AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Loan: హోమ్ లోన్ తీసుకుంటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి.. లేకపోతే నష్టపోతారు

హోమ్ లోన్ దాదాపు అన్నీ బ్యాంకులు ఆఫర్ చేస్తున్నాయి, కొత్త ఇల్లు కట్టుకోవాలనుకునేవారు డాక్యుమెంట్స్ సమర్పించి బ్యాంకుల నుంచి లోన్ పొందవచ్చు. అయితే బ్యాంకు లోన్ తీసుకునేటప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. తక్కువ వడ్డీ రేటు ఏ బ్యాంకులో ఉంది.. ?ప్రాసెసింగ్ ఫీజు వివరాలు ఏంటి? అనేవి తెలుసుకోేవాలి.

Home Loan: హోమ్ లోన్ తీసుకుంటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి.. లేకపోతే నష్టపోతారు
Home Loan
Venkatrao Lella
|

Updated on: Nov 30, 2025 | 6:51 AM

Share

Home Loan Interest Rates: పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టి చూడు అని అంటారు పెద్దలు. ఎందుకంటే ఆ రెండు అత్యంత ఖర్చుతో కూడుకున్న పనులు. జీవితంలో ప్రతీఒక్కరికీ మంచి ఇల్లు కట్టుకుని కుటుంబసభ్యులతో హాయిగా గడపాలనే ఆశ ఉంటుంది. కానీ కొత్త ఇంటిని నిర్మించాలంటే లక్షలకు లక్షలు ఖర్చు అవుతాయి. ఇక మధ్య తరగతి ప్రజలకు అయితే సొంతింటి కల అనేది పెద్ద కష్టంగా మారుతుంది. ధరలు పెరిగిపోవడంతో సొంత ఇళ్లు కట్టుకోవాలనేది పెద్ద కలగానే మారిపోయింది. అయితే సొంత ఇల్లు నిర్మించుకోవడానికి చాలామంది బ్యాంకుల నుంచి హోమ్ లోన్ తీసుకుంటూ ఉంటారు. బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుకే హోమ్ లోన్ ఆఫర్ చేస్తున్నాయి. అయితే హోమ్ లోన్ తీసుకునేటప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోవాలంటున్నారు బ్యాకింగ్ రంగ నిపుణులు.

క్రెడిట్ స్కోర్

హోమ్ లోన్ తీసుకోవాలంటే ముందుగా మీ క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోండి. మీ సిబిల్ స్కోర్ ఆధారంగా హోమ్ లోన్‌పై ఎంత వడ్డీ నిర్ణయించాలనేది బ్యాంకులు నిర్ణయిస్తాయి. మీ క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉంటే తక్కువ వడ్డీ.. తక్కువగా ఉంటే ఎక్కువ వడ్డీ ఉంటుంది. అధిక మొత్తంలో లోన్ కావాలంటే క్రెడిట్ స్కోర్ 750 కంటే ఎక్కువగా ఉండాలి. తక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే మీకు హోమ్ లోన్ ఇవ్వకపోవచ్చు.

వడ్డీ రేటు

హోమ్ లోన్లకు వడ్డీ రేటు తక్కువగానే ఉంటుంది. కానీ మీరు లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు తక్కువ వడ్డీ రేటును ఏ బ్యాంకులు ఆఫర్ చేస్తున్నాయనేది ఒకసారి తెలుసుకోండి. వడ్డీ రేటు 0.5 శాతం ఎక్కువ ఉన్నా సరే.. మీ వడ్డీలో చాలా వ్యత్యాసం ఉంటుంది. దీంతో అన్ని బ్యాంకుల వడ్డీ రేట్లను చెక్ చేసి ఏ బ్యాంకు తక్కువ వడ్డీ రేటుకు ఇస్తుంటే ఆ బ్యాంకులో తీసుకోండి.

ప్రాసెసింగ్ ఫీజు

ఇక హోమ్ లోన్ తీసుకున్నప్పుడు లోన్ మంజూరు చేయడానికి ప్రాసెసింగ్ ఫీజును బ్యాంకులు వసూలు చేస్తాయి. మీరు తీసుకున్న లోన్‌పై 0.5 శాతం నుంచి 1 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజులు వసూలు చేస్తున్నాయి. కొన్ని బ్యాంకులు అయితే మీరు ఎంత లోన్ తీసకుంటున్నారనేది సంబంధం లేకుండా ఫ్లాట్ ప్రాసిసెంగ్ ఫీజు వసూలు చేస్తున్నాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..