Electric Scooter: విభిన్నంగా ఉండాలనుకొనే మహిళల కోసమే ఈ-స్కూటర్.. ఎంత క్యూట్‌గా ఉందో చూశారా? సింగిల్ చార్జ్‌పై 115 కిమీ..
చైనాకు చెందిన నైన్ బాట్(Ninebot) అనే కంపెనీ క్యూట్ లుక్ లో ఓ స్మార్ట్ ఎలక్ట్రిక్ మోపెడ్ ను లాంచ్ చేసింది. ది నైన్ బాట్ క్యూ80సీ పేరుతో దీనిని చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. ముఖ్యంగా మహిళల కోసం ఈ లోస్పీడ్, స్మార్ట్, క్యూట్ స్కూటర్ ని తీసుకొచ్చింది.

వినియోగదారుల అభిరుచి ఎప్పటికప్పుడు మారిపోతోంది. ముఖ్యంగా వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు మరింత కొత్తగా ఆలోచిస్తున్నారు. అందరికన్నా విభిన్నంగా తమ వాహనాలు ఉండాలని చాలా మంది కోరుకొంటున్నారు. మీరు కూడా అటువంటి ఆలోచనలతోనే ఉంటే ఈ కథనం మీకోసమే. చైనాకు చెందిన నైన్ బాట్(Ninebot) అనే కంపెనీ క్యూట్ లుక్ లో ఓ స్మార్ట్ ఎలక్ట్రిక్ మోపెడ్ ను లాంచ్ చేసింది. ది నైన్ బాట్ క్యూ80సీ పేరుతో దీనిని చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. ముఖ్యంగా మహిళల కోసం ఈ లోస్పీడ్, స్మార్ట్, క్యూట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని తీసుకొచ్చింది. ఈ నైన్ బాట్ క్యూ80సీ స్కూటర్ రేంజ్ 115 కిలోమీటర్లు ఉంటుంది. గరిష్ట వేగం గంటకు 45 కిలోమీటర్లు ఉంటుంది. ఈ స్కూటర్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
నైన్ బాట్ క్యూ80సీ స్పెసిఫికేషన్లు..
ఈ స్కూటర్ లో రైడీ లాంగ్ బ్యాటరీ ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్ పై 115కిలోమీటర్లు ప్రయాణించగలుగుతుంది. గేర్లు కలిగిన ఈ స్కూటర్ మొదటి గేర్ లో గంటకు 25 కిలోమీటర్లు, రెండో గేర్ లో గంటకు 32 కిలోమీటర్లు, మూడో గేర్లో గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
ఫీచర్లు ఇలా..
ఈ నైన్ బాట్ క్యూ 80సీ స్కూటర్ లో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్(టీసీఎస్) ఉంటుంది. ఇది రోడ్డుపై స్టిఫ్ గా ప్రయాణించడానికి మంచి గ్రిప్ ను అందిస్తుంది. ముఖ్యంగా వర్షం కురుస్తున్న సమయంలో బ్యాలెన్స్ మిస్ అవ్వకుండా సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తోంది. దీనిలో పుష్ మోడ్, ర్యాంప్ పార్కింగ్, వన్ బటన్ రివర్సింగ్ ఫీచర్లు ఉన్నాయి. ఇంటెలిజెంట్ ఎల్ ఈడీ లైటింగ్ సిస్టమ్ ముందు, వెనుక కూడా ఉంది. హ్యాండిల్ బార్ సుపీరియర్ క్లీనింగ్ కోసం యాంటీ బాక్టీరియల్ గ్రిప్‌లతో ఎస్ఐఏఏ సర్టిఫికెట్ పొందింది.



ధర ఎంతంటే..
ఈ స్కూటర్ ధర చైనాలో 3,799 యువాన్లుగా ఉంది. మన కరెన్సీలో దీని ధర దాదాపు రూ. 44,967గా ఉండొచ్చు. ప్రస్తుతం దీనిని జేడీ డాట్ కామ్ నుండి కొనుగోలు చేయవచ్చు. మన దేశంలో ఈ స్కూటర్ లభ్యత గురించి కంపెనీ ఎటువంట ప్రకటనా చేయలేదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




