AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంబానీ ఇంట్లో చపాతీలు చేసే వ్యక్తి జీతం ఎంతో తెలుసా..? ఈ లెక్కలు తెలిస్తే నోరెళ్లబెడతారు..

ముఖేష్ అంబానీ ఆంటిలియా గురించి ఎంత చెప్పిన తక్కువే.. అక్కడ వంట చేసే వారికి ఇచ్చే జీతం ఎంతో తెలిస్తే మాత్రం మీరు నోరెళ్లబెట్టాల్సిందే. ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ లేదా సీనియర్ ప్రభుత్వ అధికారి సంపాదన కంటే వీరి జీతాలే ఎక్కువట. కేవలం చపాతీలు చేసే వ్యక్తికి లక్షల్లో జీతాలు ఉండడం గమనార్హం. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

అంబానీ ఇంట్లో చపాతీలు చేసే వ్యక్తి జీతం ఎంతో తెలుసా..? ఈ లెక్కలు తెలిస్తే నోరెళ్లబెడతారు..
Mukesh Ambani Antilia Chef Salary
Krishna S
|

Updated on: Apr 14, 2026 | 11:17 AM

Share

ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ విలాసవంతమైన ఆంటిలియా ఇళ్లు గురించి అందరికీ తెలిసిందే. కానీ ఆయన ఇంట్లో చపాతీలు చేసే వ్యక్తికి ఇచ్చే జీతం ఒక ప్రభుత్వ అధికారి లేదా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సంపాదన కంటే ఎక్కువగా ఉంటుందని మీకు తెలుసా? 27 అంతస్తుల భారీ భవనం ఆంటిలియాలో పనిచేసే కిచెన్ నిపుణుల గురించి కొన్ని ఆసక్తికరమైన నిజాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ, ముఖేష్ అంబానీ ఆహారం విషయంలో చాలా నిరాడంబరంగా ఉంటారు. ఆయన పూర్తి శాకాహారి. బయట ఎన్ని ఖరీదైన హోటళ్లు ఉన్నా, ఆయనకు తన ఇంట్లో వండిన రోటీ, అన్నం, పప్పు అంటేనే అమితమైన ఇష్టం. ప్రతి ఆదివారం ఇడ్లీ సాంబార్‌ను ఇష్టంగా తినే అంబానీ, అప్పుడప్పుడు థాయ్ ఫుడ్‌ను కూడా ఆస్వాదిస్తుంటారు. ఈ రుచులను అందించడానికి ఆంటిలియాలో ఒక ప్రత్యేక వంట బృందమే ఉంది.

నెలకు రూ. 2 లక్షల జీతం..

మీడియా నివేదికల ప్రకారం.. అంబానీ ఇంట్లో పనిచేసే హెడ్ చెఫ్‌లకు నెలకు సుమారు రూ.2 లక్షల వరకు జీతం చెల్లిస్తారు. అంటే వీరి వార్షిక ఆదాయం దాదాపు రూ.24 లక్షలు. కేవలం జీతం మాత్రమే కాదు, వీరికి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా సౌకర్యం ఉంటుంది. వీరి పిల్లల చదువుల ఖర్చులను కూడా అంబానీ కుటుంబమే భరిస్తుంది. నివాసం ఉండే ఉద్యోగులకు ఉచిత భోజనం, వసతి కల్పిస్తారు.

ప్రొఫెషనల్ చెఫ్‌లు.. ఆధునిక టెక్నాలజీ

అక్కడ పనిచేసేవారు సాధారణ వంటవాళ్లు కాదు. వారంతా పేరున్న సంస్థల నుండి హోటల్ మేనేజ్‌మెంట్ డిగ్రీలు పొందిన నిపుణులు. ఆంటిలియాలో నివసించే కుటుంబ సభ్యులతో పాటు అక్కడ పనిచేసే సుమారు 600 మంది ఉద్యోగుల కోసం ప్రతిరోజూ వేల సంఖ్యలో రొట్టెలు తయారవుతాయి. రోజుకు సుమారు 4,000 రొట్టెలు తయారు చేయడానికి అత్యాధునిక యంత్రాలను ఉపయోగిస్తారు. ప్రపంచ స్థాయి హోటళ్లలో ఉండే నాణ్యత, పరిశుభ్రత ఇక్కడ పాటిస్తారు.

ఒక కార్పొరేట్ ఆఫీసులాంటి మేనేజ్‌మెంట్

ఆంటిలియా నిర్వహణ ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీని నడపడం లాంటిది. అక్కడ పనిచేసే ప్రతి ఉద్యోగికి వారి విద్యార్హతలు, అనుభవం ఆధారంగా కార్పొరేట్ స్థాయిలో వేతనాలు అందుతాయి. అంబానీ తనను నమ్ముకుని పనిచేసే సిబ్బందిని తన కుటుంబ సభ్యుల్లాగే చూసుకుంటారని, అందుకే వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తారని చెబుతుంటారు.

Follow Us
తెలుగులో ఆయన పెద్ద హీరో.. కానీ ఫుల్ హార్డ్ వర్కర్..
తెలుగులో ఆయన పెద్ద హీరో.. కానీ ఫుల్ హార్డ్ వర్కర్..
ట్రాఫిక్‌ను దాటుకుని.. మృత్యువుపై గెలిచి Hyd మెట్రో రేర్ రికార్డ్
ట్రాఫిక్‌ను దాటుకుని.. మృత్యువుపై గెలిచి Hyd మెట్రో రేర్ రికార్డ్
అఫీషియల్.. ఓటీటీలోకి ‘లెనిన్’! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
అఫీషియల్.. ఓటీటీలోకి ‘లెనిన్’! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నెహ్రూ జూపార్క్‌కు వెళుతున్నారా..? టికెట్ల ధరలు పెరిగాయ్..
నెహ్రూ జూపార్క్‌కు వెళుతున్నారా..? టికెట్ల ధరలు పెరిగాయ్..
ఆగస్టు నెలలో ముఖ్యమైన పండుగలు 2026: శ్రావణ మాస విశేషాలతో పూర్తి..
ఆగస్టు నెలలో ముఖ్యమైన పండుగలు 2026: శ్రావణ మాస విశేషాలతో పూర్తి..
నాటు కోడి స్టైల్‌లో బ్రాయిలర్ చికెన్.. ఇలా వండితే నీచు వాసన ఉండదు
నాటు కోడి స్టైల్‌లో బ్రాయిలర్ చికెన్.. ఇలా వండితే నీచు వాసన ఉండదు
విజయ్ దళపతి కొడుకు ఫస్ట్ రియాక్షన్.. ఆకట్టుకుంటున్న మాటలు..
విజయ్ దళపతి కొడుకు ఫస్ట్ రియాక్షన్.. ఆకట్టుకుంటున్న మాటలు..
భావోద్వేగాలను ఎలా కంట్రోల్ చేసుకోవాలి? - జిడ్డు కృష్ణమూర్తి
భావోద్వేగాలను ఎలా కంట్రోల్ చేసుకోవాలి? - జిడ్డు కృష్ణమూర్తి
రూ.లక్ష పెట్టుబడితో భవిష్యత్తుకు భరోసా
రూ.లక్ష పెట్టుబడితో భవిష్యత్తుకు భరోసా
916 రేటింగ్ పాయింట్లతో చరిత్ర.. టీ20ల్లో ఈషాన్ కొత్త రికార్డ్
916 రేటింగ్ పాయింట్లతో చరిత్ర.. టీ20ల్లో ఈషాన్ కొత్త రికార్డ్