Electric Scooter: ఒక్కసారి చార్జ్‌ చేస్తే 480 కిలోమీటర్లు.. మార్కెట్లోకి రానున్న మరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..!

| Edited By: Shaik Madar Saheb

Sep 28, 2021 | 11:06 AM

Electric Scooter: ప్రస్తుతం పెట్రోల్‌,డీజిల్‌ ధరలు పెరుగుతుండటంతో వాహనతయారు కంపెనీలు ఎలక్ట్రికల్‌ వాహనాల తయారీకి మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటికే పలు..

Electric Scooter: ఒక్కసారి చార్జ్‌ చేస్తే 480 కిలోమీటర్లు.. మార్కెట్లోకి రానున్న మరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..!
Follow us on

Electric Scooter: ప్రస్తుతం పెట్రోల్‌,డీజిల్‌ ధరలు పెరుగుతుండటంతో వాహనతయారు కంపెనీలు ఎలక్ట్రికల్‌ వాహనాల తయారీకి మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటికే పలు ఎలక్ట్రిక్‌ వాహనాలు మార్కెట్లో విడుదల కాగా, మరిన్ని కంపెనీలు ఇలాంటి వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. చాలా మంది కూడా కూడా ఈవీ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పలు కంపెనీలు కూడా ఎలక్ట్రిక్‌ వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో పోటీ పెరిగిపోతోంది. ఇప్పటికే, ఓలా ఎలక్ట్రిక్, అథర్, బజాజ్, టీవీఎస్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో తమ విడుదల చేశాయి. ఈ కంపెనీలు తమకంటూ ప్రత్యేకతను చాటుకున్నాయి. అయితే, తాజాగా మరో కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకొనివచ్చేందుకు సిద్దం అవుతుంది. రాఫ్ట్ మోటార్స్ అనే కంపెనీ ఇండస్ ఎన్ఎక్స్ పేరుతో మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. రాఫ్ట్ కంపెనీ నవంబర్ 2, 2021న దీనిని విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇండస్ ఎన్ఎక్స్ స్కూటర్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే సుమారు 480 కిలోమీటర్ల దూరం వెళ్లవచ్చని కంపెనీ చెబుతోంది. ఇందులో రెండు రకాల మోడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకటి ఎకో మోడ్, మరొకటి స్పీడ్ మోడ్. ఎకో మోడ్‌లో(గంటకు 25 కి.మీ) వెళ్తే ఈ స్కూటర్ 550 కిలోమీటర్ల వరకు వెళ్లనుంది, స్పీడ్ మోడ్‌లో(గంటకు 40-45 కి.మీ) వెళ్తే 480 కిలోమీటర్ల వరకు వెళ్లనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్‌ను మూడు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దీని ధర స్కూటర్ రేంజ్ బట్టి మారే అవకాశం ఉంది.

ఇండస్ ఎన్ఎక్స్‌లో ఒక సారి చార్జ్‌ చేస్తే వెళ్లే కిలోమీటర్ల రేంజ్‌ని బట్టి ధర:

480 కి.మీ. ధర రూ. 2,57,431,325 కి.మీ ధర రూ. 1,91,971, 165 కి.మీ. ధర రూ. 1,18,500.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సాధారణ చార్జర్ ద్వారా ఫుల్ చార్జ్ చేయడానికి కనీసం 8 నుంచి 24 గంటల సమయం పడుతుంది. అదే కంపెనీ అందించే ఫాస్ట్ చార్జర్ ద్వారా కేవలం 5 గంటలలో ఫుల్ చార్జ్ చేయవచ్చని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులో రెండు బ్యాటరీలు ఉంటాయి. ఇందులో రివర్స్ మోడ్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ సామర్థ్యం 11.5 కిలోవాట్లు. ఇందులో ప్రధాన లోపం ఏమిటంటే దీని గరిష్ట స్పీడ్ 50 కి.మీ మాత్రమే.

ఇవీ కూడా చదవండి!

BMW Scooter: బీఎండబ్ల్యూ నుంచి స్కూటర్‌..! ధర, ఫీచర్స్‌ ఎలా ఉన్నాయంటే..?

SBI Customers Alert: మీ మొబైల్‌లో ఈ నాలుగు యాప్స్‌ ఉన్నాయా..? వెంటనే డిలీట్‌ చేయండి: ఎస్‌బీఐ