RBI: రిజర్వ్ బ్యాంక్ కీలక ప్రకటన.. ఫ్లోటింగ్ రేట్ అంటే ఏంటి? ఏడాదికి రెండు సార్లు
RBI: నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC) వడ్డీ రేటు ఆధారంగా ఈ రేటును నిర్ణయిస్తారు. పెట్టుబడిదారులు కనీసం రూ. 1,000 పెట్టుబడి పెట్టవచ్చు. అయితే గరిష్ట పెట్టుబడికి పరిమితి లేదు. ఈ బాండ్లకు ఏడు సంవత్సరాల మెచ్యూరిటీ ఉంటుంది. సీనియర్ సిటిజన్‌లకు..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్లపై వడ్డీ రేటు జూలై నుండి డిసెంబర్ 2025 వరకు 8.05% వద్ద ఉంటుందని ప్రకటించింది. ఈ రేటు మునుపటి జనవరి-జూన్ 2025 కాలం నుండి మారలేదు. ఈ బాండ్లపై వడ్డీ రేటు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) రేట్లకు అనుసంధానించబడి ఉంటుంది. ఇది NSC రేట్లపై అదనంగా 0.35% అందిస్తుంది.
ఫ్లోటింగ్ రేట్ ఏమిటి?
ఫ్లోటింగ్ రేట్ అంటే రుణ లేదా పెట్టుబడి వడ్డీ రేటు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మారుతూ ఉండే ఒక రకమైన వడ్డీ రేటు. ఇది స్థిర వడ్డీ రేటుకి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ వడ్డీ రేటు రుణ కాలవ్యవధి మొత్తం ఒకేలా ఉంటుంది.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC) వడ్డీ రేటు ఆధారంగా ఈ రేటును నిర్ణయిస్తారు. పెట్టుబడిదారులు కనీసం రూ. 1,000 పెట్టుబడి పెట్టవచ్చు. అయితే గరిష్ట పెట్టుబడికి పరిమితి లేదు. ఈ బాండ్లకు ఏడు సంవత్సరాల మెచ్యూరిటీ ఉంటుంది. సీనియర్ సిటిజన్‌లకు ముందస్తు ఉపసంహరణకు అవకాశం ఉంది. ఈ బాండ్లు స్థిరమైన రాబడిని, భద్రతను అందిస్తాయి. కిందటి రోజే కేంద్ర ప్రభుత్వం.. చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను స్థిరంగానే ఉంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూన్ 30న కేంద్ర ప్రభుత్వం పీపీఎఫ్ (PPF) ఎన్‌ఎస్‌సీ (NSC) ఎస్‌సీఎస్‌ఎస్ (SCSS) వంటి స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌ల వడ్డీ రేట్లను మార్చలేదు.
ఇది కూడా చదవండి: Viral Video: అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. రీల్స్ చేద్దామని వెళ్తే.. చివరికి జరిగిందిదే
ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక వ్యవహారాల శాఖ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, జూలై 1, 2025 నుండి చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు PPF 7.10%, NSC 7.7%, SCSS 8.2%, సుకన్య సమృద్ధి యోజన (SSY) 8.20%.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ వడ్డీ రేట్ 7.7 శాతంగా ఉంది. అందుకే ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్ల వడ్డీ రేటు 7.7% + 0.35% = 8.05% అవుతుంది. ఈ బాండ్లపై వడ్డీ రేటు ఎప్పుడూ ఒకేలా ఉండదని గుర్తించుకోండి. ఇది ప్రతి ఆరు నెలలకు ఒకసారి మారుతుంది. ఎన్‌ఎస్‌సీ వడ్డీ రేటు పెరిగితే, ఈ బాండ్ల వడ్డీ రేటు కూడా పెరుగుతుంది. NSC వడ్డీ రేటు తగ్గితే, ఈ బాండ్ల వడ్డీ రేటు కూడా తగ్గుతుంది.
ఆరు నెలలకోసారి వడ్డీ:
ఇదిలా ఉండగా, ఈ బాండ్లపై 6 నెలలకోసారి వడ్డీ అందిస్తారు. ప్రతి ఏడాది జనవరి 1; జులై 1 తేదీల్లో వడ్డీ చెల్లిస్తారు. జులై-డిసెంబర్ 2025 కాలానికి సంబంధించిన వడ్డీ జులై 1, 2025న ఇస్తారు. జనవరి-జూన్ 2026 కాలానికి సంబంధించిన వడ్డీ జనవరి 1, 2026న ఇస్తారు.
ఇది కూడా చదవండి: Viral Video: ఇంట్లో వింత శబ్దాలు.. ఫ్రిజ్ వెనుకాల చూడగానే ముచ్చెమటలు పట్టేశాయ్.. వీడియో వైరల్
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








