Pan Card: చిన్నారులకు పాన్‌కార్డు వస్తుందా..? అసలు ఎలా తీసుకోవాలి..?
చిన్నారులకు పాన్ కార్డు తీసుకోవాల్సిందిగా ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. చిన్నతనంలోనే ఆర్ధిక వ్యవహారాలు, పెట్టుబడులపై అవగాహన కల్పించేందుకు ఇది సహాయపడుతుంది. ఇంతకు ఎలా తీసుకోవాలనే విషయాలు చాలామందికి తెలియదు. మైనర్లకు పాన్ కార్డు ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం.

Pan Card For Children: చిన్నారుల నుంచి పెద్దవారి వరకు అందరికీ పాన్ కార్డు అవసరమే. బ్యాంకు లావాదేవీలు, ఆర్ధిక వ్యవహారాలకు ఎవరికైనా పాన్ కార్డు అనేది తప్పసనిరి. తల్లిదండ్రుల సంరక్షణలో చిన్నారులకు కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. దీని వల్ల బాల్యంలోనే చిన్నారులకు ఆర్ధిక విషయాలపై అవగాహన కలిగి ఉంటారు. పెద్ద మొత్తంలో బ్యాంకు లావాదేవీలు చేయాలంటే పాన్ కార్డు అనేది అవసరం. ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా పాన్ కార్డును పొందే అవకాశముంది. చాలామందికి ఈ విషయం తెలియక వారి పిల్లలకు పాన్ కార్డు అనేది తీసుకోరు. ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ కూడా మైనర్లకు పాన్ కార్డు తీసుకోవాల్సిన అంశంపై అవగాహన కూడా కల్పిస్తోంది.
మైనర్లకు పాన్ కార్డు ఎలా తీసుకోవాలి..?
నేరుగా మైనర్లు పాన్ కార్డు కోసం అప్లై చేయడానికి అర్హులు కాదు. వారి తల్లిదండ్రులు లేదా సంరక్షులు తొలుత రిప్రెజెంటేటివ్ అసెస్సీలు దరఖాస్తు చేయాలి. ఆన్‌లైన్ ద్వారా ఆఫ్‌లైన్ విధానంలో దీని కోసం అప్లై చేయొచ్చు. పిల్లలు వేరే దేశంలో ఉన్నా సరే ఈ ప్రక్రియ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా చేయాలంటే ఇన్‌కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి దరఖాస్తు నింపి అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించాలి. ఆ తర్వాత వాటిని తీసుకుని పాన్ కార్డు కార్యాలయానికి వెళ్లాలి. అప్పుడు అధికారులు పాన్ కార్డు జారీ చేస్తారు. కానీ ఆ పాన్ కార్డుపై చిన్నారుల ఫొటో, సంతకం ఉండదు. వారికి 18 ఏళ్లు దాటక ఆన్‌లైన్ విధానంలో ఫొటో, ఇతర వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు.
చిన్నారులకు ఎందుకు తీసుకోవాలి..?
చిన్నారుల పేరుపై బ్యాంక్ అకౌంట్ తీసుకోవడానికి పాన్ కార్డు యూజ్ అవుతుంది. అలాగే వారి పేరుపై ఫిక్స్‌డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్ ఓపెన్ చేయడానికి, మ్యూచువల్ ఫడ్స్, ఇతర సిప్‌లలో పెట్టుబడానికి పెట్టాడానికి ఉపయోగపడుతుంది.




