PF Link Aadhar: ఎంప్లాయూస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ అకౌంట్‌కు ఆధార్‌తో అనుసంధించడానికి ప్రభుత్వం జూన్1ని చివరి తేదీగా నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికీ చాలా మంది పీఎఫ్ అకౌంట్‌కు ఆధార్‌ను లింక్ చేయలేదు. దీంతో ఉద్యోగులు తమ సంస్థ అందించే వాటాను కోల్పోతారు. సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020 లోని సెక్షన్ 142 ప్రకారం ఈపీఎఫ్ఓ కొత్త నియమనిబంధనల్ని అమలు చేసింది. ఆధార్ లింక్ చేయకపోతే.. ఉద్యోగులకు పీఎఫ్ అకౌంట్‌లో తమ వాటా మాత్రమే కనిపిస్తుంది. యజమాని షేర్ కనిపించదు. ఈ క్రమంలో సంస్థలు తమ ఉద్యోగుల ఆధార్‌ను లింక్ చేస్తున్నాయి. అలా కాకుండా ఉద్యోగి తనకు తానుగా కూడా ఆధార్‌ను పీఎఫ్ అకౌంట్‌తో లింక్ చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం ఏం చేయాలంటే..
* ఇందుకోసం ముందుగా ఈపీఎఫ్ఓ పోర్టల్‌ను ఓపెన్ చేయాలి.
* అనంతరం మీ యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.
* అనంతరం మేనేజ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
* తర్వాత డ్రాప్ డౌన్ మెనూలో కేవైసీ ఆప్షన్‌పై క్లిక్ చేయగానే కొత్త పేజీ ఓఎన్ అవుతుంది.
* అనంతరంలో అందులో ఉండే ఆధార్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకొని.. ఆధార్ నెంబర్, పేరు ఎంటర్ చేయాలి.
* సేవ్ చేసిన తర్వాత వివరాలను ఒకసారి సరిచూసుకోవాలి.
* అనంతరం మీరు ఇచ్చిన వివరాలు.. యూఐడీఏఐ డేటాతో క్రాస్ చెక్ చేసిన తర్వాత అప్రూవ్ అవుతుంది.
* చివరిగా వెరిఫైడ్ అనే మెసేజ్ వస్తుంది.