Post office: నెలకు వెయ్యి రూపాయలు పొదుపు చేస్తే.. లక్షాధికారి అయ్యే అవకాశం.

ప్రముఖ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పోస్టాఫీస్ పెట్టుబడి పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తక్కువ రిస్క్‌తో మంచి రిటర్న్స్‌ పొందే బెస్ట్‌ స్కీమ్ అందుబాటులో ఉంది. ఇంతకీ ఆ స్కీమ్‌ ఏంటి.? ఇందులో ఎంత పెట్టుబడి పెడితే ఎంత లాభం పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం. పబ్లిక్‌ ప్రావిడెంట్ ఫండ్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ స్కీమ్‌లో...

Post office: నెలకు వెయ్యి రూపాయలు పొదుపు చేస్తే.. లక్షాధికారి అయ్యే అవకాశం.
Post Office
Follow us

|

Updated on: May 12, 2024 | 4:05 PM

సంపాదించిన దాంట్లో ఎంతో కొంత మొత్తాన్ని పొదుపు చేసుకోవాలనే ఆలోచనలో ప్రతీ ఒక్కరూ ఉంటారు. ఇందుకోసం ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. కొందరు చిట్టిలు వేస్తుంటే, మరికొందరు స్టాక్‌ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే ఇవి కాస్త రిస్క్‌తో కూడకున్న అంశంగా చెప్పొచ్చు. మరి అలా కాకుండా ఎలాంటి రిస్క్‌ లేకుండా మంచి రిటర్న్స్‌ పొందే అవకాశం ఉంటే బాగుంటుంది కదూ! ఇలాంటి ఓ పథకం గురించే ఈ రోజు తెలుసుకుందాం.

ప్రముఖ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పోస్టాఫీస్ పెట్టుబడి పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తక్కువ రిస్క్‌తో మంచి రిటర్న్స్‌ పొందే బెస్ట్‌ స్కీమ్ అందుబాటులో ఉంది. ఇంతకీ ఆ స్కీమ్‌ ఏంటి.? ఇందులో ఎంత పెట్టుబడి పెడితే ఎంత లాభం పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం. పబ్లిక్‌ ప్రావిడెంట్ ఫండ్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ స్కీమ్‌లో రిస్క్‌ లేకుండా పెట్టుబడి పెట్టొచ్చు.

ఈ పథకం 15 ఏళ్లలో మెచ్యూర్‌ అవుతుంది. ఇందులో ఏడాదికి రూ. 500 నుంచి గరిష్టంగా రూ. లక్షన్నర వరకు డిపాజిట్ చేయొచ్చు. ఈ పథకంలో ప్రస్తుతం వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది. ఉదాహరణకు మీరు నెలకు రూ. 1000 పెట్టుబడి పెట్టుకుంటూ పోతే ఏకంగా రూ. 8 లక్షల వరకు పెంచుకోవచ్చు. ఇంతకీ రూ. 8 లక్షలు రిటర్న్‌ రావాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ పథకంలో నెలకు రూ. 1000 పెట్టుబడి పెడితే ఏడాదికి మొత్తం రూ. 12000 అవుతాయి. ఇలా 15 ఏళ్లపాటు పెట్టుబడి పెట్టాలి. 15 ఏళ్లకు మెచ్యూరిటీ అవుతుంది. అయితే 5 ఏళ్ల చొప్పున మరో రెండు డిడదలు పెట్టుబడి పెట్టుకుంటూ పోవాలి. ఇలా మొత్తం 25 ఏళ్ల పాటు ప్రతీ నెల రూ. 1000 పెట్టుబడి పెట్టుకుంటూ పోతే మొత్తం రూ. 3 లక్షలు అవుతుంది. వడ్డీరేటుతో పాటు మీ మెచ్యూరిటీ సమయానికి మొత్తం రూ. 8,24,641 సొంతం చేసుకోవచ్చు. అయితే 15 ఏళ్ల తర్వాత మీ స్కీమ్‌ను మరింత పొడగించుకోవాల్సి ఉంటే.. మీరు మెచ్యూరిటీ తేదీకి 1 ఏడాదికి ముందే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్