EPFO Account Holders: ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు కనీస వేతన పరిమితి పెరగనుందా?
EPFO Account Holders: పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలన్నింటినీ మంత్రి మదింపు చేస్తున్నట్లు సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు. ఈపీఎఫ్‌వో కింద జీతం పరిమితి, పరిమితి సవరణ చాలా కాలంగా పెండింగ్‌లో ఉందని ప్రభుత్వం భావిస్తోంది. చివరిగా 2014లో..
కేంద్ర ప్రభుత్వం త్వరలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కింద జీతం పరిమితిని పెంచవచ్చు. అలాగే, ఉద్యోగుల సంఖ్య పరిమితిని కూడా తగ్గించవచ్చు. ఉద్యోగులకు సామాజిక భద్రతను బలోపేతం చేయడానికి కవరేజీని పెంచడం, విస్తరించడం దీని ఉద్దేశ్యం. ఈపీఎఫ్‌వో కింద ప్రస్తుత జీతం పరిమితి నెలకు 15 వేలు. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పరిధిలోని జీతం పరిమితికి అనుగుణంగా దీనిని రూ.21 వేలకు పెంచవచ్చని తెలుస్తోంది. అంటే రూ.6 వేల వరకు పెంచవచ్చు. ఇది కాకుండా EPFO లో చేరడానికి కంపెనీలో తప్పనిసరి ఉద్యోగుల పరిమితిని తగ్గించవచ్చు. ప్రస్తుతం 20 మంది ఉద్యోగులు ఉండగా, దీనిని 10 నుండి 15 మంది ఉద్యోగులకు తగ్గించవచ్చు.
కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రస్తుతం ఈ విషయాన్ని వాటాదారులతో చర్చిస్తోంది. సామాజిక భద్రతా నియమావళిని అమలు చేసేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపుతోందని చెప్పారు. ఉద్యోగుల సామాజిక భద్రతా చర్యలను విస్తృతం చేయడానికి, లోతుగా చర్చించేందుకు ఏర్పడిన స్టీరింగ్ కమిటీ నుండి బలమైన సిఫార్సులను అనుసరించి చర్చలు జరుగుతున్నాయి.
చివరిగా 2014లో వేతన సవరణ జరిగింది:
పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలన్నింటినీ మంత్రి మదింపు చేస్తున్నట్లు సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు. ఈపీఎఫ్‌వో కింద జీతం పరిమితి, పరిమితి సవరణ చాలా కాలంగా పెండింగ్‌లో ఉందని ప్రభుత్వం భావిస్తోంది. చివరిగా 2014లో రూ.6500 నుంచి రూ.15 వేలకు పెంచిన వేతన పరిమితి సవరణ జరిగింది. రూ.21 వేలు అధిక వేతన పరిమితి పీఎఫ్ పెరుగుతుంది. దీంతో పాటు ఉద్యోగుల పెన్షన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. 20 మంది ఉద్యోగుల పరిమితిని తగ్గించడాన్ని సూక్ష్మ, చిన్న కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయని తెలుస్తోంది. దీని కారణంగా వారికి ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈపీఎఫ్‌వో కింద, ఉద్యోగి, కంపెనీ ఇద్దరూ ఈపీఎఫ్ ఖాతాకు 12-12% జమ చేయాలి. ఉద్యోగి కంట్రిబ్యూషన్‌లో మొత్తం 12% పీఎఫ్ ఖాతాకు వెళ్తుంది. అయితే కంపెనీ కంట్రిబ్యూషన్‌లో 8.33% ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS)కి, మిగిలిన 3.67% పీఎఫ్ ఖాతాకు వెళ్తుంది.
ఇది కూడా చదవండి: Camel Milk: ఒంటె పాలు లీటరు రూ.3500.. వీటితో ప్రయోజనాలేంటి? ఇలా చేస్తే లక్షల్లో సంపాదన!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి