AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Speed Post: పోస్టల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఇక స్పీడ్‌ పోస్ట్‌ డెలివరీలో కీలక మార్పులు

Speed Post: పోస్టాఫీసు స్పీడ్ పోస్టులో కీలక మార్పులు జరుగనున్నాయి. ఈ మార్పులు అక్టోబర్ 1, 2025 నుండి అమలులోకి వస్తాయి. ఆగస్టు 1, 1986న ప్రారంభించబడిన స్పీడ్ పోస్ట్.. దేశవ్యాప్తంగా వేగవంతమైన, నమ్మదగిన డెలివరీకి ప్రసిద్ధి చెందింది. ఇండియా పోస్ట్ ఆధునీకరణలో..

Speed Post: పోస్టల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఇక స్పీడ్‌ పోస్ట్‌ డెలివరీలో కీలక మార్పులు
పన్ను ప్రయోజనాలు: PPF పథకంలో పెట్టుబడులు సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలను అందిస్తాయి. పెట్టుబడి, వడ్డీ రెండూ పూర్తిగా పన్ను రహితంగా ఉంటాయి. ఇది మీ మొత్తం పొదుపును మరింత పెంచుతుంది. ఇంకా పోస్ట్ ఆఫీస్ నిర్వహించే ఈ పథకంలో పెట్టుబడులు సురక్షితమైనవి. అలాగే భారత ప్రభుత్వంచే హామీ ఇస్తుంది.
Subhash Goud
|

Updated on: Sep 27, 2025 | 2:41 PM

Share

Speed Post: ఇన్‌ల్యాండ్ స్పీడ్ పోస్ట్ (డాక్యుమెంట్) కోసం టారిఫ్ మార్పులు, కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టినట్లు పోస్ట్‌ల శాఖ ప్రకటించింది. ఈ మార్పులు అక్టోబర్ 1, 2025 నుండి అమలులోకి వస్తాయి. ఆగస్టు 1, 1986న ప్రారంభించబడిన స్పీడ్ పోస్ట్.. దేశవ్యాప్తంగా వేగవంతమైన, నమ్మదగిన డెలివరీకి ప్రసిద్ధి చెందింది. ఇండియా పోస్ట్ ఆధునీకరణలో భాగంగా ప్రారంభించిన ఈ సేవ ప్రైవేట్ కొరియర్ కంపెనీలకు బలమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది.

స్పీడ్ పోస్ట్ టారిఫ్‌లను చివరిసారిగా అక్టోబర్ 2012లో సవరించారు. పెరుగుతున్న కార్యాచరణ ఖర్చులు, కొత్త టెక్నాలజీలో పెట్టుబడులను పరిష్కరించడానికి టారిఫ్ మార్పులు చేసింది పోస్టల్‌ శాఖ. అదనంగా కస్టమర్ సౌలభ్యం, విశ్వసనీయతను పెంచడానికి కొత్త ఫీచర్లు జోడించారు.

కొత్త ఫీచర్లు:

రిజిస్ట్రేషన్ సర్వీస్: స్పీడ్ పోస్ట్ (పత్రాలు/పార్శిల్‌లు) కోసం రిజిస్ట్రేషన్ ఇప్పుడు అందుబాటులో ఉంది. చిరునామాదారునికి లేదా వారి అధీకృత ప్రతినిధికి మాత్రమే డెలివరీ చేయబడుతుంది. ప్రతి వస్తువుకు రూ.5 రుసుము, జీఎస్టీ వసూలు చేస్తారు.

OTP డెలివరీ: ఈ ఫీచర్ చిరునామాదారుడు OTPని ధృవీకరించిన తర్వాత మాత్రమే డెలివరీని అనుమతిస్తుంది. దీనికి ప్రతి వస్తువుకు రూ.5 ప్లస్ జీఎస్టీ ఖర్చవుతుంది.

విద్యార్థులకు తగ్గింపు: విద్యార్థులకు టారిఫ్‌పై 10% తగ్గింపు లభిస్తుంది.

SMS ఆధారిత డెలివరీ నోటిఫికేషన్లు: వినియోగదారులు SMS ద్వారా డెలివరీ సంబంధిత సమాచారాన్ని అందుకుంటారు.

సౌకర్యవంతమైన ఆన్‌లైన్ బుకింగ్ సేవలు: వినియోగదారులకు ఆన్‌లైన్ బుకింగ్ సౌకర్యం కూడా అందించనున్నారు.

రియల్ టైమ్ డెలివరీ అప్‌డేట్: మీరు రియల్ టైమ్ డెలివరీ అప్‌డేట్‌ను కూడా పొందుతారు.

వినియోగదారుల కోసం రిజిస్ట్రేషన్: ఇతర రిజిస్ట్రేషన్ సౌకర్యాలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉంటాయి.

కొత్త టారిఫ్ రేట్లు:

  • ప్రభుత్వం ఇప్పుడు స్పీడ్ పోస్ట్ ఛార్జీలను సవరించింది. ఈ నెల 1 నుండి 50 గ్రాముల వరకు ఉన్న వస్తువులకు స్థానిక దూరానికి రూ.19, అంతకు మించి దూరాలకు రూ.47 వసూలు చేస్తారు.
  • దీనితో పాటు 51 గ్రాముల నుండి 250 గ్రాముల బరువున్న వస్తువులకు స్థానిక దూరానికి రూ.24, 200 కి.మీ వరకు రూ.59, 201 కి.మీ నుండి 500 కి.మీ వరకు రూ. 63. అలాగే 501-1000 కి.మీ వరకు రూ. 68. అలాగే అంతకంటే ఎక్కువ దూరాలకు రూ.77 చెల్లించాలి.
  • 251 గ్రాముల నుండి 500 గ్రాముల వరకు బరువున్న వస్తువులకు స్థానిక దూరానికి రూ. 28. అలాగే 200 కి.మీ వరకు రూ. 70.201 కి.మీ నుండి 500 కి.మీ మధ్య రూ. 75. 501 కి.మీ నుండి 1000 కి.మీ వరకు రూ. 82 వసూలు చేస్తారు. అలాగే రూ. 1001 కి.మీ నుండి 2000 కి.మీ మధ్య దూరాలకు రూ. 86. అలాగే అంతకంటే ఎక్కువ దూరాలకు రూ. 93 చెల్లించాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి