Tissue Paper Manufacturing Business: మీరు మీ ఇంటి నుంచే ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటే.. మీరు మీ ఇంటి నుండి సులభంగా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. మీరు నిజంగా వ్యాపారం చేయాలనుకుంటే టిష్యూ పేపర్ వ్యాపారంలోకి రావొచ్చు. ఎందుకంటే ఈ వ్యాపారం ప్రారంభించడానికి ప్రభుత్వం కూడా మీకు సహాయం చేస్తోంది. పేపర్ న్యాప్‌కిన్‌ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా నెలకు లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు. గతంలో టిష్యూ పేపర్లను హోటల్లు, రెస్టారెంట్లలో ఆహారం తినేప్పుడు మాత్రమే ఉపయోగించేవారు. కానీ ప్రస్తుతం టిష్యూలను ఎక్కువగా వాడుతున్నారు. అన్ని సీజన్లలో వీటికి డిమాండ్ పెరిగింది. కాబట్టీ టిష్యూ పేపర్ బిజినెస్ ప్రారంభిస్తే మంచి లాభాలను పొందవచ్చు. అయితే, ఈ టిష్యూపేపర్లను ఎలా తయారు చేస్తారు. ఈ వ్యాపారం ఎలా మొదలు పెట్టాలి.. ఎంత వరకు ఆర్జించవచ్చో తెలుసుకుందాం..
ఇందుకోసం దాదాపు రూ.3.50 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత బ్యాంకు నుంచి ముద్ర స్కీం ద్వారా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. మీ వద్ద రూ. 3.50 లక్షలు ఉంటే.. మీరు బ్యాంక్ నుంచి టర్మ్ లోన్‌గా సుమారు రూ. 3.10 లక్షలు, వర్కింగ్ క్యాపిటల్ లోన్ కింద రూ. 5.30 లక్షల వరకు రుణాన్ని పొందుతారు.
టిష్యూ పేపర్ లేదా పేపర్ నాప్‌కిన్‌ల వ్యాపారం చేస్తే.. ఏడాదిలో 1.50 లక్షల కిలోల పేపర్ నాప్‌కిన్‌లను ఉత్పత్తి చేయవచ్చు. మార్కెట్‌లో కిలో రూ.65 చొప్పున విక్రయించవచ్చు. అంటే, మీరు ఏడాదిలో దాదాపు రూ.97.50 లక్షల టర్నోవర్‌ను సులభంగా చేయవచ్చు. ఇందులో ఖర్చులన్నీ తీసేస్తే ఏటా దాదాపు రూ. 10లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు ఆర్జించవచ్చు.
ముద్రా యోజన ప్రయోజనాన్ని పొందడానికి, మీకు సమీపంలోని ఏదైనా బ్యాంకును సంప్రదించడం ద్వారా మీరు ప్రధాన మంత్రి ముద్రా యోజన కింద దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం, మీరు ఒక ఫారమ్‌ను పూరించాలి, అందులో ఈ వివరాలు ఇవ్వాలి. మీరు రుణ మొత్తాన్ని సులభ వాయిదాలలో కూడా తిరిగి పొందవచ్చు.
మారుతున్న నేటి జీవనశైలిలో టిష్యూ పేపర్, నాప్కిన్ వాడకం చాలా వేగంగా పెరుగుతోంది. సాధారణంగా చెప్పాలంటే.. చేతులు, నోటిని శుభ్రం చేయడానికి టిష్యూ పేపర్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అందుకే మారుతున్న జీవనశైలిలో టిష్యూ పేపర్‌కు మార్కెట్‌లో డిమాండ్ బాగా పెరిగింది. మార్కెట్‌లో విక్రయించేటప్పుడు మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం