8.25 శాతం అదనపు వడ్డీని విడుదల చేయనుంది. వడ్డీని ప్రతి నెలా లెక్కించినప్పటికీ, ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి సాధారణంగా జూన్ – ఆగస్టు మధ్య, అసలు డబ్బు మీ ఖాతాకు ఒకేసారి జమ అవుతుంది. అందుకే మీరు ఎక్కడైనా ఉద్యోగం చేస్తుంటే 2024-25 ఆర్థిక సంవత్సరానికి మీ 8.25% వడ్డీ ఇప్పటికే వచ్చి ఉండవచ్చు. లేదా త్వరలో వడ్డీ జమ కావచ్చని గుర్తించుకోండి.

ఇది కూడా చదవండి: Vastu Tips: ఇంట్లో చీపురు ఈ దిక్కున పెడితే ఐశ్వర్యం.. ఇలా చేస్తే అరిష్టం!

ఆన్‌లైన్‌లో మీ పీఎఫ్‌ ఖాతా బ్యాలెన్స్‌ను ఎలా తనిఖీ చేయాలి?

ఇవి కూడా చదవండి

1. అధికారిక EPFO వెబ్‌సైట్‌కి వెళ్లండి: “epfindia.gov.in“, అధికారిక సైట్‌ను మాత్రమే ఉపయోగించండి.

2. మై సర్వీస్‌ అనే విభాగంలోని ఎంప్లాయీస్‌ పై క్లిక్‌ చేయండి

3. సభ్యుల పాస్‌బుక్‌ని గుర్తించి దానిపై క్లిక్‌ చేయండి. తర్వాత మిమ్మల్ని లాగిన్ అవ్వాల్సిన కొత్త పేజీకి తీసుకెళుతుంది.

4. దీని కోసం మీ UAN (యూనివర్సల్ అకౌంట్ నంబర్) అవసరం. ఇది అన్ని పీఎఫ్‌ సభ్యులకు ఇచ్చిన ప్రత్యేక అకౌంట్‌ నంబర్‌. తర్వాత సెక్యూరిటీ కోసం క్చాప్చాను నమోదు చేయండి.

5. మీరు లాగిన్ అయిన తర్వాత మీ PF ఖాతాల జాబితా కనిపిస్తుంది.

6. మీ పాస్‌బుక్ తెరుచుకుంటుంది. మీ అన్ని సహకారాలు (అంటే కంపెనీ నుంచి మీ నుంచి జమ అయిన వివరాలు కనిసిస్తాయి. ప్రతి ఆర్థిక సంవత్సరానికి జమ చేయబడిన వడ్డీ కనిపిస్తుంది.

7. 8.25% వడ్డీ జోడించబడిందో లేదో చూడటానికి తాజా ఆర్థిక సంవత్సరం వడ్డీ జమ అయ్యిందో లేదో తెలుస్తుంది.

8. మీరు మీ రికార్డుల కోసం ఈ పాస్‌బుక్‌ను PDFగా కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన అంశాలు:

  • SMS, మిస్డ్ కాల్ సేవలు పనిచేయడానికి మీ UAN యాక్టివేట్ చేయబడి మీ ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతాకు లింక్ చేసి ఉండాలి.
  • కొన్నిసార్లు అందరి పాస్‌బుక్‌లలో యాడ్‌ చేయడానికి సమయం పడుతుంది. అలాంటి సమయంలో టెన్షన్‌ పడాల్సిన అవసరం లేదు. త్వరలో అప్‌డేట్‌ అవుతుంది.
  • మీరు నిరంతర సమస్యలు లేదా వ్యత్యాసాలను ఎదుర్కొంటుంటే మీరు EPFO ​​పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు లేదా మీ సమీప EPFO ​​కార్యాలయాన్ని సందర్శించవచ్చు.

ఇవి కూడా చదవండి: HDFC Credit Card: మీరు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా? ఇవి తెలుసుకోవాల్సిందే.. కీలక మార్పులు!

ఇది కూడా చదవండి: Metro Rules Change: ఆ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ప్రయాణికుల కోసం కీలక నిర్ణయం!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి