Rs 2,000 Note Exchange: పోస్ట్ ఆఫీసుల్లో రూ. 2,000నోట్లను మార్చుకోవచ్చా? ఆర్బీఐ నిబంధనలు ఏం చెబుతున్నాయి.. తెలుసుకోండి..

మే 23, 2023 నుండి 2000 రూపాయల నోట్లను డిపాజిట్ చేయడం లేదా మార్చుకోవడం ప్రారంభం అయ్యింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకు ఖాతాలలో డిపాజిట్ చేయొచ్చు లేదా పరిమిత సంఖ్యలో నోట్లను మార్చుకోవచ్చు. దీనికోసం ఎటువంటి ఫారాలు కూడా పూర్తి చేయాల్సిన అవసరం లేదు.

Rs 2,000 Note Exchange: పోస్ట్ ఆఫీసుల్లో రూ. 2,000నోట్లను మార్చుకోవచ్చా? ఆర్బీఐ నిబంధనలు ఏం చెబుతున్నాయి.. తెలుసుకోండి..
2000 Rupes Notes
Follow us

|

Updated on: May 24, 2023 | 5:30 PM

ప్రస్తుతం ట్రెండింగ్ న్యూస్ రూ. 2000 నోటు ఉపసంహరణ.. ఎక్కడ చూసిన దీని గురించే చర్చ నడుస్తోంది. ఏ టీవీ చానల్ పెట్టినా దీనిపైనే స్పెషల్ స్టోరీలు కనిపిస్తున్నాయి. రూ. 2000 నోట్లను ఉపసంహరించుకున్న ఆర్బీఐ వాటిని మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. 2023 సెప్టెంబర్ 30 వరకూ అన్ని బ్యాంకులు, 19 ఆర్బీఐ రీజనల్ సెంటర్లలోనూ మార్చుకోవచ్చని ప్రకటించింది. అంతేకాక ఈ పెద్ద నోటు లీగల్ టెండర్ గా వినియోగంలోనే ఉంటుందని పేర్కొంది. ఇప్పుడే అసలు ట్విస్ట్ కనిపిస్తుంది. ఒకవైపు ఉపసంహరించుకున్నట్టు ప్రకటించి.. మరోవైపు చట్టబద్ధమైన టెండర్ గానూ వినియోగించుకోవచ్చన్న మాట చాలా మందిలో గందరగోళాన్ని నింపింది. ఈ నోట్లను బ్యాంకులు లేదా ఆర్బీఐ రీజనల్ సెంటర్లలోనూ కాకుండా మరెక్కడైనా మార్చుకోవచ్చా? ఉదాహరణకు మన దేశంలో పోస్ట్ ఆఫీసు కూడా సాధారణ బ్యాకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తాయి. మరక్కడ మార్చుకునే వీలుందా? పోస్ట్ ఆఫీసులో రూ. 2,000 నోటు డిపాజిట్ చేయొచ్చా? ఆర్బీఐ నిబంధనలు ఏం చెబుతున్నాయి? తెలుసుకుందాం రండి..

మే 23, 2023 నుండి 2000 రూపాయల నోట్లను డిపాజిట్ చేయడం లేదా మార్చుకోవడం ప్రారంభం అయ్యింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకు ఖాతాలలో డిపాజిట్ చేయొచ్చు లేదా పరిమిత సంఖ్యలో నోట్లను మార్చుకోవచ్చు. దీనికోసం ఎటువంటి ఫారాలు కూడా పూర్తి చేయాల్సిన అవసరం లేదు. రోజుకు రూ. 20,000 విలువ కలిగిన నోట్లను మార్చుకోవచ్చు. అలాగే ఎటువంటి పరిమితులు లేకుండా బ్యాంకుల్లో డిపాజిట్ చేయవచ్చు.

పోస్ట్ ఆఫీసుల్లో కూడా చేయవచ్చు..

పోస్ట్ ఆఫీసుల్లో రూ. 2000 నోటుని డిపాజిట్ చేసుకోవచ్చు. కానీ ఖాతాదారుడు కేవైసీ పూర్తి చేసి ఉండాలి. ఎక్కువ మొత్తంలో డిపాజిట్ చేయాలంటే పాన్ కార్డు కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

సౌలభ్యం కోసమే..

రూ.2,000 నోట్లను ఉపసంహరించుకోవడం డీమోనిటైజేషన్ కాదని, చట్టబద్ధమైన చర్య అని, కార్యాచరణ సౌలభ్యం కోసం వాటి మార్పిడిని ప్రారంభించే నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బిఐ ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. కార్యకలాపాల సౌలభ్యాన్ని నిర్ధారించడానికి.. బ్యాంకు శాఖల సాధారణ కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా ఉండటానికి, ఆర్బీ రూ. 2,000 బ్యాంకు నోట్లను ఇతర డినామినేషన్ల బ్యాంక్ నోట్లలోకి మార్చుకోవచ్చు. అందుకోసం ఏ బ్యాంకులోనైనా ఒకేసారి రూ. 20,000 వరకు నోట్లను తీసుకోవచ్చు. ఈ రూ. 2,000 డినామినేషన్ బ్యాంక్ నోట్ నవంబర్ 2016లో ప్రవేశపెట్టింది, ఆ సమయంలో చలామణిలో ఉన్న అన్ని రూ. 500, రూ. 1,000 బ్యాంకు నోట్ల రద్దు చేసి, అప్పటి అవసరాల నేపథ్యంలో కొత్త నోటుని తీసుకొచ్చింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..