AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax: పన్ను చెల్లింపుదారులకు శుభవార్త.. ఐటీఆర్-యూపై ఆ నిబంధన తెలుసా?

పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఉపశమనం కలిగించే విధంగా కేంద్ర బడ్జెట్-2025లో కీలక నిర్ణయం తీసుకున్నారు. అప్‌డేటెడ్ ఐటీ రిటర్న్‌లను (ఐటీఆ-యూ) దాఖలు చేయడానికి గడువును సంబంధిత అంచనా సంవత్సరం ముగిసిన తర్వాత 2 సంవత్సరాల నుండి 4 సంవత్సరాలకు పొడిగించింది. అంట మీరు నాలుగు సంవత్సరాల క్రితం వరకు చేసిన ఫైలింగ్‌లను సరిదిద్దాల్సి వస్తే ఇప్పుడు మీకు కొత్త అవకాశం ఉంటుంది. కేంద్ర తీసుకొచ్చిన ఈ తాజా నిబంధన గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Income Tax: పన్ను చెల్లింపుదారులకు శుభవార్త.. ఐటీఆర్-యూపై ఆ నిబంధన తెలుసా?
Itr Filing
Nikhil
|

Updated on: Jun 12, 2025 | 2:53 PM

Share

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139(8ఏ) కింద 2022 బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన ఐటీఆర్-యూ ద్వారా వర్తించే పన్ను, వడ్డీ, అదనపు రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చెల్లింపులు చేసిన పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్ను రిటర్న్‌లను నిర్దిష్ట వ్యవధిలో స్వచ్ఛందంగా అప్‌డేట్ చేయడానికి అనుమతి ఉంటుంది. ముఖ్యంగా ప్రాసిక్యూషన్ లేదా భారీ పరిశీలనను ఎదుర్కోకుండా వ్యక్తులు, వ్యాపారస్తులకు ఇది సువర్ణ అవకాశం అని నిపుణులు చెబుతున్నారు. 2025 బడ్జెట్‌కు ముందు ఈ విండో అసెస్‌మెంట్ సంవత్సరం చివరి నుంచి 24 నెలలకు (2 సంవత్సరాలు) పరిమితం చేశారు. అయితే ఏప్రిల్ 1, 2025 నుంచి (బడ్జెట్ 2025 ప్రకటన తర్వాత), ఈ విండోను 48 నెలలకు (4 సంవత్సరాలు) రెట్టింపు చేశారు.

నాలుగేళ్ల ఐటీఆర్ దాఖలు సాధ్యమేనా?

ఆదాయపు పన్ను నిబంధనలు రిటర్న్‌లను దాఖలు చేయడానికి గడువు తేదీ తర్వాత కూడా సెక్షన్ 139(4)/ సవరించిన రిటర్న్‌ను సెక్షన్ 139(5) కింద ఆలస్యంగా దాఖలు చేయడానికి అనుమతిస్తాయి. అయితే పేర్కొన్న రిటర్న్‌లను అసెస్‌మెంట్ సంవత్సరం (ఏవై) డిసెంబర్ 31 వరకు మునుపటి సంవత్సరం (పీవై)కి మాత్రమే దాఖలు చేయవచ్చు. అయితే సంబంధిత అసెస్‌మెంట్ సంవత్సరం ముగింపు నుంచి 4 సంవత్సరాల వరకు అప్‌డేటెడ్ రిటర్న్ (ఐటీఆర్-యూ)ను 139(8ఏ) కింద దాఖలు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలా దాఖలు చేసే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • అసెస్‌మెంట్ సంవత్సరం ముగిసిన 12 నెలల్లోపు ఐటీఆర్-యూ దాఖలు చేస్తే ప్రకటించిన పన్నులో 25 శాతం (లేదా అదనపు పన్ను) చెల్లించాలి. అదేవిధంగా అసెస్‌మెంట్ సంవత్సరం ముగిసిన 24 నెలల్లోపు, 36 నెలల్లోపు (బడ్జెట్ 2025 ద్వారా చేర్చారు). 48 నెలల్లోపు (బడ్జెట్ 2025 ద్వారా చేర్చారు). ఐటీఆర్-యూ దాఖలు చేసినందుకు అదనపు పన్నులో 50 శాతం నుంచి 70 శాతం చెల్లించాలి. 
  • అప్‌డేటెడ్ రిటర్న్‌ను ఒక నిర్దిష్ట సంవత్సరానికి ఒకసారి మాత్రమే దాఖలు చేయవచ్చు.
  • నష్టాలను క్లెయిమ్ చేయడానికి లేదా పన్ను బాధ్యతలో తగ్గింపు లేదా వాపసు పెరుగుదలకు ఐటీఆర్-యూ దాఖలు చేయలేరు.
  • అసెస్‌మెంట్ పూర్తయినా లేదా ప్రస్తుతం జరుగుతున్నా లేదా సర్వే, తనిఖీ సంబంధిత కేసుల కోసం కూడా ఐటీఆర్-యూ దాఖలు చేయలేరు.

2023-24 సంవత్సరానికి ఐటీఆర్ దాఖలు ఇలా

పన్ను చెల్లింపుదారుడు డిసెంబర్ 31 వరకు ఆలస్యమైన రిటర్న్‌ను రూ. 5,000 జరిమానా, వర్తించే వడ్డీతో దాఖలు చేయవచ్చు. పన్ను విధించదగిన ఆదాయం రూ. 5 లక్షల కంటే తక్కువ ఉంటే జరిమానా రూ. 1,000 కాదు. పన్ను విధించదగిన ఆదాయం రూ. 2.5 లక్షల కంటే తక్కువ ఉంటే ఎటువంటి జరిమానా విధించరు. డిసెంబర్ 31 గడువు కూడా తప్పితే పన్ను చెల్లింపుదారుడు ఐటీఆర్-యూ దాఖలు చేయవచ్చు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి