Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CIBIL Score: ఈఎంఐ ఆలస్యం చేస్తున్నారా..? ఒక్క రోజు ఆలస్యమైనా సిబిల్ స్కోర్‌కు భారీ దెబ్బ

ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో అప్పు తీసుకోవడం అనేదిగా పరిపాటిగా మారింది. అయితే పెరుగుతున్న టెక్నాలజీ ప్రకారం రుణం పొందడం సులభమైంది. ముఖ్యంగా నెలవారీ సమాన వాయిదాలు (ఈఎంఐ) ద్వారా రుణాలు పొందడం అనేది ఎక్కువైంది. అయితే ఈ రుణాలు పొందడానికి సిబిల్ స్కోర్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈఎంఐ చెల్లింపులు ఆలస్యమైతే సిబిల్ స్కోర్ చాలా పెద్ద ఎఫ్టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈఎంఐ చెల్లింపులు ఆలస్యమైతే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాలో? ఓసారి తెలుసుకుందాం.

CIBIL Score: ఈఎంఐ ఆలస్యం చేస్తున్నారా..? ఒక్క రోజు ఆలస్యమైనా సిబిల్ స్కోర్‌కు భారీ దెబ్బ
Cibil Score
Follow us
Srinu

|

Updated on: Nov 15, 2024 | 3:45 PM

ఇటీవల కాలంలో ప్రజలు ఈఎంఐల ద్వారా వస్తువులను కొనుగోలు చేయడం ప్రారంభించారు. అయితే అనుకోని పరిస్థితుల్లోకొంతమంది ఈఎంఐ చెల్లింపులను మర్చిపోతూ ఉంటారు. అయితే ఆటో డెబిట్ ఆప్షన్ ఉన్నప్పటికీ బ్యాంకు ఖాతాలో తగినంత బ్యాలెన్స్ ఉండాలి. కానీ బ్యాలెన్స్ తక్కువగా ఉండటం వల్ల ఈఎంఐ కట్ చేయలేమని బ్యాంక్ నుండి మెసేజ్ వస్తే అప్పటికి కానీ చాలా మందికి గుర్తుకు రాదు. అప్పుడు ఫెనాల్టీ చెల్లించి మరీ ఈఎంఐ చెల్లించాలి. ఇలా జరిగితే క్రెడిట్ స్కోర్‌పై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి మీరు ఒక్క ఈఎంఐను కూడా మిస్ కాకూడదని నిపుణులు చెబుతున్నారు. 

ఈఎంఐ ఆలస్యమైతే బ్యాంకులు మీపై ఫెనాల్టీ విధిస్తాయి, పెనాల్టీ ఎంత అనే దానిపై ప్రతి బ్యాంకుకు దాని లెక్కలు దానికి ఉంటాయి. ఈఎంఐ ఆలస్యం అయితే 27 పాయింట్ల క్రెడిట్ స్కోర్ తగ్గుదల ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రకారం తదుపరి ఈఎంఐ సకాలంలో చెల్లించినప్పటికీ, క్రెడిట్ స్కోర్ మెరుగుపడదు. అంటే మీ క్రెడిట్ స్కోర్‌ను కోల్పోవడానికి ఎక్కువ సమయం పట్టదు. కానీ దాన్ని తిరిగి మెరుగుపర్చడానికి మాత్రం చాలా సమయం పడుతుంది. ఒక ఈఎంఐను 30 రోజులు ఆలస్యంగా చెల్లిస్తే 92 పాయింట్ల వరకు క్రెడిట్ స్కోర్ ఎఫెక్ట్ అవుతుందని వివరిస్తున్నారు. 

ఈఎంఐ మిస్ అయినప్పుడు బ్యాంకులు సాధారణంగా ఈ-మెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా మీకు హెచ్చరికలను పంపుతాయి. క్రెడిట్ స్కోర్‌పై తక్కువ ప్రభావం ఉండేలా వెంటనే ఈఎంఐను చెల్లించడానికి లింక్‌ను పంపే బ్యాంక్ నుండి మీకు చాలా సార్లు కాల్ వస్తుంది. అయితే దీనికి సంబంధించి ఒక్కో బ్యాంకుకు ఒక్కో విధమైన నిబంధనలు ఉంటాయి. అయితే మీ క్రెడిట్ స్కోర్ ఎంత త్వరగా మెరుగుపడుతుందనేది మీ డిఫాల్ట్‌లపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువ పాయింట్లు పడిపోతే మాత్రం రికవరీకి కూడా ఎక్కువ సమయం పడుతుందని గుర్తుంచుకోవాలి. డిఫాల్ట్ తర్వాత మీ ప్రవర్తనను బట్టి క్రెడిట్ స్కోర్ రికవరీ కావడానికి ఒక నెల నుండి ఒక సంవత్సరం పట్టవచ్చని నిపుణులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి