EPFO: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) పీఎఫ్ చందాదారుల కోసం అనేక ఆన్‌లైన్ సర్వీసులు అందుబాటులోకి తీసుకువస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుండటం వల్ల వివిధ పనుల నిమిత్తం పీఎఫ్ (PF) కార్యాలయానికి వెళ్లుకుండా ఇంట్లోనే ఉండి చేసుకునే సౌలభ్యం కల్పిస్తోంది. ఇక పీఎఫ్ (PF Account) ఖాతాలున్నవారికి ముఖ్యంగా నామినీ పేరు చేర్చడం ఎంతో మఖ్యం. అకౌంట్లకు నామినీ పేరు చేర్చడం గత నెలలోనే గడువు ఉండగా, సర్వర్‌లలో సమస్యలు తలెత్తడం కారణంగా గడువును తొలగించారు నామినీ పేరు చేర్చని వారు ఎవరైనా ఉంటే వెంటనే నమోదు చేసుకోవడం బెటర్. అయితే నామినీ పేరు నమోదు చేయకపోతే డబ్బులు అందవు. ఖాతాదారుడికి ఏదైనా ప్రమాదం సంభవించిన సమయంలో సుమారు రూ.7 లక్షల బెనిఫిట్స్ పొందవచ్చు. ఒకవేళ నామినీ పేరు చేర్చనట్లయితే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అయితే ఈపీఎఫ్ నామినీని మార్చడానికి పీఎఫ్ సభ్యులు కొత్త నామినేషన్ దాఖలు చేయవచ్చని ఈపీఎఫ్ చెబుతోంది.
అయితే పీఎఫ్ ఉద్యోగులకు వివిధ సర్వీసులను సులభతరం చేసేందుకు ఈపీఎఫ్‌ఓ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోంది. నామినేషన్ పేరు చేర్చేందుకు ఈపీఎఫ్‌ఓ కార్యాలయానికి వెళ్లకుండానే ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు. ఈ-నామినేషన్ చేయడం ద్వారా ఖాతాదారుడు మరణించినట్లయితే రూ.7 లక్షల వరకు నామినీకి అందుతాయి. ఈ-నామినేషన్ కోసం పీఎఫ్ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్ ద్వారా చేసుకునే సదుపాయం ఉంది. ఆన్‌లైన్ ద్వారా మీ నామినీ పేరును చేర్చుకోవచ్చని ఈపీఎఫ్‌ఓ తెలిపింది. ఒక వేళ మీరు నామినీ పేరును చేర్చనట్లయితే ఈ కింది విధంగా చేసుకోవచ్చు.
► ముందుగా ఈపీఎఫ్‌ఓ పోర్టల్ అధికారిక లింక్‌పై క్లిక్ చేయాలి.
► UAN, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.
► మీరు ఇంకా ఈ-నామినేషన్ చేయకపోతే మీకు పాప్‌అఫ్ వస్తుంది. అప్పుడు దానిపై లేదా ఈ-నామినేషన్‌పై క్లిక్ చేయాలి.
► ఆ తర్వాత ఫ్యామిలీ డిక్లరేషన్ అప్‌డేట్ కొరకు క్లిక్ చేయాలి.
► తర్వాత ఒకరికన్న ఎక్కువ మంది కుటుంబ సభ్యుల ఆధార్ నంబర్, పేరు, పుట్టిన తేదీ, లింగం, ఫోటో, చిరునామా, బ్యాంకు అకౌంట్ తదితర వివరాలు నమోదు చేయాలి.
► వాటాకు సంబంధించిన వివరాలు నమోదు చేసేందుకు నామినేషన్ వివరాలు అనేదానిపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత సేవ్ ఈపీఎఫ్ నామినేషన్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
► ఓటీపీ జనరేట్ చేయడం కొరకు ఈ-సైన్‌పై క్లిక్ చేసిన తర్వాత ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేసి సబ్మిట్ చేయాలి. అప్పుడు మీ ఈ-నామినేషన్ రిజిస్టర్ అవుతుంది. ఈ ప్రాసెస్ ద్వారా ఈ-నామినేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే మీ ఆధార్ నంబర్ యూఏఎన్‌కు లింక్ అయి ఉండాలి. అప్పుడు ఈ సేవను పొందేందుకు ఆస్కారం ఉంటుంది. అలాగే మీ ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్ కూడా ఉండాలి.
ఇవి కూడా చదవండి: