Flight Tickets: విమాన ప్రయాణం మరింత భారం కానుందా.. టికెట్ల ధరల పరిమితి పెంచాలని కోరుతున్న ఎయిర్‌లైన్స్‌ సంస్థలు..

పెట్రోల్-డీజిల్, CNGతో పాటు జెట్ ఇంధనం ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. జెట్ ఇంధనం అనేది విమానాలు టేకాఫ్, రన్‌వేలపై నడిచేందుకు ఉపయోగపడే ఇంధనం...

Flight Tickets: విమాన ప్రయాణం మరింత భారం కానుందా.. టికెట్ల ధరల పరిమితి పెంచాలని కోరుతున్న ఎయిర్‌లైన్స్‌ సంస్థలు..
Flight Journey
Follow us

| Edited By: Team Veegam

Updated on: Jun 13, 2022 | 12:12 PM

పెట్రోల్-డీజిల్, CNGతో పాటు జెట్ ఇంధనం ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. జెట్ ఇంధనం అనేది విమానాలు టేకాఫ్, రన్‌వేలపై నడిచేందుకు ఉపయోగపడే ఇంధనం. ఇటీవలి కాలంలో ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత, అన్ని రకాల ఇంధన ధరలు పెరిగాయి. జెట్ ఇంధనం లేదా గ్యాసోలిన్ కూడా వీటిలో ఒకటి. విమాన ఇంధనం ధరల కారణంగా విమానయాన సంస్థలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇంధన ధరలో పెరుగుదలతో దేశీయ విమానయాన సంస్థ ఇండిగో విమాన ఛార్జీల గరిష్ట పరిమితిని పెంచాలని ప్రభుత్వాన్ని కోరింది. ఇది జరిగితే అప్పుడు విమాన ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. కోవిడ్ ప్రభావంతో విమానయాన సంస్థలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. గత రెండేళ్ల రికార్డును పరిశీలిస్తే.. ఈ రంగం ఓ విధంగా కుప్పకూలింది. కరోనా సంక్రమణను నివారించడానికి అన్ని రకాల విమాన ప్రయాణాలను నిషేధించారు. అంతర్జాతీయ విమానాలు పూర్తిగా నిలిచిపోయాయి.

లాక్‌డౌన్ ఎత్తివేసినా ప్రయాణీకుల సంఖ్య తక్కువగానే ఉంది. ఇప్పుడు విమాన సేవ పునరుద్ధరించిన తర్వాత రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో చమురు ధరలు పెరిగాయి. జెట్ ఇంధన ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఎయిర్‌లైన్ కంపెనీలు తమ మునుపటి నష్టాలను పూడ్చుకునేందుకు ధరలు పెంచే యోచనలో ఉన్నాయి. గరిష్ట పరిమితిని పెంచడం ద్వారా మాత్రమే టిక్కెట్ల ధరను పెంచవచ్చు. అందుకే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. 2020 సంవత్సరంలో ప్రభుత్వం విమాన ఛార్జీల తక్కువ, ఎగువ పరిమితులను నిర్ణయించింది. ప్రభుత్వం తక్కువ పరిమితిగా రూ.2900గా నిర్ణయించింది. విమానయాన సంస్థల నష్టాన్ని తగ్గించేందుకు ఈ చర్య తీసుకున్నారు. వారి కార్యకలాపాలను కొనసాగించడానికి, ప్రభుత్వం తక్కువ పరిమితిని నిర్ణయించింది. దీంతో ప్రభుత్వం గరిష్ట పరిమితిగా రూ.8800గా నిర్ణయించింది. ప్రయాణికుల సంఖ్య పెరిగినప్పుడు విమానయాన సంస్థలు ఇష్టారాజ్యంగా ఛార్జీల వసూళ్లకు పాల్పడకుండా ఉండేందుకు ఇలా చేశారు.