
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు క్రెడిట్ కార్డులను వాడుతున్నారు. గతంలో బ్యాంకులు ఎన్నో ప్రాసెస్‌ల తర్వాత క్రెడిట్ కార్డు అందించేవి. కానీ ఇప్పుడు మరింత సులభతరం అయిపోయింది. కేవలం తక్కువ ప్రాసెస్‌తోనే అది కూడా ఫోన్ ద్వారానే వివరాలు అందుకుని కార్డులను జారీ చేస్తున్నాయి. అయితే క్రెడిట్ కార్డుల వాడకంలో కూడా అవగాహన ఉండాలి. లేకుండా మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. దీని కారణంగా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అయితే క్రెడిట్ కార్డు వాడేవారు చెల్లింపుల విషయంలో కొన్ని పొరపాట్ల కారణంగా మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుందని గుర్తించుకోండి. మరి ఈ పొరపాటు ఏంటి? క్రెడిట్ స్కోర్‌ను పెంచుకునేందుకు ఎలాంటి ట్రిక్స్ వాడలో తెలుసుకుందాం..
చాలా మంది క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులో పూర్తి బిల్లు చెల్లించకుండా మినిమమ్ బిల్లు చెల్లించడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొవచ్చు. పెనాల్టీ ఛార్జీలను నివారించడానికి చాలా మంది మినిమమ్ డ్యూ చెల్లింపులు చేస్తారు. కానీ ఈ కనీస చెల్లింపు మాత్రమే స్వల్పకాలిక పరిష్కారంగా అనిపించవచ్చు. అయితే భారతదేశంలో క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ఇది తీవ్రమైన నష్టాలను కలిగిస్తుంది.
ఈ సాధారణ ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు కనీస చెల్లింపు ఇబ్బందుల్లో నెట్టేయవచ్చు. ఇది క్రెడిట్ కార్డ్ వినియోగదారులను అప్పుల ఊబిలోకి నెట్టివేస్తుంది. దీని వలన ఆర్థిక విశ్వసనీయత కోల్పోవడం, మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. దీని వల్ల క్రెడిట్ స్కోర్ గణనీయంగా తగ్గుతుంది.
మీ క్రెడిట్ కార్డ్‌లోని మొత్తం బకాయిలో 5% కనీస చెల్లింపు సాధారణంగా ప్రాసెసింగ్ ఫీజులు, వడ్డీతో కలిపి ఉంటుంది. ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డ్ బిల్లు రూ.1,00,000 అయితే, కనీస చెల్లింపు రూ.5,000 కావచ్చు. ఈ చెల్లింపు మీ ఖాతాను మంచి స్థితిలో ఉంచినప్పటికీ, ఇది చెల్లించాల్సిన అసలు మొత్తాన్ని తగ్గించడానికి లేదా మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తిని మెరుగుపరచడానికి పెద్దగా సహాయపడదని గుర్తించుకోండి. మిగిలిన బ్యాలెన్స్ వడ్డీని పెంచుతూనే ఉంటుంది. తరచుగా ఏటా 40% నుండి 42% వరకు ఉంటుంది. ఇది కాలక్రమేణా రుణాన్ని పెంచుతుంది. మీ చెల్లింపుల స్థితిని తనిఖీ చేసి క్లియర్ చేయకపోతే ఈ పెరుగుతున్న వడ్డీ అదుపు తప్పి క్రెడిట్ కార్డ్ వినియోగదారులను అంతులేని అప్పుల ఊబిలోకి నెట్టవచ్చు. దీర్ఘకాలికంగా ఇది క్రెడిట్ ప్రొఫైల్‌ను తీవ్రంగా దెబ్బతీస్తుంది.
కనీస మొత్తాన్ని మాత్రమే చెల్లించడంపై దృష్టి పెట్టడం వల్ల అప్పుల ఊబిలోకి కూరుకుపోవచ్చు. మీరు ఒక చెల్లింపును కోల్పోయినా లేదా తదుపరి వాయిదాలలో కనీస మొత్తాన్ని చెల్లించలేకపోయినా పరిస్థితి అదుపు తప్పవచ్చు. ఇటువంటి పరిణామాలు మీ క్రెడిట్ హెల్త్‌కు మంచిది కాదు. ఇలాంటి తప్పుల వల్లే మీరు అప్పుల్లో కూరుపోయే ప్రమాదం ఉంది.
☛ ప్రతి నెలా కనీస చెల్లింపు కంటే ఎక్కువ చెల్లించడంపై దృష్టి పెట్టండి.
☛ అనవసర ఖర్చులను నివారించండి. అలాగే మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని కాపాడుకోవడంపై దృష్టి పెట్టండి.
☛ ఎట్టి పరిస్థితుల్లోనూ మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తిని 30% కంటే తక్కువగా ఉంచండి.
☛ ముందుగా అధిక వడ్డీ ఉన్న అప్పులను తీర్చడానికి ప్రాధాన్యత ఇవ్వండి.
☛ రుణ నిర్వహణ, ప్రాథమిక అంశాలను చర్చించడానికి నిపుణులను సంప్రదించండి.
☛ అందుకే కనీస చెల్లింపులు, సులభమైన క్రెడిట్ కార్డ్ వాడకంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇది అప్పులు పెరగడం వల్ల కలిగే తీవ్రమైన పరిణామాలతో కూడి ఉంటుంది. అందువల్ల క్రెడిట్ కార్డ్ అప్పులు పెరగడం వల్ల కలిగే నష్టాలను అర్థం చేసుకోవడం, బాధ్యతాయుతమైన, బాగా ప్రణాళికాబద్ధమైన తిరిగి చెల్లించే అలవాట్లను అవలంబించడం మీ ఆర్థిక భద్రతకు సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి: Post Office Scheme: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్.. నెలకు 11 వేల డిపాజిట్‌తో చేతికి 90 లక్షలు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి