AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉద్యోగులకు భారీ శుభవార్త.. కేంద్రం నుంచి సర్‌ప్రైజ్ న్యూ ఇయర్ గిఫ్ట్..

EPFO: ఈపీఎఫ్ సౌకర్యం అనేది ప్రస్తుతం ఉద్యోగులకు అన్నీ కంపెనీలు కల్పిస్తున్నాయి. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన కార్మిక కోడ్‌లలో కూడా అన్నీ కంపెనీలు ఈపీఎఫ్ ఫెసిలిటీ ఇవ్వాలని సూచించింది. ప్రతీ ఆర్ధిక సంవత్సరంలో పీఎఫ్ సేవింగ్స్‌పై కేంద్రం వడ్డీ ఇస్తోన్న విషయం తెలిసిందే. ఈ సారి ఎంత ఇవ్వనుందంటే..?

ఉద్యోగులకు భారీ శుభవార్త..  కేంద్రం నుంచి సర్‌ప్రైజ్ న్యూ ఇయర్ గిఫ్ట్..
Epfo Interest
Venkatrao Lella
|

Updated on: Nov 29, 2025 | 8:36 PM

Share

EPFO Interest Rates: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించేందుకు సిద్దమవుతోంది. ఉద్యోగుల భద్రత కోసం ఇటీవల కొత్త కార్మిక సంస్కరణలను ప్రవేశపెట్టిన మోదీ ప్రభుత్వం.. దాని ద్వారా అనేక సౌకర్యాలు కల్పించింది. కార్మిక కోడ్‌ల వల్ల ఉద్యోగులకు సకాలంలో జీతాలు, ఆరోగ్య భద్రత, పీఎఫ్ బెనిఫిట్ వంటి సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. గిగ్ కార్మికులతో పాటు ఏ రంగంలో పనిచేసివారికైనా ఆ రూల్స్ వర్తిస్తాయని కేంద్రం తెలిపింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కార్మిక సంస్కరణల్లో మార్పులు చేసినట్లు స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఉద్యోగులకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమవుతోంది.

9 శాతానికి పెంపు

ఈపీఎఫ్‌వో వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం పెంచనుందని తెలుస్తోంది. 2025-26 ఆర్ధిక సంవత్సరానికి పీఎఫ్ వడ్డీ రేటును 9 శాతంకు పెంచనుందని సమాచారం. దీనిపై ఇంకా అధికారికంగా నిర్ణయం తీసుకోనప్పటికీ.. సూత్రపాయంగా కేంద్రం ఆమోదించినట్లు వార్తలు వస్తున్నాయి. గత సంసత్సరంతో పోలిస్తే ఈ వడ్డీ రేటు ఎక్కువగా ఉంది. దీంతో ఈపీఎఫ్‌వో నుంచే వచ్చే ఈ సర్‌ప్రైజ్ న్యూస్ కోసం లక్షలాది ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. 9 శాతం వడ్డీ రేటును ఫిక్స్ చేస్తే.. దేశవ్యాప్తంగా 75 మిలియన్ల ఉద్యోగులు లాభపడనున్నారు.

గత ఏడాది ఇలా..

గత ఆర్ధిక సంవత్సరంలో(2024-25) ఈపీఎఫ్‌ డబ్బులపై వడ్డీ రేటును 8.25 శాతంగా కేంద్రం నిర్ణయించింది. ఇప్పుడు దానికి 9 శాతానికి పెంచితే.. గత ఏడాది కంటే 0.75 శాతం ఎక్కువ పెంచినట్లు అవుతుంది. ఫిబ్రవరి కల్లా పెంపుపై కేంద్రం తుది నిర్ణయం తీసుకోనుంది. త్వరలో జరగనున్న ఈపీఎఫ్‌వో బోర్డ్ ట్రస్టీస్ మీటింగ్‌లో దీనిపై చర్చించి ఆమోదించనున్నారని తెలుస్తోంది. ఇదే నిజమైతే లక్షల మంది పీఎఫ్ ఉద్యోగులకు పండగగా చెప్పవచ్చు. వారి పీఎఫ్ సేవింగ్స్‌పై గతంలో కంటే ఎక్కువ వడ్డీ రానుంది.

Follow Us
ఉద్యోగులకు సర్కార్ సూపర్ గుడ్ న్యూస్.. ఎన్నో ఏళ్ల కల సాకారం..
ఉద్యోగులకు సర్కార్ సూపర్ గుడ్ న్యూస్.. ఎన్నో ఏళ్ల కల సాకారం..
నా పాటకు ప్రాణం పెట్టి ఎవరెస్ట్ స్థాయికి తీసుకెళ్లిన హీరో..
నా పాటకు ప్రాణం పెట్టి ఎవరెస్ట్ స్థాయికి తీసుకెళ్లిన హీరో..
నా కోడలు టాప్ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు ఎందుకు చేయట్లేదంటే..
నా కోడలు టాప్ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు ఎందుకు చేయట్లేదంటే..
'ఈ సీజన్‌లో 2000-3000 పరుగులు బాదేస్తా..'
'ఈ సీజన్‌లో 2000-3000 పరుగులు బాదేస్తా..'
మీ స్టవ్ తుడిచేటప్పుడు ఈ చిన్న చిట్కా పాటిస్తే..
మీ స్టవ్ తుడిచేటప్పుడు ఈ చిన్న చిట్కా పాటిస్తే..
ఆలుగడ్డలను ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..? 99శాతం మంది..
ఆలుగడ్డలను ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..? 99శాతం మంది..
తేనెటీగ కుట్టిందా?ఈ చిట్కాలతో నొప్పి, వాపును వెంటనే తగ్గించుకోండి
తేనెటీగ కుట్టిందా?ఈ చిట్కాలతో నొప్పి, వాపును వెంటనే తగ్గించుకోండి
ప్రపంచంలో ఎన్ని రకాల క్యాలెండర్లు ఉన్నాయో తెలుసా..?
ప్రపంచంలో ఎన్ని రకాల క్యాలెండర్లు ఉన్నాయో తెలుసా..?
ప్రభుత్వం నుంచి మరో గుడ్‌న్యూస్.. ఉచితంగా రూ.5లక్షల జీవిత బీమా!
ప్రభుత్వం నుంచి మరో గుడ్‌న్యూస్.. ఉచితంగా రూ.5లక్షల జీవిత బీమా!
ఇమ్యూనిటీని పెంచే ఉసిరికాయ, పచ్చిమిర్చి పప్పు.. ఎలా చెయ్యాలంటే
ఇమ్యూనిటీని పెంచే ఉసిరికాయ, పచ్చిమిర్చి పప్పు.. ఎలా చెయ్యాలంటే