ఆధునిక ప్రపంచం.. అంతా అరచేతిలోనే.. కుటుంబ యోగక్షేమాలైనా.. వార్తలైనా.. సినిమాలైనా.. డబ్బు చెల్లింపులైనా.. ఏదైనా ఒక్క స్మార్ట్‌ఫోన్ తోనే.. ఇలా నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ ప్రతి ఒక్కరికీ నిత్యావసర సాధనం మారింది.. అయితే.. కొంతమంది ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేస్తారు.. మరికొందరు తక్కువ బడ్జెట్‌లో మంచి ఫోన్‌ను కొనుగోలు చేయాలని ఎదురు చూస్తుంటారు.. ముఖ్యంగా, పండుగ సీజన్లలో బడ్జెట్ లో మంచి మొబైల్స్ వస్తుంటాయి.. ఆఫర్లలో ఎన్నో కంపెనీల స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉంటాయి.. దీపావళీ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లో ఎన్నో స్మార్ట్ ఫోన్లు తక్కువ బడ్జెట్ లో ఉందుబాటులో ఉన్నాయి.. ఈ రోజు మనం అలాంటి కొన్ని స్మార్ట్‌ఫోన్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. రూ.12,000 ధర లోపు అందుబాటులో ఉండటంతోపాటు.. మంచి ఫీచర్లను కూడా కలిగి ఉన్నాయి.. ఇందులో Realme, Samsung, Motorola, Lenovo, Infinix వంటి కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. అవేంటో ఓ లుక్కెయండి..
Realme నార్జో N65 స్మార్ట్‌ఫోన్‌లో మీరు 2 కలర్ ఆప్షన్లను పొందవచ్చు.. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 14,999.. అయితే ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో మీరు దీన్ని 12 శాతం తగ్గింపుతో కేవలం రూ. 11,657కే పొందవచ్చు.. Realme Narzo N65 మొబైల్ 6 GB RAM, 128 GB ROM, 6.67 అంగుళాల డిస్ప్లే తో అందుబాటులో ఉంది. ఫోన్‌లో 5000 mAh బ్యాటరీ, ఫోటో-వీడియోగ్రఫీ కోసం 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
Motorola G34 5G చార్‌కోల్ బ్లాక్ కలర్ వేరియంట్‌ను 15 శాతం తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లో కేవలం రూ. 11,848కే పొందవచ్చు.. ఫోటో-వీడియో కోసం, మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ కెమెరాను పొందవచ్చు.. అంతేకాకుండా 5000 mAh బ్యాటరీ ఉంది.. ఇది కాకుండా, మీరు స్మార్ట్‌ఫోన్‌లో 6.50 అంగుళాల డిస్‌ప్లేతోపాటు.. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్‌ను అమర్చారు.
Poco M3 Cool Black Color మీరు ఈ ఫోన్‌ని 23 శాతం తగ్గింపుతో కేవలం రూ. 9,999కే పొందవచ్చు.. ఈ ఫోన్ వెనుక వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది.. ఇందులో ప్రైమరీ కెమెరా 48MP + 2MP + 2MP, 8MP Front Camera ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ కెమెరా అందించారు. Qualcomm Snapdragon 662 చిప్‌సెట్‌తో కూడిన ఈ ఫోన్ 6000 mAh బ్యాటరీని కలిగి ఉంది.
Samsung Galaxy M15 ఈ ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులో ఉంది.. ఈ స్మార్ట్ ఫోన్‌లో మంచి కెమెరాతోపాటు అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ అసలు ధర రూ. 16,999.. కానీ మీరు అమెజాన్ నుంచి 29 శాతం తగ్గింపుతో కేవలం రూ. 11,999కి కొనుగోలు చేయవచ్చు.
ఈ తగ్గింపు ధరలతోపాటు.. పలు రకాల క్రెడిట్ కార్డులపై కూడా ఆఫర్ లను పొందవచ్చు.. ఇంకా తక్కువ బడ్జెట్ లోనే ఫోన్లను సొంత చేసుకోవచ్చు.. ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి..
(నోట్: ఈ స్మార్ట్ ఫోన్లు కేవలం ఆఫర్లు ఉన్న వరికే.. తర్వాత రేట్లల్లో మార్పులు, చేర్పులు జరుగుతాయి.)
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..