బ్యాంక్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఆర్బీఐ కొత్త రూల్స్.. ఇక నుంచి అన్ని బ్యాంకుల్లో ఆసేవలు అందుబాటులోకి..
త్వరలో బ్యాంక్ కస్టమర్లకు ఆర్బీఐ గుడ్‌న్యూస్ అందించనుంది. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులలో చెక్ ప్రాసెస్‌ను వేగవంతం చేయడానికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ తీసుకురానుంది.
త్వరలో బ్యాంక్ కస్టమర్లకు ఆర్బీఐ గుడ్‌న్యూస్ అందించనుంది. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులలో చెక్ ప్రాసెస్‌ను వేగవంతం చేయడానికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ తీసుకురానుంది. దీంతో బ్యాంక్ కస్టమర్లకు ఊరట కలగనుంది. చెక్ ట్రంకేషన్ సిస్టంను అన్ని బ్రాంచులోకి అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది.
సెప్టెంబర్ 2021 నుంచి దేశంలోని అన్ని బ్యాంకులలో ఈ చెక్ ట్రంకేషన్ సిస్టం అమలులోకి తీసుకురానున్నట్లుగా ఆర్బీఐ స్పష్టం చేసింది. దీనివలన కాగిత రహిత ట్రన్సెక్షన్స్ వేగవంతం కానున్నాయి. సాధ్యమైనంత తొందరగా ఈ చెక్ ప్రాసెస్‌ను అమలు చేయనున్నట్లుగా తెలిపింది. ఇందుకోసం ఆర్బీఐ వచ్చే నెలలో కొత్త రూల్స్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇదిలా ఉండగా.. 2010 సంవత్సరం నుంచి ఈ చెక్ ట్రంకేషన్ సిస్టం అందుబాటులో ఉంది. దేశ వ్యాప్తంగా 1,50,000 బ్రాంచుల్లో ఫెసిలిటీ ఆందుబాటులో ఉంది. ఇంకా 18 వేలకు పైగా బ్యాంక్ బ్రాంచుల్లో ఈ విధానం అమలులో లేదు. సెప్టెంబర్ వరకు ఈ బ్యాంకు బ్రాంచుల్లోనూ సీటీఎస్ విధానం అమలులోకి రానుంది. ఆర్బీఐ కొత్త రూల్స్ ప్రకారం.. బ్యాంక్ కస్టమర్లకు ప్రయోజనం చేకూరనుంది. చెక్ లావాదేవీలు తొందరగా పూర్తవుతాయి. ఇకపై చెక్ ట్రాన్సాక్షన్లకు ఇబ్బందులు పడాల్సి ఉండదు. దీంతోపాటు బ్యాంకులకు కూడా పలు ఖర్చులు తగ్గుతాయి.
Also Read: వ్యాక్సిన్ ప్రభావం 28 రోజుల తర్వాతే! ఫైబర్ టీకా గురించి కీలక విషయాలు.. ఎలా పని చేస్తుందంటే.?