AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Mines: ఆ దేశంలో రూ.60 లక్షల కోట్ల విలువైన బంగారు నిధి! భారత్‌కు జాక్‌పాట్!

ప్రపంచవ్యాప్తంగా బంగారం అనేది సంపదకు, భద్రతకు చిహ్నంగా ఉంది. ముఖ్యంగా భారత్ వంటి దేశాలలో బంగారాన్ని -సాంస్కృతిక జీవితంలో భాగంగా చూస్తారు. అయితే ప్రపంచవ్యాప్తంగా బంగారు నిల్వలు ఉన్న దేశాల్లో మనం కాస్త వెనుకబడి ఉన్నాం. కానీ, మనకు మిత్ర దేశాల్లోని కొన్ని చోట్ల అతిపెద్ద బంగారు నిల్వలు బయటపడ్డాయి. దీని గురించి మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

Gold Mines: ఆ దేశంలో రూ.60 లక్షల కోట్ల విలువైన బంగారు నిధి! భారత్‌కు జాక్‌పాట్!
Gold Mines
Nikhil
|

Updated on: Oct 25, 2025 | 2:58 PM

Share

ప్రపంచవ్యాప్తంగా ఈ భూమి మీద ఇప్పటివరకు దాదాపు 2,44,000 మెట్రిక్ టన్నుల బంగారం కనుగొనబడింది. అయితే ఇందులో 1,87,000 మెట్రిక్ టన్నుల బంగారం మాత్రమే తవ్వి తీయబడింది. మిగిలిన 57,000 మెట్రిక్ టన్నుల బంగారం ఇప్పటికీ భూగర్భంలో అలాగే ఉంది. ఈ నిధిలో ఎక్కువ భాగం ఆస్ట్రేలియా, రష్యా, ఇండోనేషియా వంటి దేశాలలో ఉన్నాయి. ఇప్పుడు ఈ నిధులు వెలికి తీయడం ద్వారా ఆయా దేశాలతో పాటు వల్ల ఇండియాకు కూడా మేలు చేకూరే అవకాశం ఉంది.  అదెలాగంటే..

టాప్‌ 3 దేశాలు

ఇప్పటివరకూ వెలికి తీయని బంగారు నిల్వలు కలిగిన దేశాల్లో ఆస్ట్రేలియా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా భూగర్భంలో  దాదాపు 12,000 మెట్రిక్ టన్నుల బంగారు నిల్వలు ఉన్నట్టు అంచనా. దీని విలువ దాదాపు 720 బిలియన్ అమెరికన్ డాలర్లు. అంటే సుమారు రూ. 60 లక్షల కోట్లు. ఇక రెండవ స్థానంలో రష్యా ఉంది. ఆ దేశంలో కూడా భూగర్భంలో దాదాపు 12 వేల మెట్రిక్ టన్నుల బంగారం ఉందని అంచనా. ఇక మూడవ స్థానంలో ఇండోనేషియా ఉంది. ఇక్కడ 3,600 మెట్రిక్ టన్నుల బంగారు నిల్వలు ఉన్నట్టు అంచనా.

భారత్‌కు జాక్‌పాట్

వెలికి తీయని బంగారు నిల్వలు ఉన్న ఈ మూడు దేశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరంగా కీలకం కానున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఈ దేశాల ఆధిపత్యం మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఈ మూడు దేశాలు భారత్ కు మిత్ర దేశాలే అవ్వడంతో ఇది మనకు జాక్ పాట్ లాంటిది అంటున్నారు నిపుణులు. తక్కువ ధరకి లేదా తక్కువ ట్యాక్స్ ధరలతో ఆయా దేశాల నుంచి బంగారం దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు కొంత లాభం చేకూరుస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?