JIO 5G: దీపావళి నుంచి జియో 5జీ సేవలు.. మొదటగా ఆ పట్టణాల్లోనే.. ప్రకంటించిన ముఖేష్ అంబానీ..
JIO 5G: భారత టెలికాం చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. దీపావళి పర్వదినం నుంచే.. సరికొత్త నెట్‌వర్క్ వెలుగులు జిగేల్ మననున్నాయి.

JIO 5G: భారత టెలికాం చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. దీపావళి పర్వదినం నుంచే.. సరికొత్త నెట్‌వర్క్ వెలుగులు జిగేల్ మననున్నాయి. దీపావళి నుంచి దేశంలో రిలయన్స్ జియో 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు ఆ సంస్థ సీఎండీ ముఖేష్ అంబానీ ప్రకటించారు. 45వ AGM సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ ఈ ప్రకటన చేశారు. ముందుగా ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. 2023 డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 5G అందుబాటులోకి వస్తుందని ముఖేశ్ అంబానీ ప్రకటించారు. ఎటువంటి వైర్లు లేకుండా అందించే ఈ సేవలను జియో ఎయిర్ ఫైబర్‌గా నామకరణం చేసినట్టు జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ తెలిపారు.
కాగా, దేశ వ్యాప్తంగా 5G నెట్‌వర్క్ అందుబాటులోకి తెచ్చేందుకు 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నామని రిలయన్స్ సంస్థ ప్రకటించింది. దేశంలో మొట్టమొదటిసారిగా వర్చువల్ రియాల్టీ విధానంలో ఈ AGM నిర్వహించారు. 5G సేవలందించేందుకు మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్‌తో భాగస్వామ్యాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ కుదుర్చుకుంది.
Reliance Jio has prepared world’s fastest 5G rollout plan. By Diwali 2022 we’ll launch Jio 5G across multiple key cities, incl metro cities of Delhi, Mumbai, Chennai & Kolkata. By Dec 2023, we will deliver Jio 5G to every town, taluka & tehsil of India: Mukesh Ambani, CMD, RIL pic.twitter.com/kOkvzFueq5
— ANI (@ANI) August 29, 2022
Jio will deploy the latest version of 5G called ‘standalone 5G’. To build a pan-India true 5G network, Jio will invest Rs 2 lakh crores: Akash Ambani, chairman, Reliance Jio pic.twitter.com/b1Igqwe3I5
— ANI (@ANI) August 29, 2022