EPFO: ఈపీఎఫ్ క్లెయిమ్స్, పెన్షన్ సమస్యలు ఉన్నాయా? ఈ క్యాంప్‌కు వెళ్తే క్షణాల్లో పని పూర్తి!
EPFO: మీ నగరంలో ఈ శిబిరాలు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసుకోవాలంటే, పోస్ట్‌లో షేర్ చేసిన డ్రైవ్ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా మీరు పూర్తి జాబితాను చూడవచ్చు. ఈ ప్రత్యేక శిబిరంలో పాల్గొనేవారికి, EPFO ఆధ్వర్యంలో అందించే వివిధ సేవలు, ప్రక్రియలను..

EPFO: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) Visit Nidhi Aapke Nikat 2.0 కింద సెప్టెంబర్ 28న ఒక ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించనుంది. EPFO పథకాలు, ప్రయోజనాలను పీఎఫ్ ఖాతాదారులకు అర్థమయ్యేలా వివరించడమే ఈ శిబిరం ముఖ్య ఉద్దేశం. EPFO సేవలను ఖాతాదారులకు మరింత చేరువ చేసేందుకు ఈ శిబిరాన్ని రూపొందించారు. ఈ శిబిరాలలో అధికారులు నేరుగా సభ్యులకు EPFO పథకాలు, ప్రక్రియలు, ప్రయోజనాల గురించి వివరిస్తారు. ఈ శిబిరం కింద EPFO అక్కడికక్కడే ఫిర్యాదుల పరిష్కారానికి కూడా సహాయం చేస్తుంది.
EPFO అధికారిక ఫేస్‌బుక్ పేజీ, Xలో షేర్ చేసిన పోస్ట్‌లో జరగబోయే క్యాంప్ గురించిన సమాచారంతో పాటు, ఒక పీడీఎఫ్ ఫైల్ ఉన్న గూగుల్ డ్రైవ్ లింక్‌ను కూడా షేర్ చేశారు. ఈ పీడీఎఫ్ ఫైల్‌లో వివిధ నగరాల పేర్ల పక్కన, నిధి ఆప్కే పాస్ 2.0 క్యాంప్ ఏ నగరంలో నిర్వహించబడుతుందో అనే సమాచారం అందించారు.
మీ నగరంలో ఈ శిబిరాలు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసుకోవాలంటే, పోస్ట్‌లో షేర్ చేసిన డ్రైవ్ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా మీరు పూర్తి జాబితాను చూడవచ్చు. ఈ ప్రత్యేక శిబిరంలో పాల్గొనేవారికి, EPFO ఆధ్వర్యంలో అందించే వివిధ సేవలు, ప్రక్రియలను అర్థం చేసుకోవడానికి అధికారులతో నేరుగా సంభాషించే అవకాశం ఉంటుందని ఈపీఎఫ్‌వో పేర్కొంది.
Visit Nidhi Aapke Nikat 2.0 on 28 September 2026 to know EPFO schemes and benefits, understand services and processes with officials, and get on the spot grievance redressal Click here to locate nearest camp- https://t.co/ZuHZtyODcJ #NidhiAapkeNikat #EPFO #EPFOWithYou #HumHainNa https://t.co/kEcMiKRhXg
— EPFO (@officialepfo) September 23, 2026
ఇది కూడా చదవండి: SIM: మీ ఆధార్‌పై ఎవరైనా సిమ్ తీసుకున్నారా? కేవలం 5 నిమిషాల్లో కనిపెట్టేయండి..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
