Inflation: దేశంలో పెరిగిన ద్రవ్యోల్బణం.. నవంబర్‎లో 4.91 శాతంగా నమోదు..

దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతోంది. నవంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) 4.91 శాతానికి పెరిగింది...

Inflation: దేశంలో పెరిగిన ద్రవ్యోల్బణం.. నవంబర్‎లో 4.91 శాతంగా నమోదు..
Inflation
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Dec 14, 2021 | 7:02 AM

దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతోంది. నవంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) 4.91 శాతానికి పెరిగింది. అంతకుముందు అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.35 శాతంగా ఉంది. ఆహార వస్తువుల రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్‌లో 1.87 శాతానికి పెరిగింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ద్రవ్య విధానాన్ని నిర్ణయించేటప్పుడు, ప్రధానంగా CPI ఆధారిత ద్రవ్యోల్బణాన్ని పరిశీలిస్తుంది. రెండు వైపులా 2 శాతం టాలరెన్స్ బ్యాండ్‌తో 4 శాతంగా ఉంచాలని ప్రభుత్వం ఆర్‌బీఐని కోరింది. ఈ ఏడాది మిగిలిన కాలంలో ద్రవ్యోల్బణం ఎక్కువగానే ఉంటుందని ఆర్‌బిఐ అంచనా వేస్తోంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయికి చేరుతుందని, ఆ తర్వాత క్షీణత చూపడం ప్రారంభిస్తుందని ఆర్‌బీఐ పేర్కొంది. ద్రవ్యోల్బణం పెరగడానికి ప్రధాన కారణం ఆహార పదార్థాల ధరలు పెరగడమేనని ప్రభుత్వ గణాంకాలు సోమవారం వెల్లడించాయి. అక్టోబర్ 2021లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.48 శాతంగా ఉంది. అదే సమయంలో, రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్ 2020లో 6.93 శాతంగా ఉంది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఓ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత నెలలో 0.85 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం ఇప్పుడు 1.87 శాతానికి చేరుకుంది.

CPI ఆధారిత ద్రవ్యోల్బణం అంటే ఏమిటి?

కుటుంబాలు తమ రోజువారీ ఉపయోగం కోసం కొనుగోలు చేసే వస్తువులు, సేవల రిటైల్ ధరలలో మార్పును CPI అంటారు. ఆర్థిక వ్యవస్థలో ధరలను నిలకడగా ఉంచేందుకు ఆర్‌బీఐ ఈ గణాంకాలపై నిఘా ఉంచింది. కాల వ్యవధిలో ధరల సూచికలో మార్పును CPI ఆధారిత ద్రవ్యోల్బణం లేదా రిటైల్ ద్రవ్యోల్బణం అంటారు.

Read Also.. Post Office: మూడేళ్ల కనిష్టానికి పడిపోయిన పోస్టాఫీసు డిపాజిట్లు, ఇతర చిన్న పొదుపు ఖాతాలు: కేంద్రం వెల్లడి