Xiaomi Enter Into Car Business: భారతీయ స్మార్ట్ ఫోన్ యూజర్లకు షావోమి కంపెనీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతి తక్కువ కాలంలో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుందీ బ్రాండ్. అయితే ఇప్పటి వరకు తక్కువ ధరకు అత్యాధునిక ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్‌లను అందించిన షావోమి తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకునే దిశలో అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లకు ప్రాధాన్యత పెరుగుతోంది. ప్రభుత్వాలు ఈ కార్ల ఉత్పత్తికి సహకారం అందిస్తుండడం, ప్రజలు కూడా విద్యుత్ ఆధారిత వాహనాలకు మొగ్గుచూపుతుండడంతో టెస్లా వంటి ప్రముఖ కార్ల కంపెనీలు సైతం విద్యుత్‌తో నడిచే వాహనాల తయారీలోకి దిగుతున్నాయి. ఈ క్రమంలోనే షావోమి కూడా ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి రంగం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు షావోమి ఇప్పటికే ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు గ్రేట్ వాల్ మోటర్స్‌తో ఓ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ రెండు కంపెనీల భాగస్వామ్యంతో సొంతంగా విద్యుత్ వాహనాలను రూపొందించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇక ఈ వార్త బయటకు రాగానే గ్రేట్ వాల్ కంపెనీ షేర్లు ఓ రేంజ్‌లో పెరిగాయి. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే ఇటు షావోమి లేదా.. గ్రేట్ వాల్ స్పందించేంత వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే గ్రేట్ వాల్ సంస్థ ఈ ఏడాది ఎలక్ట్రిక్, స్మార్ట్ వాహనాల తయారీలో భాగంగా తన సొంత బ్రాండ్‌ను విడుదల చేసింది. ఇక ఇప్పటికే బిఎమ్‌డబ్ల్యూతో కలిసి చైనాలో ఎలక్ట్రిక్ వాహనాల ఫ్యాక్టరీని నిర్మిస్తోంది.
Also Read: Bank Privatisation: 70 మిలియన్ల ఖాతాదారులకు శుభవార్త.. ప్రైవేటీకరించబడని బ్యాంకులు ఇవే..
Low Credit Score: క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందా? రుణం ఇవ్వమన్నారా? అయితే ఇలా ప్రయత్నించి చూడండి..