AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Driving Licence: భారతీయ డ్రైవింగ్ లైసెన్స్‌తో ప్రపంచంలోని ఈ 25 దేశాలలో డ్రైవ్ చేయవచ్చు!

Driving Licence: మీరు భారతీయ లైసెన్స్‌ తో ఎటువంటి అదనపు అనుమతులు లేకుండా ప్రపంచవ్యాప్తం గా మొత్తం 25 దేశాలలో డ్రైవ్ చేయవచ్చు. అదనంగా, డ్రైవింగ్ చేయడానికి అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ (IDP) అవసరమయ్యే కొన్ని దేశాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..

Driving Licence: భారతీయ డ్రైవింగ్ లైసెన్స్‌తో ప్రపంచంలోని ఈ 25 దేశాలలో డ్రైవ్ చేయవచ్చు!
Subhash Goud
|

Updated on: Apr 28, 2025 | 1:26 PM

Share

భారతదేశంలో డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే వేరే దేశంలో డ్రైవ్ చేయవచ్చా? అంటే అవుననే సమాధానం వస్తుంది. మన భారత డ్రైవింగ్‌ లైసెన్స్‌తో కొన్ని దేశాల్లో డ్రైవింగ్‌ చేయవచ్చు. మీరు భారతీయ లైసెన్స్‌తో, ఎటువంటి అదనపు పర్మిట్లు లేకుండా, ప్రపంచవ్యాప్తంగా మొత్తం 25 దేశాలలో ఎటువంటి పరిమితులు లేకుండా డ్రైవ్ చేయవచ్చు. అదనంగా, డ్రైవింగ్ చేయడానికి అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ (IDP) అవసరమయ్యే కొన్ని దేశాలు ఉన్నాయి. ఆ పర్మిట్‌తో, మీరు 150 దేశాలలో డ్రైవ్ చేయవచ్చు. అయితే, భారతీయ లైసెన్సులు చెల్లుబాటు అయ్యే దేశాలకు అనేక షరతులు ఉన్నాయి. భారతీయ లైసెన్స్ వాస్తవానికి అక్కడ తాత్కాలికంగా చెల్లుతుంది. దీనికి కూడా అనేక షరతులు ఉన్నాయి.

అమెరికా, యుకె వంటి దేశాలలో భారతీయ లైసెన్సులు ఒక సంవత్సరం చెల్లుబాటులో ఉంటాయి. అయితే ఆ సందర్భంలో మీకు అంతర్జాతీయ డ్రైవింగ్ అనుమతి ఉండాలి. అదనంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, దక్షిణాఫ్రికా, స్వీడన్, సింగపూర్‌లలో భారతీయ డ్రైవింగ్ లైసెన్స్‌లు ఒక సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతాయి. మలేషియా, కెనడాలో భారతీయ లైసెన్సుల చెల్లుబాటు మూడు నెలలు. మరోవైపు జర్మనీ, స్పెయిన్‌లలో లైసెన్స్ 6 నెలల వరకు చెల్లుబాటు అవుతుంది.

ఐడీపీ లేకుండా డ్రైవింగ్ చేయడానికి అనుమతించే దేశాలలో UK, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇటలీ, ఫిన్లాండ్, నార్వే, మలేషియా, UAE, మారిషస్, భూటాన్, నేపాల్ మరియు ఐర్లాండ్ ఉన్నాయి.

IDP అంటే ఏమిటి?

IDP (అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్) అంటే మీ స్వదేశీ లైసెన్స్ అక్కడ చెల్లకపోయినా, విదేశాలలో చట్టబద్ధంగా వాహనాన్ని నడపడానికి మిమ్మల్ని అనుమతించే పత్రం. ఇది మీ జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ యొక్క అనువాదంగా పనిచేస్తుంది. తరచుగా కారు అద్దె ఏజెన్సీలు, స్థానిక అధికారులకు అవసరం అవుతుంది. IDP పొందడానికి మీకు సాధారణంగా చెల్లుబాటు అయ్యే జాతీయ లైసెన్స్ అవసరం.

వెస్ట్రన్ ఇండియా ఆటోమొబైల్ అసోసియేషన్ (WIAA) వంటి నియమించిన సంస్థ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే IDP తో లైసెన్సులు చెల్లుబాటు అయ్యే దేశాలు ఐస్లాండ్, సౌదీ అరేబియా, హాంకాంగ్, థాయిలాండ్, సింగపూర్, స్వీడన్, స్పెయిన్, స్విట్జర్లాండ్, దక్షిణాఫ్రికా, జర్మనీ, కెనడా ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి