Nitin Gadkari: ఎలక్ట్రిక్ వాహనం తీసుకుంటే నెలకు రూ.2000 ఖర్చు.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాం..
ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రానున్న రెండేళ్లలో భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు పెట్రోల్ వాహనాల స్థాయికి తగ్గుతాయని చెప్పారు...
ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రానున్న రెండేళ్లలో భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు పెట్రోల్ వాహనాల స్థాయికి తగ్గుతాయని చెప్పారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతుందని అయితే అధిక ధరలు విక్రయాలకు ఆటంకంగా మారుతున్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. భవిష్యత్తులో ధరలు తగ్గుతాయని తెలిపింది.
పెట్రోల్, డీజిల్ దిగుమతిని తగ్గించడానికి, ఇథనాల్, సీఎన్‌జీ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని గడ్కరీ చెప్పారు. ప్రజలు కూడా ఈ ఇంధనాలపై ఆసక్తి చూపాలని ప్రభుత్వం కోరుతున్నారు. ప్రస్తుతం పెట్రోల్ పంపుల ద్వారా ఇంధనంలో ఇథనాల్ కలపడం జరుగుతోంది. రాబోయే కాలంలో, బ్లెండింగ్ మొత్తం పెరుగుతుంది. దీని కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఇథనాల్ విధానాన్ని అమలులోకి తెచ్చిందని చెప్పారు.
మన పెట్రోల్, డీజిల్ అవసరాల్లో 80 శాతానికి పైగా దిగుమతి చేసుకుంటున్నామని గడ్కరీ తెలిపారు. 8 లక్షల కోట్ల విలువైన పెట్రోల్, డీజిల్ దిగుమతి చేసుకుంటున్నామని వెల్లడించారు. శిలాజ ఇంధనాలపై ఆధారపడటం కొనసాగిస్తే వచ్చే ఐదేళ్లలో మన దిగుమతి బిల్లు రూ.25 లక్షల కోట్లకు పెరుగుతుందని చెప్పారు. నెలకు పెట్రోల్ వాహనం ఇంధనం రూ.12,000-15,000 ఉంటే, ఎలక్ట్రిక్ వాహనంలో రూ.2,000 అవుతుందని మంత్రి తెలిపారు. పర్యావరణ అనుకూల వాహనాలను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం FAME ఇండియా పథకాన్ని ప్రారంభించిందన్నారు.
పెట్రోలు, డీజిల్, ఇతర పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం ద్వారా ఆయా ఉత్పత్తులపై పన్ను తగ్గడంతో పాటు కేంద్ర, రాష్ట్రాలకు ఆదాయం పెరుగుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు లభిస్తే పెట్రోలు, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి తప్పకుండా ప్రయత్నిస్తామని గడ్కరీ చెప్పారు. సెప్టెంబరులో కేరళ హైకోర్టు జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ తీసుకురావడపై నిర్ణయం తీసుకోవాలని చెప్పినట్లు గడ్కరీ గుర్తు చేశారు.
Read Also.. Mutation: మీరు ఏదైనా ఆస్తిని కొనుగోలు చేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..