AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO Account: పీఎఫ్ అకౌంట్‌లో భారీ మార్పులు.. ఏప్రిల్ 1, 2022 నుంచి కొత్త నిబంధనలు.. అవేంటో తెలుసా?

పీఎఫ్‌లో డిపాజిట్ చేసిన మొత్తం సంవత్సరానికి రూ. 2.5 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తే పీఎఫ్ ఆదాయంపై కొత్త పన్నును వర్తింపజేయడానికి ఆదాయపు పన్ను నిబంధనలలో కొత్త సెక్షన్ 9D చేర్చిన సంగతి తెలిసిందే.

EPFO Account: పీఎఫ్ అకౌంట్‌లో భారీ మార్పులు.. ఏప్రిల్ 1, 2022 నుంచి కొత్త నిబంధనలు.. అవేంటో తెలుసా?
Pf
Venkata Chari
|

Updated on: Nov 14, 2021 | 6:58 PM

Share

Provident Fund: కేంద్ర ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్ను నిబంధనలను ప్రకటించిన సంగతి తెలసిందే. ఈ నిబంధనల ప్రకారం, ప్రస్తుతం ఉన్న ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతాలు రెండు వేర్వేరు ఖాతాలుగా విభజించనున్నారు. దీంతో జమ చేసిన డబ్బు నుంచి ఉద్యోగులు సంపాదించే ఆదాయంపై ప్రభుత్వం పన్ను విధించనుంది. ఇది ఏటా రూ.2.5 లక్షల కంటే ఎక్కువగా ఉంటేనే పన్ను భారం పడనుంది. అంటే పీఎఫ్ ఖాతా ద్వారా రూ. 2.5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే, దానిపై ప్రభుత్వం పన్ను విధిస్తుంది.

ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) నిబంధనలను జారీ చేసింది. పీఎఫ్‌ ఖాతాలో రెండు వేర్వేరు ఖాతాలు ఉండనున్నాయి. ఆ తర్వాత, ప్రస్తుతం ఉన్న అన్ని ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాలు పన్ను విధించదగిన, పన్ను చెల్లించని డిపాజిట్ ఖాతాలుగా విభజించనున్నారు. పన్ను విధించని ఖాతాలలో మార్చి 31, 2021 నాటికి వాటి మెత్తాన్ని జమ చేయనున్నారు. కొత్త నిబంధనలను ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆగస్టు 31న నోటిఫై చేసి, ఆ తర్వాత ఆదాయపు పన్ను శాఖకు సమాచారం ఇచ్చింది.

పీఎఫ్‌ ఖాతాలో మార్పులు.. అధికారిక వర్గాల ప్రకారం, ఈ నిబంధనలు వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే 1 ఏప్రిల్ 2022 నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నిబంధన అమలులోకి వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తికి పీఎఫ్ ఖాతాలో రెండు ఖాతాలు ఉంటాయి. వడ్డీ డబ్బు జమ చేసే ఖాతా ఉంటుంది. దానిపై పన్ను విధించరు. రెండవ ఖాతాలో పన్ను డబ్బు జమ చేయనున్నారు.

పీఎఫ్‌లో డిపాజిట్ చేసిన మొత్తం సంవత్సరానికి రూ. 2.5 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తే, పీఎఫ్‌ ఆదాయంపై కొత్త పన్నును వర్తింపజేయడానికి ఆదాయపు పన్ను నిబంధనలలో కొత్త సెక్షన్ 9D చేర్చారు. పన్ను విధించదగిన వడ్డీని గణించడం కోసం, ఒక వ్యక్తి డిపాజిట్ చేసిన డబ్బుపై పన్ను విధించదగిన, పన్ను విధించని డిపాజిట్లు లెక్కించనున్నారు. దీని కోసం ప్రస్తుతం ఉన్న పీఎఫ్ ఖాతాలోనే రెండు వేర్వేరు ఖాతాలను నిర్వహించాల్సి ఉంటుంది. పీఎఫ్‌ ఖాతాలలోని మునుపటి చెల్లింపులన్నీ ఒకే ఖాతాలో ఉంచనున్నారు. ఇది పన్ను రహితంగా ఉంటుంది. 2022 ఆర్థిక సంవత్సరంలో అయితే, ప్రతి సబ్‌స్క్రైబర్‌కు కొత్త పీఎఫ్‌ ఖాతా ఇవ్వనున్నారు. ఇందులో రూ. 2.5 లక్షల కంటే ఎక్కువ డబ్బు జమ చేస్తే పన్ను విధించనున్నారు.

రెండు ఖాతాలు ఎందుకు.. ఈ నియమం ఏప్రిల్ 1, 2022 నుంచి అమలులోకి వస్తుంది. టాక్స్‌ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనతో కొన్ని అపోహలను తొలగించి, వడ్డీ గణనను మరింత సౌకర్యవంతంగా చేయనుంది. అధిక సంపాదన కలిగిన వ్యక్తులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను దుర్వినియోగం చేయకుండా నిరోధించడమే ఈ నిర్ణయం ఉద్దేశమని ప్రభుత్వం పేర్కొంది. అలాంటి వ్యక్తులు ఈ పథకాలను సద్వినియోగం చేసుకునేందుకు ప్రకటించారని తెలుస్తోంది. గ్యారంటీ వడ్డీ రూపంలో పన్ను రహిత మొత్తాన్ని వసూలు చేయనున్నారు. బ్యాంకు వడ్డీ మాదిరిగానే, పీఎఫ్ వడ్డీని ఏడాది వారీగా లెక్కిస్తారు. పన్ను రిటర్న్‌ను సమర్పించే సమయంలో, పన్ను చెల్లింపుదారులు తమ పీఎఫ్ ఖాతాల్లో రూ. 2.5 లక్షలకు మించిన వడ్డీని ఐటీఆర్‌లో చేర్చాల్సి ఉంటుంది.

ప్రభుత్వేతర ఉద్యోగులకు రూ.2.5 లక్షల పరిమితి వర్తిస్తుందని, మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు రూ.5 లక్షల పరిమితి ఉందని గమనించాలి. ఫిబ్రవరి 2021లో మునుపటి బడ్జెట్ ప్రకటనలో పన్ను విధించదగిన ఆదాయాన్ని ఎలా లెక్కించాలి అనే దాని గురించి సరైన సమాచారం లేదు. పన్ను విధించని డిపాజిట్ల నుంచి ఇది ఎలా వేరు చేస్తారో కూడా వివరించలేదు.

Also Read: Term Insurance Policy: భారం కానున్న టర్మ్ పాలసీలు.. 40 శాతం పెరగనున్న ధరలు.. ఎప్పటి నుంచి, ఎందుకో తెలుసా?

PM Fasal Bima Yojana: కేంద్రం ప్రవేశపెట్టిన ఈ పథకంలో దరఖాస్తులు పెరిగినా.. బెనిఫిట్ పొందిన రైతుల సంఖ్య తగ్గింది..!