Buy Now Pay Later: ఇప్పుడు కొనండి తర్వాత చెల్లించండి Vs క్రెడిట్ కార్డ్.. ఇందులో ఏది బెటర్ ఆప్షనో తెలుసా..
పండగల సీజన్ మొదలైంది.. వరుస పండగలు వస్తుండటంతో కొనుగోలు చేయడం మొదలు పెట్టారు. ఇ-కామర్స్ సైట్స్ ఇప్పటికే డిస్కౌంట్ సేల్స్‌ను మొదలు పెట్టాయి. ఏది కొన్న 80 శాతం వరకు తగ్గింపు అంటూ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ సమయంలో మనం కూడా..
పండగల సీజన్ వచ్చిందంటే కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ఫ్యాన్సీ ఆఫర్లు సిద్ధమయ్యాయి. ఇప్పటికే, ఇ-కామర్స్ దిగ్గజాలు భారీ తగ్గింపులను ప్రకటించాయి. మరోవైపు కొనుగోలుదారులూ వీటిని నిశితంగా గమనిస్తున్నారు. గత రెండేళ్లుగా కాకుండా ఈసారి పండుగల షాపింగ్ అధికంగా ఉంటాయని అంచనాలున్నాయి. అమ్మకాలు కూడా కొత్త గరిష్టాన్ని తాకుతుందని కంపెనీలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులకు క్రెడిట్ కార్డ్‌లు, బై నౌ పే లేటర్ (పీఎన్పీఎల్) అనే రెండు ఎంపికలు ఉన్నాయి. ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో ఓసారి చూద్దాం..
ఇ-కామర్స్ సైట్స్ ప్రకటించే ఆఫర్లలో షాపింగ్ చేయాలని ఉంటుంది.. కానీ వారికి క్రెడిట్ స్కోర్ సరిగా ఉండదు. ఆ సమయంలో కొత్త రుణగ్రహీతలకు క్రెడిట్ కార్డ్‌లు నిరాకరిస్తాయి. సహజంగానే ఇలాంటివారి టార్గెట్ చేస్తూ ఫిన్‌టెక్ కంపెనీలు ఎంట్రీ ఇచ్చాయి. ఫిన్‌టెక్ సంస్థలు బీఎన్‌పీఎల్ సేవలను తీసుకొచ్చాయి. నగదు లేకుండా తక్షణమే ఏదైనా కొనుగోలు చేసి.. వాయిదాలలో చెల్లించడం అనేదే సంక్షిప్తంగా బీఎన్‌పీఎల్ అంటారు.
లోన్ మొత్తం యాప్‌లో ముందే ఫిక్స్ చేయబడుతుంది. ఆ తర్వాత, మీ రుణ పరిమితిలో మీరు ఏదైనా కొనుగోలు చేయవచ్చు. అయితే తీసుకున్న మొత్తాన్ని 15-45 రోజుల వ్యవధిలో బిల్లును సెటిల్ చేయాల్సి ఉంటుంది. చెల్లింపులో ఒకరోజు ఆలస్యమైనా జరిమానా విధించవచ్చు. అన్నింటికంటే ఇది మీ క్రెడిట్ స్కోర్‌ను కూడా ప్రభావితం చేస్తుంది.
మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న ఉద్యోగులకు బ్యాంకులు సాధారణంగా క్రెడిట్ కార్డులను జారీ చేస్తాయి. రుణగ్రహీత మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి 45-50 రోజుల సమయం ఉంటుంది. ఏదైనా ఆలస్యం జరిగితే.. సంవత్సరానికి గరిష్టంగా 45 శాతం వడ్డీ విధించబడుతుంది.
మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా..బీఎన్‌పీఎల్‌ని అందించే కంపెనీలు రుణగ్రహీత క్రెడిట్ స్కోర్‌ను అస్సలు పట్టించుకోవు. అయితే చెల్లింపులు ఆలస్యం చేస్తే మాత్రం ఈ కంపెనీలు క్రెడిట్ స్కోరును పూర్తిస్తాయిలో దెబ్బతీస్తాయి. దానిని పునరుద్ధరించడం చాలా కష్టం.
క్రెడిట్ కార్డ్‌లకు కనీస చెల్లింపు ఎంపిక ఉంటుంది. సకాలంలో జమ చేయనందుకు బ్యాంకులు ఆలస్య రుసుమును వసూలు చేస్తాయి. పెద్ద మొత్తంలోని బిల్లులను ఈఎంఐలుగా మార్చుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తాయి బ్యాంకులు. అయితే, బీఎన్‌పీఎల్ వంటి కంపెనీలు ఎంపికను క్లెయిమ్ చేసుకునేందుకు అవకాశం ఇవ్వవు.
ఈ రెండింటిలో దేనినైనా ఎంచుకోవడానికి ముందు మీ ఆర్థిక పరిస్థితిని చూసుకోవడం మంచిది. ఖరీదైన వస్తువులను క్రెడిట్ కార్డు కిందకు తెచ్చి వాయిదాల పద్ధతిలో చెల్లించవచ్చు. బీఎన్‌పీఎల్‌లో అలాంటి వెసులుబాటు అస్సలు ఉండదు. అయితే మీరు ఇప్పుడు ఏదైనా కొనుగోలు చేసి, తక్కువ సమయంలో చెల్లించాలని చూస్తున్నట్లయితే ఇప్పుడు కొనుగోలు చేయండి తర్వాత చెల్లించండి అనేది మీ ఉత్తమ ఎంపిక అవుతుంది.
ఫిన్‌టెక్ సంస్థలు ఏం చేస్తాయి..
మీ వ్యక్తిగత క్రెడిట్ స్కోరుతో సంబంధం లేకుండానే అప్పు అందించే సంస్థలనే ఫిన్‌టెక్ సంస్థలు అని పిలుస్తారు. వీటి లక్ష్యం కూడా కొంత డిఫ్రెంట్‌గా ఉంటుంది. ఇందులో పీ2పీ రుణ సంస్థలు కొత్త రుణగ్రహీతలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అంటే పర్సన్ టు పర్సన్ అని.. ఇలా వీరు కొత్తగా ఉద్యోగంలో చేరిన వారిని టార్గెట్‌గా బిజినెస్ ప్లాన్ చేస్తుంటారు. ఎందుకంటే కొత్తగా ఉద్యోగంలో చేరినవారికి క్రెడిట్ కార్డులు ఉండవు.. కొంత కాలం ఉద్యోగం చేసిన తర్వాతనే బ్యాంకులు క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తుంటాయి. ఇలాంటి ఫిన్‌టెక్ సంస్థలు ఇచ్చే మొత్తాలు.. రూ.5 వేల నుంచీ రుణం నుంచి మొదలు.. గరిష్ఠంగా రూ.40-50వేల వరకు ఇస్తుంటాయి. వీటి వాయిదాల్లో సులభంగా చెల్లించేందుకు వీలు కల్పిస్తుండటంతో మార్కెట్‌లోని ఫిన్‌టెక్ సంస్థలు పెద్ద ఎత్తున రుణాలను అందిస్తు.. దాదాపు 4 రెట్లకు పైగా వృద్ధి సాధించినట్లు గత ఏడాది వార్షిక లెక్కలు చెబుతున్నాయి.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం