AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Food Delivery Apps: ఫుడ్ డెలివరీ యాప్ లకు కేంద్రం అల్టిమేటం.. 15 రోజుల్లో బదులివ్వాలని డెడ్ లైన్..

Food Delivery Apps: గతంలో హోటళ్లు వినియోగదారుల నుంచి సర్వీస్ ఛార్జీలను వసూలు చేసేవి. వీటిపై కేంద్రం ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసింది.

Food Delivery Apps: ఫుడ్ డెలివరీ యాప్ లకు కేంద్రం అల్టిమేటం.. 15 రోజుల్లో బదులివ్వాలని డెడ్ లైన్..
Zomato
Ayyappa Mamidi
|

Updated on: Jun 14, 2022 | 2:48 PM

Share

Food Delivery Apps: గతంలో హోటళ్లు వినియోగదారుల నుంచి సర్వీస్ ఛార్జీలను వసూలు చేసేవి. వీటిపై కేంద్రం ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సారి మరో అడుగు ముందుకు వేసి.. వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై స్పందింస్తోంది. దీనిని అరికట్టేందుకు ముందడుగు వేస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే కొత్త మార్గదర్శకాలను తీసుకురానుందని తెలుస్తోంది. ఇదే క్రమంలో తాజాగా.. ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్స్‌ కార్యకలాపాలపై కూడా కేంద్రం కన్నేసింది. దేశంలో ఫుడ్ డెలివరీ సర్వీసెస్ అందింస్తున్న.. స్విగ్గి, జొమాటొ, ఉబేర్ ఈట్స్ వంటి సంస్థల వినియోగదారులనుంచి వస్తున్న ఫిర్యాదులపై స్పందించింది.

కస్టమర్లు చేస్తున్న ఫిర్యాదులపై సదరు డెలివరీ కంపెనీలు ఎలాంటి చర్యలు తీసుకున్నాయో తెలుసుకునే పనిలో పడింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని ఆదేశాలు జారీ చేసింది. ఫిర్యాదుల పరిష్కారానికి ఎలాంటి పద్ధతులను అనుసరిస్తున్నారో తెలియజేయాలని వెల్లడించింది. సేవలను మెరుగుపర్చుకోవడానికి తీసుకుంటున్న చర్యల వివరాలను తప్పకుండా అందించాలని కోరింది. ఇందుకోసం సదరు సంస్థలకు 15 రోజుల గడువును అందించింది. త్వరలోనే ఫుడ్ ఆపరేటర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో.. ఈ వ్యవహారంలో ఓ సమావేశాన్ని నిర్వహిస్తామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్‌ కుమార్‌ సింగ్‌ అన్నారు. సంవత్సరంలో నేషనల్ కన్జూమర్‌ హెల్ప్‌లైన్‌‌కు అనేక ఫిర్యాదులు అందటంతో కేంద్రం స్పందించినట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు జొమాటోపై 2,828 ఫిర్యాదులు, స్విగ్గీపై 3,631కంప్లెయింట్స్ అందాయని తెలుస్తోంది. మిగిలిన ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సేవలందిస్తున్న కంపెనీలపై కూడా ఇదే తరహాలో వేల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని కేంద్రం వెల్లడించింది. ఆర్డర్లపై దాదాపు 20 శాతం వరకు కంపెనీలు కమిషన్ తీసుకుంటున్నాయని, డెలివరీ ఛార్జీలను సైతం భారీగా పెంచాయని అనేక మంది నుంచి ఫిర్యాదులు అందాయని తెలుస్తోంది.