Sova Malware: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. మీ స్మార్ట్ ఫోన్‌లకు ‘సోవా’ ముప్పు పొంచి ఉంది జాగ్రత్త..
Sova Malware: ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో సమూల మార్పులు వచ్చాయి. అన్ని రంగాల్లో విస్తరిస్తోన్న టెక్నాలజీ బ్యాంకింగ్ రంగంలోకి కూడా కీలకపాత్ర పోషిస్తోంది. స్మార్ట్ ఫోన్ ద్వారా లావాదేవీలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఫోన్‌లో ఉండే యాప్స్‌తోనే ఒకరి నుంచి...
Sova Malware: ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో సమూల మార్పులు వచ్చాయి. అన్ని రంగాల్లో విస్తరిస్తోన్న టెక్నాలజీ బ్యాంకింగ్ రంగంలోకి కూడా కీలకపాత్ర పోషిస్తోంది. స్మార్ట్ ఫోన్ ద్వారా లావాదేవీలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఫోన్‌లో ఉండే యాప్స్‌తోనే ఒకరి నుంచి మరొకరు డబ్బులు పంపించుకుంటున్నారు. అయితే టెక్నాలజీ యూజర్లకు ఎంతలా మేలు చేస్తోందో అదే స్థాయిలో ప్రమాదాన్ని కూడా తీసుకొస్తోంది. ఆన్‌లైన్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లలోకి మాల్వేర్‌లను ప్రవేశపెడుతూ ఫోన్‌ను హ్యాక్ చేస్తున్నారు. దీంతో ఖాతాల్లోని డబ్బును కొట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో మాల్వేర్ భారతీయ ఖాతాదారులకు సవాల్ విసురుతోంది. సోవా పేరుతో స్మార్ట్ ఫోన్‌లకు టార్గెట్ చేస్తున్నారు కేటాగాళ్లు.
ఈ మాల్వేర్ ఆండ్రాయిడ్ డివైజ్‌లను టార్గెట్ చేస్తోందని ఎస్‌బీఐ తమ వినియోగదారులను ఇప్పటికే అలర్ట్ చేసింది. జాగ్రత్తలు తీసుకోండి అంటూ ట్వీట్ చేసింది. ఇక సోవా ఆండ్రాయిడ్ మాల్‌వేర్ వైరస్ మొబైల్స్‌పై దాడి చేస్తుందని జాతీయ సైబర్ భద్రతా కేంద్రం సెర్ట్-ఇన్ హెచ్చరించింది. కీలాగింగ్, కుకీల అపహరణ వంటి ప్రక్రియల ద్వారా సోవా వైరస్ యూజర్ నేమ్‌లను, పాస్‌వర్డ్‌లను దొంగిలిస్తుందని భద్రతా కేంద్రం తెలిపింది. మొదట్లో కేవలం అమెరికా, రష్యా, స్పెయిన్ వంటి దేశాలను టార్గెట్ చేసుకున్న ఈ మాల్‌వేర్ ఇప్పుడు భారత్‌లో పంజావిసురుతోంది. ఈ మాల్‌వేర్ ఒక్కసారి ఇన్‌స్టాల్ అయితే తొలగించడం అంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు.
Don’t let malware steal your valuable assets. Always download the trusted apps from reliable sources only. Stay Alert and #SafeWithSBI#SBI #AmritMahotsav #CyberSafety #CyberSecurity #StayVigilant #StaySafe pic.twitter.com/NwAfUle36V
— State Bank of India (@TheOfficialSBI) September 22, 2022
అసలేంటీ సోవా మాల్‌వేర్..
సింపుల్‌గా చెప్పాలంటే సోవా అనేది ఒక వైరస్. ఇది బ్యాంక్ యాప్‌లను లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ మాల్‌వేర్ ఒక్కసారి ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయితే తొలగించడం చాలా కష్టం. ఈ వైరస్ మీ ఫోన్‌కు వచ్చే ఓటీపీ, ఈమెయిల్స్‌ను ట్రాక్ చేస్తుంది. దీంతో అనధికార ట్రాన్సక్షన్స్ జరిగే ప్రమాదం ఉంటుంది. ఉన్నట్లుండి మీ ఖాతాలో ఉన్న డబ్బులు మీ ప్రమేయం లేకుండానే కోల్పోయే అవకాశం ఉంటుంది.
ఎలా తప్పించుకోవాలి..?
ఈ మాల్‌వేర్ బారిన పడకూడదంటే యాప్‌లను అధికారిక యాప్‌స్టోర్ నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలని కేంద్ర ఏజెన్సీ యూజర్లకు తెలిపింది. కొత్తగా ఏదైనా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే సమయంలో సదరు యాప్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఆ యాప్‌ను ఎంతమంది డౌన్‌లోడ్ చేశారు, దానిపై ఎలాంటి రివ్యూలు ఉన్నాయి లాంటి వివరాలను గమనించాలి. మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో లేటెస్ట్ సెక్యూరిటీ అప్‌డేట్ అయ్యిందో లేదో చెక్ చేసుకొని, అప్‌డేట్ లేకపోతే వెంటనే అప్‌డేట్ చేసుకోవాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..