AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPF Balance Without UAN: యూఏఎన్ నెంబర్‌ లేకుండానే మీ పీఎఫ్‌ బ్యాలెన్స్‌ వివరాలు ఇలా చెక్‌ చేసుకోండి

EPF Balance Without UAN: పీఎఫ్‌ పెట్టుబడులకు మరింత పారదర్శకంగా చేయడానికి ఇటీవల కాలంలో ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌ఓ)లు సవరణలు..

EPF Balance Without UAN: యూఏఎన్ నెంబర్‌ లేకుండానే మీ పీఎఫ్‌ బ్యాలెన్స్‌ వివరాలు ఇలా చెక్‌ చేసుకోండి
Epf Balance
Subhash Goud
|

Updated on: May 15, 2021 | 6:05 AM

Share

EPF Balance Without UAN: పీఎఫ్‌ పెట్టుబడులకు మరింత పారదర్శకంగా చేయడానికి ఇటీవల కాలంలో ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌ఓ)లు సవరణలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈపీఎఫ్‌ బ్యాలెన్స్‌ను చెక్‌ చేసుకునేందుకు ఈపీఎఫ్‌ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు ఈపీఎఫ్​ బ్యాలెన్స్​ చెక్​ చేసుకోవాలంటే UAN నంబర్​ తప్పనిసరిగా అవసరం. కానీ, ఇక నుంచి యూనివర్సల్​అకౌంట్​ నంబర్​ (UAN)​ లేకుండానే బ్యాలెన్స్​వివరాలు తెలుసుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది. తద్వారా మీ UAN నెంబర్​ మీకు గుర్తుకు లేకపోయినా కూడా పీఎఫ్​ బ్యాలెన్స్​ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ‌దీని కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 011-229014016 కు మిస్డ్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ఈ సౌకర్యాన్ని పొందేందుకు మీరు ముందుగానే​ UAN పోర్టల్‌లో రిజిస్టర్​చేసుకొని ఉండాలి. అంతేకాక, మీ KYC వివరాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. దీని కోసం ఈ క్రింది ప్రక్రియ అనుసరించండి.

UAN లేకుండా PF బ్యాలెన్స్ ఎలా చెక్​ చేసుకోవాలి..

Step​ 1: ఈపీఎఫ్​ఓ హోమ్​ పేజీ epfindia.gov.in లాగిన్ అవ్వండి Step 2: మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి ‘క్లిక్​ హియర్​ టు నో యువర్​ పీఎఫ్​ బ్యాలెన్స్​’ పై క్లిక్ చేయండి. Step 3: వెంటనే epfoservices.in/epfo/ పేజ్​ ఓపెన్​ అవుతుంది. అక్కడ ‘మెంబర్​ బ్యాలెన్స్​ ఇన్ఫర్మేషన్‌’ను ఎంచుకోండి. Step 4: అక్కడ మీ రాష్ట్రం, ఈపీఎఫ్​ కార్యాలయం, కోడ్​, పీఎఫ్​ ఖాతా సంఖ్య, ఇతర వివరాలను నమోదు చేయండి. Step​ 5: ‘సబ్​మిట్’ చేసే ముందు ‘ఐ అగ్రీ’పై క్లిక్ చేయండి. Step​ 6: అప్పుడు మీ స్క్రీన్​పై ఈపీఎఫ్​ బ్యాలెన్స్​ వివరాలు ప్రత్యక్షమవుతాయి.

అయితే ఈ ప్రక్రియతోనే కాకుండా passbook.epfindia.gov.in వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావడం ద్వారా కూడా మీ యుఎఎన్ నంబర్ లేకుండానే ఈపీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవచ్చు.

UAN నంబర్​తో PF బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి..

ఈపీఎఫ్ఓ చందాదారుడికి UAN నంబర్​ఉంటే, అప్పుడు SMS లేదా మిస్డ్ కాల్ ద్వారా పీఎఫ్​ బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవచ్చు. దీని కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 7738299899 కు EPFOHO UAN అని ఎస్‌ఎంఎస్‌ పంపాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ రిజిస్టర్డ్​ మొబైల్ నంబర్‌కు ఈపీఎఫ్​ఓ సంస్థ పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలను పంపిస్తుంది.

ఇవీ కూడా చదవండి:

LIC Customers: ఎల్‌ఐసీ పాలసీదారులకు గుడ్‌న్యూస్‌.. కరోనా పరిస్థితుల్లో కస్టమర్లకు ఊరట కలిగించే నిర్ణయం

EPF Withdrawal: వివిధ రకాల అవసరాల కోసం ఈపీఎఫ్‌ అకౌంట్‌ నుంచి ఎంత డబ్బు డ్రా చేసుకోవచ్చంటే..!

Follow Us
భారతదేశంలోనే అత్యంత ప్రమాదకర జైలు,బ్రిటిష్ క్రూరత్వానికి నిదర్శనం
భారతదేశంలోనే అత్యంత ప్రమాదకర జైలు,బ్రిటిష్ క్రూరత్వానికి నిదర్శనం
శవాల దిబ్బగా మారిన వెనిజులాకు భారత్ స్నేహ హస్తం!
శవాల దిబ్బగా మారిన వెనిజులాకు భారత్ స్నేహ హస్తం!
జూలై నెలలో ఈ రాశుల వారికి డబ్బే డబ్బు.. మీ రాశి ఉందేమో చూసుకోండి!
జూలై నెలలో ఈ రాశుల వారికి డబ్బే డబ్బు.. మీ రాశి ఉందేమో చూసుకోండి!
బిగ్‌ అలర్ట్‌.. జూలై 1 నుండి మారనున్న 5 కీలక నిబంధనలు
బిగ్‌ అలర్ట్‌.. జూలై 1 నుండి మారనున్న 5 కీలక నిబంధనలు
హైదరాబాద్ తర్వాత అమరావతిలో బసవతారకం.. వైద్య సేవల ప్రారంభ తేదీపై..
హైదరాబాద్ తర్వాత అమరావతిలో బసవతారకం.. వైద్య సేవల ప్రారంభ తేదీపై..
‘ఆపరేషన్ సింధూర్’ అమరవీరులకు దక్కిన శాశ్వత గౌరవం!
‘ఆపరేషన్ సింధూర్’ అమరవీరులకు దక్కిన శాశ్వత గౌరవం!
ఇది ధైర్యమా,పిచ్చి సాహసమా? కింగ్ కోబ్రాకు నోటితో నీళ్లు తాగించాడు
ఇది ధైర్యమా,పిచ్చి సాహసమా? కింగ్ కోబ్రాకు నోటితో నీళ్లు తాగించాడు
పంచదార లేని పాయసం.. ఇలా చేస్తే నోటికి రుచి, శరీరానికి శక్తి
పంచదార లేని పాయసం.. ఇలా చేస్తే నోటికి రుచి, శరీరానికి శక్తి
అనుమానంగా కనిపించిన ఇద్దరు ప్రయాణికులు.. ఆపి చెక్ చేయగా
అనుమానంగా కనిపించిన ఇద్దరు ప్రయాణికులు.. ఆపి చెక్ చేయగా
ఈ సెప్టెంబర్ నాటికే.. మహేష్ ‘వారణాసి’పై రాజ‌మౌళి బిగ్ అప్‌డేట్
ఈ సెప్టెంబర్ నాటికే.. మహేష్ ‘వారణాసి’పై రాజ‌మౌళి బిగ్ అప్‌డేట్