Croma Laptop Offers: క్రోమాలో ల్యాప్ టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లు.. కేవలం రూ. 50,000 లోపు ధరలో బెస్ట్ డీల్స్ ఇవే..
క్రోమాలో ల్యాప్ టాప్ లపై అదిరిపోయే ఆఫర్లున్నాయి. ఏసర్ ఆస్పైర్ 3 నుంచి లెనోవా ఐడియల్ ప్యాడ్ 1 వరకూ కొన్ని ఎంపిక చేసిన బెస్ట్ మోడళ్లపై మంచి ఆఫర్లను క్రోమా ప్రకటించింది.
మీరు ల్యాప్ టాప్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అది కూడా రూ.50,000 లోపు ధరలో బెస్ట్ ఫీచర్లు ఉన్నది అయితే బాగుండని అనుకొంటున్నారా? అయితే మీకోసమే ఈ కథనం. క్రోమాలో ల్యాప్ టాప్ లపై అదిరిపోయే ఆఫర్లున్నాయి. ఏసర్ ఆస్పైర్ 3 నుంచి లెనోవా ఐడియల్ ప్యాడ్ 1 వరకూ కొన్ని ఎంపిక చేసిన బెస్ట్ మోడళ్లపై మంచి ఆఫర్లను క్రోమా ప్రకటించింది. అంతేకాక ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఈఎంఐ చెల్లింపులపై 10 శాతం క్యాష్ బ్యాక్, అలాగే ఐసీఐసీఐ డెబిట్ కార్డు వినియోగదారులకు 10 శాతం తగ్గింపును అందిస్తోంది. ప్రతి ల్యాప్ టాప్ లో కూడా విండోస్ 11 ప్రీ ఇన్ స్టాల్డ్ ఓఎస్ ను కలిగి ఉంటుంది. ఒక్క Asus X513EA-BQ322TS మాత్రం విండోస్ 10 ఇన్ స్టాల్ అయ్యి ఉంటుంది.
ఏసర్ ఆస్పైర్ 3
రోజువారీ పనులను సులభంగా నిర్వహించగల ల్యాప్‌టాప్ కోసం Acer Aspire 3 ఒక అద్భుతమైన ఎంపిక. ఇది స్పష్టమైన విజువల్స్‌ని అందించే 15.6-అంగుళాల LED-బ్యాక్‌లిట్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ల్యాప్‌టాప్ ఇంటెల్ కోర్ i3 12వ తరం ప్రాసెసర్ ఉంటుంది. 8 జీబీ డీడీఆర్4 ర్యామ్, 512జీబీ ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది. ఇది వెబ్ బ్రౌజింగ్, డాక్యుమెంట్ ఎడిటింగ్, మల్టీమీడియా ప్లేబ్యాక్ టాస్క్‌లను సులభంగా నిర్వహించగలదు. దీనిలో ప్రీ ఇన్ స్టాల్డ్ విండోస్ 11 ఓఎస్ ఉంటుంది. దీనిలో అదనంగా ఇంటెల్ UHD గ్రాఫిక్స్ చిప్ ఉంటుంది. దీని ద్వారా ప్రాథమిక గ్రాఫిక్స్ పనులను చేసుకోవచ్చు. దీని ధర రూ. 40,990. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుపై ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే రూ. 10 శాతం అంటే రూ. 15,00 వరకూ క్యాష్ బ్యాక్ ఇస్తారు. అలాగే ఐసీఐసీఐ డెబిట్ కార్డు దారులకు 10 శాతం అంటే రూ. 1000 వరకూ తగ్గింపు ఉంటుంది.
డెల్ ఇన్‌స్పిరాన్ 3515
డెల్ ఇన్‌స్పైరాన్ 3515 ల్యాప్ టాప్ లో 15.6-అంగుళాల ఫుల్ హెచ్ డీ ఐసీఎస్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది మంచి విజువల్స్‌ను అందిస్తుంది. ల్యాప్‌టాప్‌లో ఏఎండీ రైజెన్ 5 3450U ప్రాసెసర్ అమర్చబడింది. దీనిలో 8జీబీ డీడీఆర్4 ర్యామ్, ఒక టీబీ వరకూ ఎక్సటర్నల్ స్టోరేజీ, 256జీబీ వరకూ ఇంటర్నల్ స్టోరేజీకి అవకాశం ఓఎస్ పై పనిచేస్తుంది. మంచి గేమింగ్ అనుభవం కోసం AMD Radeon గ్రాఫిక్స్‌తో వస్తుంది. దీని ధర రూ. 49,490. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుపై ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే రూ. 10 శాతం అంటే రూ. 15,00 వరకూ క్యాష్ బ్యాక్ ఇస్తారు. అలాగే ఐసీఐసీఐ డెబిట్ కార్డు దారులకు 10 శాతం అంటే రూ. 1000 వరకూ తగ్గింపు ఉంటుంది.
ఆసుస్ X513EA-BQ322TS
ఈ ల్యాప్ టాప్ 15.6-అంగుళాల ఫుల్ హెచ్ డీ ఎల్ఈడీ బ్యాక్‌లిట్ డిస్‌ప్లేతో స్పష్టమైన వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది, ఇది రోజువారీ ఉపయోగం కోసం బెస్ట్ చాయిస్. 4జీబీ ఎల్పీ డీడీఆర్4 ర్యామ్ , 512జీబీ స్టోరేజీ సామర్థ్యంతో వస్తోంది. ఈ ల్యాప్‌టాప్ మల్టీ టాస్కింగ్, అవసరమైన ఫైల్‌లను నిల్వ చేయడానికి సరైనది. దీనిలో ఇంటెల్ కోర్ i3 11వ తరం ప్రాసెసర్ ని కలిగి ఉంది. దీనిలో విండోస్ 10 ఓఎస్ ఉంటుంది. ఇంటెల్ UHD గ్రాఫిక్‌లను కూడా కలిగి ఉందిదీని ధర రూ. 44,990.ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుపై ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే రూ. 10 శాతం అంటే రూ. 15,00 వరకూ క్యాష్ బ్యాక్ ఇస్తారు. అలాగే ఐసీఐసీఐ డెబిట్ కార్డు దారులకు 10 శాతం అంటే రూ. 1000 వరకూ తగ్గింపు ఉంటుంది.
లెనోవో ఐడియాప్యాడ్ 1
మంచి పనితీరుతో కూడిన బడ్జెట్ ల్యాప్‌టాప్ ఇది. స్పష్టమైన విజువల్స్‌ను అందించే 15.6-అంగుళాల ఫుల్ హెచ్ డీ యాంటీ-గ్లేర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 8జీబీ డీడీఆర్ 4 ర్యామ్, 512జీబీ స్టోరేజ్ సామర్థ్యం ఉంటుంది. ఏఎండీ Ryzen 5 3500U ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తోంది. దీనిలో విండోస్ 11 ఓఎస్ ఉంటుంది. ఏఎండీ Radeon Vega 8 గ్రాఫిక్స్ కార్డ్‌ని కూడా కలిగి ఉంది. దీనిని కేవలం రూ. 47,990కే పొందవచ్చు. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుపై ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే రూ. 10 శాతం అంటే రూ. 15,00 వరకూ క్యాష్ బ్యాక్ ఇస్తారు. అలాగే ఐసీఐసీఐ డెబిట్ కార్డు దారులకు 10 శాతం అంటే రూ. 1000 వరకూ తగ్గింపు ఉంటుంది.
ఆసుస్ వివోబుక్ 14
ఇది ఒక సమర్థవంతమైన ల్యాప్‌టాప్. దీనిలో 14-అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్‌ప్లే ఉంది. ఇంటెల్ కోర్ i3 11వ తరం ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. 8జీబీ డీడీఆర్4 ర్యామ్ 512 జీబీ స్టోరేజీ సామర్థ్యంతో పనిచేస్తుంది. మల్టీ టాస్కింగ్, ముఖ్యమైన ఫైల్‌లను నిల్వ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. దీనిలో విండోస్ 11 ప్రీ ఇన్ స్టాల్ చేయబడింది. దీని ధర రూ. 39,990. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుపై ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే రూ. 10 శాతం అంటే రూ. 15,00 వరకూ క్యాష్ బ్యాక్ ఇస్తారు. అలాగే ఐసీఐసీఐ డెబిట్ కార్డు దారులకు 10 శాతం అంటే రూ. 1000 వరకూ తగ్గింపు ఉంటుంది.
హెచ్‌పీ 15s-fq2717TU
వ్యక్తిగత, వృత్తిపరమైన వినియోగానికి అనువైన ల్యాప్‌టాప్ ఇది.15.6-అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే ఉంటుంది. 8జీబీ డీడీఆర్4 ర్యామ్ 512జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. ఇది ఇంటెల్ కోర్ i3 11వ తరం ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. విండోస్ 11 ప్రీ ఇన్ స్టాల్ చేసి ఉంటుంది. క్రోమాలో దీని ధర రూ. 41,990 గా ఉంది. దీనిని హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డుపై కొనుగోలు చేస్తే రూ. 4000 తక్షణ తగ్గింపు పొందవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..