AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Epic Electric Scooter: మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. రూ. 85వేలలో మంచి ఫీచర్స్‌

ఎపిక్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ స్కూటర్‌ను తక్కువ ధరలో మంచి ఫీచర్లతో తీసుకొచ్చారు. ఈ స్కూటర్‌ ఫీచర్ల విషయానికొస్తే ఈ స్కూటర్‌ను ఒక్కసారిగా ఛార్జ్‌ చేస్తే 100 కి.మీలు దూసుకొళ్లొచ్చు. ఈ స్కూటర్‌ గరిష్టంగా గంటకు 65 కి.మీల వేగంతో దూసుకుపోతుంది. ధర విషయానికొస్తే ఈ ఎపిక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ధర రూ. 84,999 ఎక్స్‌ షోరూమ్‌ ధరగా నిర్ణయించారు...

Epic Electric Scooter: మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. రూ. 85వేలలో మంచి ఫీచర్స్‌
Epic Scooter
Narender Vaitla
|

Updated on: Aug 18, 2024 | 6:57 PM

Share

ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం భారీగా పెరిగింది. ఇంధన ధరలు పెరుగుతుండడం, పర్యావరణ పరిపరక్షణ కోసం ప్రభుత్వాలు సైతం రాయితీలు ప్రకటించడంతో కంపెనీలు పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్‌ వాహనాలను తయారు చేస్తున్నాయి. ప్రముఖ ఆటో మొబైల్‌ సంస్థలన్నీ ఎలక్ట్రిక్‌ వేరియంట్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను తీసుకొచ్చారు. ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ BattRE మార్కెట్లోకి కొత్త స్కూటర్‌ను లాంచ్‌ చేశారు.

ఎపిక్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ స్కూటర్‌ను తక్కువ ధరలో మంచి ఫీచర్లతో తీసుకొచ్చారు. ఈ స్కూటర్‌ ఫీచర్ల విషయానికొస్తే ఈ స్కూటర్‌ను ఒక్కసారిగా ఛార్జ్‌ చేస్తే 100 కి.మీలు దూసుకొళ్లొచ్చు. ఈ స్కూటర్‌ గరిష్టంగా గంటకు 65 కి.మీల వేగంతో దూసుకుపోతుంది. ధర విషయానికొస్తే ఈ ఎపిక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ధర రూ. 84,999 ఎక్స్‌ షోరూమ్‌ ధరగా నిర్ణయించారు. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 60వీ 40ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. బ్యాటరీ ప్యాక్‌ ఐపీ67 రేటెడ్‌ను ఇచ్చారు. దీంతో బ్యాటరీ నీరు, దుమ్ము నుంచి రక్షణ పొందొచ్చు.

ఇక స్కూటీ బ్యాటరీపై కంపెనీ మూడేళ్లు వారంటీ లేదా 30 వేల కి.మీల వారంటీని అందిస్తున్నారు. ఇందులో లిథియం-అయాన్ బ్యాటరీని ఇచ్చారు. రీమూవబుల్ బ్యాటరీ కావడంతో స్కూటర్‌ ఛార్జింగ్ సులభంగా చేసుకోవచ్చు. ఇక ఈ స్కూటీలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరో అంశం.. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్. దీంట్లో బ్యాటరీలో ఉన్న ఛార్జింగ్ ఎంత మైలేజ్‌ ఇవ్వనుంది, బ్యాటరీ ఉష్ణోగ్రత, ఛార్జింగ్ సమయం వంటి సమాచారాన్ని చూపిస్తుంది. ఈ స్కూటీ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్‌ కావడానికి 5 గంటల సమయం పడుతుంది.

ఈ స్కూటర్‌ను ఎక్రూ ఎల్లో, స్టార్మీ గ్రే, మిడ్‌నైట్ బ్లాక్, క్యాండీ రెడ్, స్టార్‌లైట్ బ్లూ, ఐస్ బ్లూ, పెరల్ వైట్, కాస్మిక్ బ్లూ, గన్‌మెటల్, బ్లేజింగ్ బ్రాంజ్, హంటర్ గ్రీన్ బ్లాక్, గోల్డ్ రష్ కలర్స్‌లో తీసుకొచ్చారు. ఈ సంస్థ వ్యవస్థపాకులు నిశ్చల్‌ చౌదరి మాట్లాడుతూ.. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా ఈ సరికొత్త స్కూటర్‌ను తీసుకొచ్చామని తెలిపారు. సరికొత్త ఫీచర్లతో ఈ స్కూటర్‌ను తక్కువ ధరలో తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..