AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక యూపీఐ ద్వారా పీఎఫ్‌ విత్‌డ్రా!

EPFO: ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత వినియోగదారులు డిజిటల్ వాలెట్ నుండి డబ్బును సులభంగా బదిలీ చేయగలరు. దీని ప్రాసెసింగ్‌లో తక్కువ సమయం పడుతుంది. చందాదారులకు మెరుగైన సౌకర్యం లభిస్తుంది. దీని వలన బ్యాంకింగ్ వివరాలు, ధృవీకరణకు సంబంధించిన ఇబ్బంది కూడా తప్పుతుంది..

EPFO: ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక యూపీఐ ద్వారా పీఎఫ్‌ విత్‌డ్రా!
Subhash Goud
|

Updated on: Feb 22, 2025 | 2:02 PM

Share

దేశంలోని అన్ని రంగాలలో పనిచేస్తున్న లక్షలాది మందికి శుభవార్త వచ్చింది. EPFO ​చందాదారులు ఇకపై తమ PF ఖాతా నుండి డబ్బును ఉపసంహరించుకోవడానికి పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు. వారు UPI ద్వారా PF డబ్బును ఉపసంహరించుకోవచ్చు. పీఎం చందాదారుల క్లెయిమ్‌లను యూపీఐ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రాసెస్ చేయగలిగేలా ఒక వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. ఈ కొత్త వ్యవస్థ రాబోయే 3 నెలల్లో ప్రారంభం కావచ్చు. లావాదేవీ, క్లెయిమ్ ప్రక్రియను మెరుగుపరచడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

మీరు యూపీఐ ద్వారా డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు:

యూపీఐ ద్వారా పీఎం నుండి డబ్బును ఉపసంహరించుకునే సౌకర్యంతో నిధుల బదిలీ త్వరగా, సులభంగా జరుగుతుంది. దీని కోసం EPFO ​​NPCIతో జతకట్టింది. Google Pay, Phone Pay, Paytm వంటి UPI ప్లాట్‌ఫామ్‌లలో ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే తమ పీఎంను ఉపసంహరించుకోవాలనుకునే ఉద్యోగులకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

మీరు సులభంగా డబ్బు బదిలీ చేయవచ్చు:

ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత వినియోగదారులు డిజిటల్ వాలెట్ నుండి డబ్బును సులభంగా బదిలీ చేయగలరు. దీని ప్రాసెసింగ్‌లో తక్కువ సమయం పడుతుంది. చందాదారులకు మెరుగైన సౌకర్యం లభిస్తుంది. దీని వలన బ్యాంకింగ్ వివరాలు, ధృవీకరణకు సంబంధించిన ఇబ్బంది కూడా తప్పుతుంది. ఈపీఎఫ్‌వో​చందాదారులు NEFT లేదా RTGS కోసం వేచి ఉండకుండా డిజిటల్ చెల్లింపు యాప్ నుండి నేరుగా డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆర్బీఐ, కార్మిక మంత్రిత్వ శాఖ, బ్యాంకులు త్వరలో ఈ సౌకర్యాన్ని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాయి.

ATM నుండి విత్‌డ్రాయల్స్..

ప్రభుత్వం మే-జూన్ 2025 నాటికి EPFO ​​3.0 యాప్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీని ద్వారా EPFO ​​సబ్‌స్క్రైబర్లకు బ్యాంకింగ్ సౌకర్యాలు లభిస్తాయి. అలాగే మొత్తం వ్యవస్థ కేంద్రీకృతమవుతుంది. క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియ కూడా గతంలో కంటే సులభం అవుతుంది. ఈ కొత్త అప్‌డేట్‌తో సబ్‌స్క్రైబర్లు డెబిట్ కార్డ్ సౌకర్యాన్ని పొందుతారు. దీని ద్వారా వారు తమ పీఎఫ్‌ నిధులను నేరుగా ఏటీఎం నుండి ఉపసంహరించుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి