RBI Retail Direct : ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఆర్బీఐ కొత్త స్కీం.. పూర్తి వివరాలివే..
ప్రభుత్వ సెక్యూరిటీ(జీ సెక్)ల్లో రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఆహ్వానిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని నెలల క్రితం'ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్' స్కీం ను ప్రకటించిన సంగతి తెలిసిందే
ప్రభుత్వ సెక్యూరిటీ(జీ సెక్)ల్లో రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఆహ్వానిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని నెలల క్రితం’ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్’ స్కీం ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని ఉపయోగించి రిటైల్ పెట్టుబడిదారులు ఆర్‌బీఐ డైరెక్ట్ గిల్ట్ అకౌంట్ తెరచి నేరుగా ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడులు పెట్టవచ్చు. ఇందుకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ స్కీంను శుక్రవారం (నవంబర్12)న ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారికంగా ప్రారంభించనున్నారు.
మార్కెట్లో నిర్మాణాత్మక సంస్కరణ.. కరోనా కారణంగా కుదేలైపోయిన ఆర్థిక రంగాన్ని గట్టెక్కించడమే ప్రధాన లక్ష్యంగా గవర్నర్ శక్తికాంతా దాస్ ఈ స్కీంను ప్రవేశపెట్టారు. అమెరికా, బ్రెజిల్ లాంటి దేశాలు రిటైల్ పెట్టుబడులను పరోక్షంగా అనుమతిస్తున్నాయి. తాజా స్కీంతో భారత్ కూడా ఈ జాబితాలోకి చేరనుంది. తద్వారా ప్రభుత్వ సెక్యూరిటీల్లోకి రిటైల్ ఇన్వెస్ట్‌మెంట్లను అనుమతించిన తొలి ఆసియా దేశంగా గుర్తింపు పొందనుంది. ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీం ప్రభుత్వ సెక్యూరిటీల మార్కెట్లో అతి పెద్ద నిర్మాణాత్మక సంస్కరణ అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇందులో రిజిష్టర్ చేయాలనుకునే ఇన్వెస్టర్లకు దేశీయంగా ఏదైనా బ్యాంకులో ఎస్‌బీ ఖాతా ఉండాలి. పాన్‌కార్డు, ఈ- మెయిల్ ఐడీ, రిజిష్టర్డ్ మొబైల్ నంబర్ సహాయంతో కేవైసీ ప్రక్రియను పూర్తిచేయవచ్చు. కాగా ఈ పథకం కోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్ పోర్టల్‌ను ఆర్బీఐ ప్రారంభించింది.
Also Read:
Anand Mahindra: వారితో పాటు అవార్డు తీసుకోవడం గొప్పగా ఉంది.. ఆనంద్ మహీంద్రా..
Business: సేఫ్టీ టెస్ట్‌లో మహీంద్రా ఎక్స్‌యూవీ 700 టాప్ స్కోర్.. 5 స్టార్ రేటింగ్ సొంతం..