EPF Interest Rate: ఉద్యోగుల పంట పండిందిగా.. అన్ని పథకాల్లో కెల్లా అత్యధిక వడ్డీ ఇక్కడే..
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)పై వడ్డీ రేటును ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా(ఈపీఎఫ్ఓ) సవరించింది. 2023-24 సంవత్సరానికి 8.15 శాతం నుంచి మూడేళ్ల గరిష్ట స్థాయి 8.25 శాతానికి పెంచింది. PPF, సుకన్య సమృద్ధి యోజన మరియు పోస్టాఫీసు డిపాజిట్ల వంటి చిన్న పొదుపు పథకాలతో పోలిస్తే ఇప్పుడు ఈ వడ్డీ రేటు ఎక్కువగా ఉంది. ఇవి వార్షికంగా 8.2 శాతం వరకు ఆఫర్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్మాల్ సేవింగ్స్ స్కీమ్లలో ఎంత వడ్డీ అందిస్తున్నారు? తెలుసుకుందాం..

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)పై వడ్డీ రేటును ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా(ఈపీఎఫ్ఓ) సవరించింది. 2023-24 సంవత్సరానికి 8.15 శాతం నుంచి మూడేళ్ల గరిష్ట స్థాయి 8.25 శాతానికి పెంచింది. PPF, సుకన్య సమృద్ధి యోజన మరియు పోస్టాఫీసు డిపాజిట్ల వంటి చిన్న పొదుపు పథకాలతో పోలిస్తే ఇప్పుడు ఈ వడ్డీ రేటు ఎక్కువగా ఉంది. ఇవి వార్షికంగా 8.2 శాతం వరకు ఆఫర్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్మాల్ సేవింగ్స్ స్కీమ్లలో ఎంత వడ్డీ అందిస్తున్నారు? తెలుసుకుందాం..
స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ ఇవి..
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ), కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ)తో సహా చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు ప్రతి త్రైమాసికంలో సమీక్షిస్తుంటారు. ఈ పథకాలపై తాజా వడ్డ రేట్లను గమనిస్తే..
జనవరి-మార్చి 2024 త్రైమాసికానికి వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి..
- సేవింగ్స్ డిపాజిట్: 4 శాతం
- 1-సంవత్సరం పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు: 6.9 శాతం
- 2-సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు: 7.0 శాతం
- 3-సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు: 7.1 శాతం (ఇంతకుముందు 7.0 శాతం)
- 5-సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు: 7.5 శాతం
- 5-సంవత్సరాల రికరింగ్ డిపాజిట్లు: 6.7 శాతం
- నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్లు (ఎన్ఎస్సీ): 7.7 శాతం
- కిసాన్ వికాస్ పత్ర: 7.5 శాతం (115 నెలల్లో మెచ్యూర్ అవుతుంది)
- పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్): 7.1 శాతం
- సుకన్య సమృద్ధి ఖాతా: 8.2 శాతం (ఇంతకుముందు 8.0 శాతం)
- సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్: 8.2 శాతం
- మంత్లీ ఇన్ కమ్ అకౌంట్: 7.4 శాతం.
చిన్న పొదుపు పథకాలు మూడు విభాగాలను కలిగి ఉంటాయి. అవి పొదుపు డిపాజిట్లు, సామాజిక భద్రతా పథకాలు, నెలవారీ ఆదాయ ప్రణాళిక.
పొదుపు డిపాజిట్లలో 1-3 సంవత్సరాల టైమ్ డిపాజిట్లు, 5 సంవత్సరాల రికరింగ్ డిపాజిట్లు ఉంటాయి. వీటిలో నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్లు (ఎన్ఎస్సీ), కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ) వంటి పొదుపు ధ్రువపత్రాలు కూడా ఉన్నాయి. సామాజిక భద్రతా పథకాలలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి ఖాతా, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఉన్నాయి. నెలవారీ ఆదాయ ప్రణాళికలో నెలవారీ ఆదాయ ఖాతా ఉంటుంది.
అక్టోబర్-డిసెంబర్ 2023 త్రైమాసికంలో, పీపీఎఫ్ సుకన్య సమృద్ధి, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌లు, పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్‌లతో సహా చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను అక్టోబర్-డిసెంబర్ 2023 వరకు ప్రభుత్వం మార్చలేదు. కేవలం 5 సంవత్సరాల రికరింగ్ డిపాజిట్లు మాత్రమే వడ్డీ మార్పులు చూశాయి. వడ్డీ రేటును 20 బేసిస్ పాయింట్లు పెంచి 6.7 శాతానికి చేర్చింది. పీపీఎఫ్, ఎన్ఎస్సీ మొదలైన చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు ఇప్పుడు మార్కెట్-లింక్ అయ్యాయి.
వీటిల్లో ఏ పథకాన్ని తీసుకున్న 8.2 కన్నా తక్కువ వడ్డీ రేటునే కలిగి ఉన్నాయి. సుకన్య సమృద్ధి యోజన ఒక్కటే ఈ వడ్డీని అందిస్తోంది. అదే సమయంలో ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ మాత్రం ప్రస్తుతం 8.25శాతం వడ్డీ రేటు అందిస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








