Citroen Basalt: సిట్రోయెన్‌ బసాల్ట్‌ ధరలు ఫిక్స్‌.. కార్ల డెలివరీలు ఎప్పటి నుంచి అంటే..?

|

Aug 18, 2024 | 7:55 PM

భారతదేశంలో ఆటోమొబైల్‌ మార్కెట్‌ వేగంగా వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో కార్లు కొనుగోళ్లు తారాస్థాయికు చేరాయి. అనూహ్య డిమాండ్‌కు అనుగుణంగా వివిధ కంపెనీలు సూపర్‌ ఫీచర్లతో కార్లను రిలీజ్‌ చేస్తున్నాయి. ఇటీవల ప్రముఖ కంపెనీ సిట్రోయెన్‌ బసాల్ట్‌ పేరుతో బ్రాండ్‌ కూపే ఎస్‌యూవీను ప్రకటించిన విషయం తెలిసింది. సిట్రోయెన్ ఇండియా ఇటీవల బసాల్ట్ మోడల్‌కు సంబంధించిన వివిధ వేరియంట్స్ ధరలను కూడా ప్రకటించింది. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా వివిధ వేరియంట్‌ ధరలను ప్రకటించింది.

Citroen Basalt: సిట్రోయెన్‌ బసాల్ట్‌ ధరలు ఫిక్స్‌.. కార్ల డెలివరీలు ఎప్పటి నుంచి అంటే..?
Citroen Basalt Coupe
Follow us on

భారతదేశంలో ఆటోమొబైల్‌ మార్కెట్‌ వేగంగా వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో కార్లు కొనుగోళ్లు తారాస్థాయికు చేరాయి. అనూహ్య డిమాండ్‌కు అనుగుణంగా వివిధ కంపెనీలు సూపర్‌ ఫీచర్లతో కార్లను రిలీజ్‌ చేస్తున్నాయి. ఇటీవల ప్రముఖ కంపెనీ సిట్రోయెన్‌ బసాల్ట్‌ పేరుతో బ్రాండ్‌ కూపే ఎస్‌యూవీను ప్రకటించిన విషయం తెలిసింది. సిట్రోయెన్ ఇండియా ఇటీవల బసాల్ట్ మోడల్‌కు సంబంధించిన వివిధ వేరియంట్స్ ధరలను కూడా ప్రకటించింది. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా వివిధ వేరియంట్‌ ధరలను ప్రకటించింది. సిట్రోయెన్ బసాల్ట్ యూ, ప్లస్, మాక్స్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. బసాల్ట్ డెలివరీలు సెప్టెంబర్ 2024 మొదటి వారంలో ప్రారంభమవుతాయని కంపెనీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో సిట్రోయెన్‌ బసాల్ట్‌ ఎస్‌యూవీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

సిట్రోయెన్‌ బసాల్ట్‌ 1.2 ఎన్‌ఏ రూ.7,99,000గా నిర్ణయించారు. 1.2 ఎన్‌ఏ ప్లస్ రూ.9,99,000, 1.2 టర్బో ప్లస్ వేరియంట్‌ ధర రూ.11,49,000, 1.2 టర్బో ఎట్ ప్లస్ వేరియంట్‌ ధర రూ.12,79,000గా 1.2 టర్బో మ్యాక్స్‌ ధర రూ.12,28,000గా కంపెనీ పేర్కొంది. సిట్రోయెన్ బసాల్ట్ కారులో రెండు ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. మొదటిది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్. ఇది 80 బీహెచ్‌పీ శక్తిని 115 ఎన్‌ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ప్రత్యేకంగా 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్‌తో వస్తుంది. అలాగే 1.2-లీటర్ మూడు-సిలిండర్ టర్బోచార్జ్ పెట్రోల్ ఇంజన్. ఈ కారు 109 బీహెచ్‌పీ శక్తిని, 190 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సిట్రోయెన్ 1.2 లీటర్‌ పెట్రో వేరియంట్‌పై 18 కిలో మీటర్ల మైలేజ్‌, 1.2 టర్బో పెట్రోల్ మాన్యువల్ 19.5 కిలోమీటర్ల మైలేజ్‌ ఇస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. 

ఫీచర్ల విషయానికొస్తే సిట్రోయెన్ బసాల్ట్ ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్లైట్లు, 16 అంగుళాల అల్లాయ్ వీల్స్, ర్యాప్రెండ్ టెయిల్ లైట్లు, వెనుక ఎయిర్ కండిషనింగ్ వెంట్లు వంటి ఫీచర్లు ఆకట్టుకుంటాయి. ఈ కూపే ఎస్‌యూవీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌తో పాటు వైర్లెస్ యాపిల్‌ కార్‌ ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటోకు మద్దతు ఇచ్చే 10.25-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో వస్తుంది.ప్రయాణికులు భద్రత విషయానికి వస్తే ఈ కూపే ఎస్‌యూవీలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్‌సీ), పార్కింగ్ సెన్సార్లతో కూడిన వెనుక పార్కింగ్ కెమెరా, ట్రైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు కొనుగోలుదారులను అమితంగా ఆకర్షిస్తాయని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..