AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Millionaire Money Secrets : మిలియనీర్స్ పాటించే మనీ ఫార్ములా ఇదే..

ప్రపంచంలో ఉన్న మిలియనీర్స్ లో చాలామంది పుట్టుకతో కోటీశ్వరులు కారు. జీరోతో మొదలై చిన్న ఉద్యోగంతోనో, బిజినెస్‌తోనో మెల్లగా ఎదిగిన వాళ్లే. వాళ్లంతా మిలియనీర్స్ అవ్వడానికి వాళ్లు పాటించిన సేవింగ్ ఫార్ములాలే కారణం. అసలు సేవింగ్స్ అంటే ఎలా ఉండాలి? మిలియనీర్స్ పాటించే డబ్బు సూత్రాలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం.

Millionaire Money Secrets : మిలియనీర్స్ పాటించే మనీ ఫార్ములా ఇదే..
Millionaire's Habits
Nikhil
|

Updated on: Sep 21, 2025 | 3:49 PM

Share

ప్రపంచంలో ఉన్న మిలియనీర్స్ లో చాలామంది పుట్టుకతో కోటీశ్వరులు కారు. జీరోతో మొదలై చిన్న ఉద్యోగంతోనో, బిజినెస్‌తోనో మెల్లగా ఎదిగిన వాళ్లే. వాళ్లంతా మిలియనీర్స్ అవ్వడానికి వాళ్లు పాటించిన సేవింగ్ ఫార్ములాలే కారణం. అసలు సేవింగ్స్ అంటే ఎలా ఉండాలి? మిలియనీర్స్ పాటించే డబ్బు సూత్రాలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే.. ప్రపంచంలో ఉన్న మిలియనీర్స్‌ అందరికీ ఒకేరకమైన సేవింగ్ ప్లాన్స్ ఉన్నట్టు స్టడీల్లో తేలింది. సొంతగా ఎదిగిన మిలియనీర్స్ అందరూ వయసు యాభై దాటిన తర్వాతే మిలియనీర్స్ అయ్యారట. ఈ యాభై ఏళ్లు ఎంతో ప్లానింగ్‌తో సేవింగ్స్ చేశారు. అదెలాగంటే..

గోల్డెన్ రూల్

మిలియనీర్స్ అందరూ పాటించిన ఒక గోల్డెన్ రూల్ ఏంటంటే.. వారి ఆదాయంలో 20 నుంచి 30 శాతం సేవ్ చేయడం. కానీ, ఈ రోజుల్లో సగటు ఉద్యోగి తన ఆదాయంలో కేవలం 8 శాతమే ఆదా చేస్తున్నాడు. ఇదే మిలియనీర్స్ కు మనకు ఉన్న తేడా. సరైన సేవింగ్ ప్లాన్ ఉంటే చాలు మెల్లగా కోటీశ్వరులుగా మారొచ్చు. ఆ సేవింగ్ ప్లాన్ కూడా ఒక స్ట్రక్చర్ లో ఉండాలి. గుడ్డిగా దాచుకోకుండా.. రిటైర్‌‌మెంట్ కోసం కొంత, ఎమర్జెన్సీ కోసం కొంత ఇలా.. మీ అవసరాలను బట్టి సేవింగ్స్ ఉండాలి.

టైం ఈజ్ మనీ

మిలియనీర్స్ ఫాలో అయ్యే మరో సూత్రం టైం ఈజ్ మనీ. అంటే డబ్బు ఆదా చేసే విషయంలో లేట్ చేయకూడదు. వెంటనే మొదలు పెట్టాలి. దాన్ని ఒక క్రమం తప్పని అలవాటుగా మార్చుకోవాలి. తక్కువ వయసులో ఉన్నప్పుడే మిలియనీర్ అవ్వాలంటే తక్కువ వయసు నుంచే సేవింగ్ చేయడం మొదలుపెట్టాలి.

ఇన్వెస్ట్‌మెంట్స్

మిలియనీర్స్ అవ్వాలంటే సేవింగ్స్ తో పాటు ఇన్వెస్ట్ మెంట్స్ కూడా చేయాలి. కొద్దిమొత్తంలో అయినా మ్యూచువల్‌ ఫండ్స్‌, రికరింగ్‌ డిపాజిట్స్ వంటి వాటిలో డబ్బు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే కొన్నేళ్లకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. వీటి విషయంలో తొందర పడకూడదు. సుమారు పదేళ్ల పాటు ఇలాంటి ఇన్వెస్ట్ మెంట్స్ చేస్తూ పోవాలి. అప్పుడే పెద్దమొత్తంలో ఆదాయం వస్తుంది.

టెంప్ట్ అవ్వరు

మిలియనీర్స్ గా ఎదగాలంటే టెంప్టింగ్ అలవాటుని మానుకోవాలి. స్లో అండ్ స్టడీ విధానాన్ని ఫాలో అవ్వాలి. సొంతంగా ఎదిగిన మిలియనీర్స్ ఎవరూ టెంప్ట్ అయ్యే మైండ్ ఉన్నవాళ్లు కాదు. అంటే అవసరం లేకపోయినా పెద్ద పెద్ద కార్లు కొనడం, అవసరం లేని విలాసాలకు పోవడం వంటివి చేయరు. ఉన్నంతలో సింపుల్ గా ఉండడానికి ప్రయత్నిస్తారు.

అప్పులు చేయరు

అప్పులు చేసేవాళ్లు ఎప్పటికీ ఆస్తిపరులు కాలేరు. అందుకే మిలియనీర్స్ అవ్వాలంటే అప్పులు చేసే అలవాటుని మానుకోవాలి. అప్పులు చేయడం, బెట్టింగ్స్ వంటి మార్గాల ద్వారా సంపాదించాలని చూడడం.. ఇలాంటి అలవాట్ల వల్ల ఎప్పటికీ మిలియనీర్లు అవ్వలేరు. ఒకవేళ అయినా డబ్బు ఎక్కువ కాలం నిలవదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..