AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tata Motors: మార్కెట్లోకి టాటా మోటార్స్‌ నుంచి 3 కొత్త వాహనాలు.. వ్యాపారులకు ఊతమిచ్చేలా..

Tata Motors: కొత్తగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలనుకుంటున్న ఔత్సాహికుల కోసం టాటా మోటార్స్‌ మార్కెట్లోకి కొత్తగా 3 వాణిజ్య పికల్‌ ట్రక్కులను ప్రారంభించింది. దేశంలోనే అతిపెద్ద వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్‌...

Tata Motors: మార్కెట్లోకి టాటా మోటార్స్‌ నుంచి 3 కొత్త వాహనాలు.. వ్యాపారులకు ఊతమిచ్చేలా..
Tata Motors
Narender Vaitla
|

Updated on: Sep 28, 2022 | 2:30 PM

Share

Tata Motors: కొత్తగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలనుకుంటున్న ఔత్సాహికుల కోసం టాటా మోటార్స్‌ మార్కెట్లోకి కొత్తగా 3 వాణిజ్య పికల్‌ ట్రక్కులను ప్రారంభించింది. దేశంలోనే అతిపెద్ద వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్‌.. యోధా 2.0, ఇంట్రా వీ20 బై-ఫ్యూయల్‌, ఇంట్రా వీ50 పేరుతో మూడు వాహనాలను తీసుకొచ్చారు. పికప్‌ సెగ్మెంట్‌లో తీసుకొచ్చిన ఈ వాహనాలు అత్యధిక లోడ్‌ను మోసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయనటి టాటా మోటార్స్‌ తెలిపింది. అంతేకాకుండా సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు వీలుగా ఈ వాహనాల్లో ఆధునిక ఫీచర్లను అందించారు. సరికొత్త టెక్నాలజీతో రూపొందించిన ఈ ట్రక్కులు నగరాలు, గ్రామాల్లో అవసరాలను తీర్చగలవని టాటా చెబుతోంది. ఈ కొత్త వాహనాలను లాంచ్‌ చేసిన సమయంలోనే దేశంలోని 750 మంది కస్టమర్లకు డెలివరీ చేసింది. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి, నలుగురుకి ఉపాధి కల్పించాలనే ఆలోచనలు ఉన్నవారికి ఈ వాహనాలు దోహదపడతాయని టామా మోటార్స్‌ చెబుతోంది.

చిరు వ్యాపారుల కలలను నేరవర్చేందుకే…

కొత్త వాహనాలను లాంచ్‌ చేసిన తర్వాత టాటా మోటార్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరకెక్టర్‌ గిరీష్‌ వాఘ్‌ మాట్లాడుతూ.. ‘మేము ఇప్పటి వరకు తీసుకొచ్చిన చిన్న కమర్షియల్‌ వెహికిల్స్‌ ఎంతో మంది వ్యాపారాల వృద్ధికి దోహదపడింది. చిన్నగా వ్యాపారాలు ప్రారంభించి, తమ వ్యాపార విస్తృతిని పెంచుకోవాలనే ఉద్దేశంతో ఉన్న వారికి టాటా కొత్త వాహనాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ కొత్త వాహనాలు ఎక్కువ లోడ్‌ను మోసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. దీనిద్వారా వ్యాపారులు సులభంగా ఎక్కువ వస్తువులను తీసుకెళ్లగలరు. పొడవైన డెక్‌, లాంగ్‌ రేంజ్‌, పటిష్టమైన పనితీరు, భద్రత, సౌకర్యం కోసం ఎన్నో ఫీచర్లను అందించాము. ఈ వాహనాలు మా వినియోగదారుల అభివద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయనే వాగ్దావాన్ని నేరవేరుస్తుంది’ అని చెప్పుకొచ్చారు.

ప్రత్యేక ఏంటంటే..

టాటా యోధా సుమారు 2000 కిలోల బరువును మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 2.2 లీటర్‌ డీజిల్‌ ఇంజన్‌తో ఈ వాహనాలు క్లిష్టమైన భూభాగాల్లోనూ సాఫీగా ప్రయణించేలా రూపొందించారు. యోధా 1200, 1500, 1700 కిలోల సామర్థ్యంతో కూడా అందుబాటులో ఉంది. ఈ పికప్ వ్యవసాయ రంగం, పౌల్ట్రీ, ఇ-కామర్స్ రంగాల అవసరాలను తీర్చడానికి రూపొందించామని టాటా మోటార్స్‌ తెలిపింది. అలాగే ఇంట్రా వీ20 దేశంలోనే మొదటి పికప్‌.. ఇది డ్యూయల్ ఇంజన్‌ అంటే.. సీఎన్‌జీ, పెట్రోల్‌తో నడుస్తుంది. ఇది గరిష్టంగా 1000 కిలోల ట్రైనింగ్ సామర్థ్యంతో 700 కి.మీ. మరోవైపు, ఇంట్రా V 50 గరిష్టంగా 1500 కిలోల ఎత్తే సామర్థ్యాన్ని కలిగి ఉంది. 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌తో పవర్ జనరేట్‌ అవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..